Begin typing your search above and press return to search.

తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047లో ఏముంది?

తనను ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ రాష్ట్రానికి తానేదో చేయాలన్న పట్టుదల ఆయనలో ఎక్కువే. అందుకు తగ్గట్లే ఆయనోకో విజన్ ఉంది.

By:  Garuda Media   |   10 Dec 2025 10:24 AM IST
తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047లో ఏముంది?
X

ప్రజాదరణ ఎంతున్నా పరిస్థితులు కలిసి రాకపోతే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే భాగ్యం దక్కదు. అన్నింటితో పాటు కూసింత లక్ కూడా తోడైతే తప్పించి సీఎం కాలేరు. అదే సమయంలో ముఖ్యమంత్రులైనోళ్లంతా చరిత్రలో నిలిచిపోరు. అందుకు ప్రత్యేకమైన కమిట్ మెంట్.. తన మార్క్ ను చూపించాలన్న తహతహతో పాటు.. తాను పాలించే రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలన్న పంతంతోనే పలు పరిణామాలు చోటు చేసుకుంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కోవలోకే వస్తారు.

తనను ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ రాష్ట్రానికి తానేదో చేయాలన్న పట్టుదల ఆయనలో ఎక్కువే. అందుకు తగ్గట్లే ఆయనో విజన్ ఉంది. తన పదవీ కాలంలో తన మార్కును శాశ్వితంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్న ఆలోచనకు నిదర్శనంగా తాజాగా హైదరాబాద్ మహానగర శివారులో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ను దీనికో ఉదాహరణగా చెప్పాలి. తాజాగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన వందేళ్ల నాటికి (2047) తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కారు పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

ఈ సందర్భంగా 83 పేజీలతో తమ ప్రభుత్వం సిద్ధం చేసిన విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసిన ఆయన..తన లక్ష్యాలేమిటన్న విషయాన్ని అందులో క్లియర్ గా చెప్పేశారు. విజన్ డాక్యుమెంట్ తయారీలో నీతి ఆయోగ్.. ఐఎస్ బీ.. కేంద్ర.. రాషట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు సైతం భాగస్వామ్యమయ్యారని పేర్కొన్న రేవంత్.. స్వేచ్ఛ.. సామాజిక న్యాయం.. సమాన అవకాశాల కల్పించటమే లక్ష్యంగా ఈ డాక్యుమెంట్ ను సిద్ధం చేశారు. కీలకాంశాలు ఇవే..

- 10 కీలక వ్యూహాలతో విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన. క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ జోన్లుగా తెలంగాణ విభజన.

- CURE జోన్‌ను నెట్-జీరో సిటీగా, గ్లోబల్ ఇన్నొవేషన్ హబ్‌గా అభివృద్ధి.

- PURE జోన్‌ను తయారీ, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి.

- RARE జోన్‌ను వ్యవసాయ – హరిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం.

- డాక్యుమెంట్‌లో ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌కు ప్రాధాన్యం. పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత

- గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం.

- ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్ట్‌, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, ట్రిపుల్ ఆర్, రింగు రైలు, బుల్లెట్‌ రైలు

- ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, ప్రత్యేక నిధి ఏర్పాటు. వాతావరణ మార్పుల వల్ల నష్టాలను తగ్గించడం.

- పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యంపై ప్రత్యేక దృష్టి

- 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక మైలురాయి సాధించడం. 2047 నాటికి జాతీయ జీడీపీలో 10% వాటా టార్గెట్.

- నాలుగు లక్షల మంది ప్రజల అభిప్రాయాలతో రూపొందించిన దార్మనిక పత్రం.

- భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ రీజువెనేషన్ వంటి గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు.

- రీజినల్ రింగ్ రోడ్, రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల అభివృద్ధి.

- డిజిటల్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత, సేవలు వేగవంతం.

- ప్రపంచ స్థాయి విద్య – పరిశోధన కేంద్రాలతో తెలంగాణను నాలెడ్జ్ హబ్‌గా నిర్మించడం.

- మహిళలు, యువత, రైతులకు సమాన అవకాశాలతో సుస్థిర సంక్షేమం.

- భారీ మౌలిక వసతుల కోసం ప్రత్యేక పెట్టుబడి నిధుల ఏర్పాటు.

- పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రాధాన్యం.

- తెలంగాణ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ మరియు పర్యాటక అభివృద్ధి.

- పాలనలో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో 'ప్రజల కోసం–ప్రజల చేత' అభివృద్ధి.