Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో మరో సునామీ: "కాక్రోచ్‌"ల దారిలోనే "రిజర్వేషన్ హఠావో"

మాకూ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదంటూ బరిలోకి దిగిన ఈ ఆజ్ఞాత గ్రూప్.. పేజీ పెట్టిన కొన్ని రోజులకే ఏకంగా 34 లక్షల ఫాలోవర్లను ఖాతాలో వేసుకుని డిజిటల్ దుమ్మురేపుతోంది.

By:  A.N.Kumar   |   27 July 2026 10:48 AM IST
సోషల్ మీడియాలో మరో సునామీ: కాక్రోచ్‌ల దారిలోనే రిజర్వేషన్ హఠావో
X

గతంలో చీఫ్ జస్టిస్ గారు అన్యాపదేశంగా నిరుద్యోగులను 'కాక్రోచ్‌లు' అన్నప్పుడు... "అవును మేం బొద్దింకలమే.. మా సత్తా చూపిస్తాం" అంటూ 'కాక్రోచ్ జనతా పార్టీ' పేరుతో ఇంటర్నెట్ లో రచ్చ రచ్చ చేసి.. నీట్ రగడతో వ్యవస్థనే ఊపేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాతో మరో కొత్త రచ్చ సోషల్ మీడియా తలుపు తట్టింది. అదే ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ (ఆర్.హెచ్ఏ).. మాకూ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదంటూ బరిలోకి దిగిన ఈ ఆజ్ఞాత గ్రూప్.. పేజీ పెట్టిన కొన్ని రోజులకే ఏకంగా 39 లక్షల ఫాలోవర్లను ఖాతాలో వేసుకుని డిజిటల్ దుమ్మురేపుతోంది.

డిమాండ్లు భలే ఉన్నాయి సర్... కానీ అమలుయ్యేనా?

ఆర్.హెచ్ఏ వాదన వింటే పాపం అనిపిస్తుంది. "కులాన్ని పక్కన పెట్టండి మహాప్రభో.. ప్రతిభ, ఆర్థిక పరిస్థితి చూసి అవకాశాలివ్వండి. అందరికీ ఒకే రకమైన కాంపిటీషన్ ఉండాలి" అంటూ లెక్చర్లు దంచేస్తోంది. వినడానికి డిజిటల్ ఇండియా డ్రీమ్‌లా భలే ఉంది కానీ.. మన రాజకీయ నాయకులకు ఇది నచ్చుతుందా? ఓటు బ్యాంక్ రాజకీయం అనే అమృతఫలాన్ని కులం పునాదుల మీదే తింటున్న మన నేతలకు ఈ 'కులాతీత రిజర్వేషన్' డిమాండ్ వింటే పాపం గుండెలాగినంత పనవుతుంది.. రాజ్యాంగ సవరణలు, సుప్రీంకోర్టు తీర్పులు, పొలిటికల్ పార్టీల నిరసనల దాటుకుని ఈ డిమాండ్ చట్టంగా మారడం అంటే... ఆకాశం నుంచి చందమామని కిందకి దింపడమే..

సోషల్ మీడియా లైక్‌లు వేరు... రియల్ లైఫ్ ఓట్లు వేరు

రిజర్వేషన్ మద్దతుదారులు మాత్రం ఈ ట్రెండ్‌ను చూసి నవ్వుకుంటున్నారు. "అసమానతలు ఇంకా పోలేదు తమ్ముడు రిజర్వేషన్లు ఎత్తేయడం కాదు.. సరిగ్గా అమలు చేయడం నేర్చుకోండి" అని కౌంటర్లు ఇస్తున్నారు.

గుర్తుంచుకోవాల్సిన సత్యం

ఇన్స్టాగ్రామ్‌లో లైక్‌లు కొట్టడం, ఫాలో కొట్టడం చాలా ఈజీ. కానీ పొలిటికల్ పార్టీలు తమ ఓటు బ్యాంకును కదిలించేలా నిర్ణయం తీసుకోవడం అంటే తొడపాశం పెట్టినట్లే..

ఏది ఏమైనా నీట్ ఉద్యమంలాగా ఈ ఆర్.హెచ్ఏ కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చనైతే రాజేసింది. మరి ఈ డిజిటల్ విప్లవం కేవలం సోషల్ మీడియా మీమ్స్‌కే పరిమితమవుతుందో.. లేక ప్రభుత్వం దిగివచ్చేలా చేస్తుందో వేచి చూడాల్సిందే. అంతవరకు... హ్యాష్‌ట్యాగ్‌లు మార్చి ఫాలో కొడుతూ ఉండటమే మన పని..