Begin typing your search above and press return to search.

డేంజరస్ డ్రైవింగ్.. అండర్‌వరల్డ్ డాన్ కొడుకుపై పోలీస్ కేసు

అది వేగమో లేక వినాశనమో తెలియదు కానీ, ఒక విలాసవంతమైన కారుతో చేసిన ప్రమాదకరమైన స్టంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి

By:  Madhu Reddy   |   23 March 2026 2:54 PM IST
డేంజరస్ డ్రైవింగ్.. అండర్‌వరల్డ్ డాన్ కొడుకుపై పోలీస్ కేసు
X

బెంగళూరు రోడ్లపై అర్ధరాత్రి వేళ లంబోర్గిని కారు ఇంజిన్ గర్జించింది. అది వేగమో లేక వినాశనమో తెలియదు కానీ, ఒక విలాసవంతమైన కారుతో చేసిన ప్రమాదకరమైన స్టంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి, ఒకప్పటి అండర్‌వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ కొడుకు రికీ రాయ్‌పై పోలీస్ కేసు వరకు వెళ్ళింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ కారులో ఉన్నది ఎవరు? అనే విషయాలు ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి..

లంబోర్గిని హల్‌చల్.. అసలేం జరిగింది?:

ఆదివారం తెల్లవారుజామున బెంగళూరు రోడ్లు నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఒక లగ్జరీ లంబోర్గిని కారు రోడ్డుపైకి వచ్చింది. డ్రైవర్ కారును ఇష్టారాజ్యంగా తిప్పుతూ, అతి వేగంతో డేంజరస్ స్టంట్లు చేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో జనం షాక్ అయ్యారు. పబ్లిక్ రోడ్లపై ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రాణాపాయం పొంచి ఉంటుందని నెటిజన్లు మండిపడ్డారు. ఇక ఈ వీడియో పోలీసుల కంట పడటంతో వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

డాన్ కొడుకు ఇంటికి చేరిన పోలీసులు:

వైరల్ వీడియో ఆధారంగా కారు నంబర్ ప్లేట్ సాయంతో పోలీసులు ఆ లగ్జరీ కారు ఎవరిదో కనిపెట్టారు. అది ఒకప్పటి బెంగళూరు అండర్‌వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ కొడుకు రికీ రాయ్ నివాసంలో ఉన్నట్లు గుర్తించారు. ఇక వెంటనే పోలీసులు రికీ రాయ్ ఇంటికి చేరుకుని ఆ లగ్జరీ కారును స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ముత్తప్ప రాయ్ పేరు చెబితేనే బెంగళూరు వణికిపోయేది, ఆయన మరణం తర్వాత ఆయన కొడుకు ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కారులో ఉన్నది రికీ రాయ్ కాదా?:

పోలీసులు రికీ రాయ్‌పై కేసు నమోదు చేసినప్పటికీ, ఆ సమయంలో కారు నడిపింది అతడేనా కాదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. రికీ రాయ్‌ని విచారిస్తున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ రికీ రాయ్ కాకుండా అతని స్నేహితులు ఎవరైనా ఈ స్టంట్లు చేశారా? లేక రికీనే స్వయంగా స్టీరింగ్ పట్టాడా? అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా చట్టం ముందు అందరూ సమానమేనని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

పబ్లిక్ సేఫ్టీ ముఖ్యం.. పోలీసుల హెచ్చరిక:

ఇక డబ్బుంది కదా అని లగ్జరీ కార్లతో రోడ్లపై విన్యాసాలు చేస్తే ఊరుకునేది లేదని బెంగళూరు పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి చర్యలు డ్రైవర్ ప్రాణాలకే కాదు, అటుగా వెళ్లే సామాన్య ప్రజల ప్రాణాలకు కూడా ముప్పేనని హెచ్చరిస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఘటన ద్వారా లగ్జరీ కార్లు ఉన్నవారు రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన పరిణామాలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

తండ్రి డాన్ కావొచ్చు, చేతిలో కోట్లు ఉండొచ్చు.. కానీ రోడ్డు మీదకు వస్తే ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. రికీ రాయ్ కేసులో తదుపరి దర్యాప్తులో ఏ నిజాలు బయటపడతాయో వేచి చూడాలి.