Begin typing your search above and press return to search.

రేవంత్ కత్తికి ఎదురులేదా ?

రాజకీయంగా వ్యూహాలను రచిస్తూ వాటిని పక్కాగా అమలులో పెడుతూ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్నారు.

By:  Satya P   |   14 Feb 2026 1:00 AM IST
రేవంత్ కత్తికి ఎదురులేదా ?
X

రాజకీయంగా వ్యూహాలను రచిస్తూ వాటిని పక్కాగా అమలులో పెడుతూ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్నారు. తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయన టీడీపీలో రాజకీయంగా ఎదిగారు, బాగా రాటు దేలారు, చంద్రబాబు వంటి అపర చాణక్యుడు మెప్పు పొందడం అంటే ఆషామాషీ కాదు, మరి ఆయన రేవంత్ లోకి నాయకత్వ లక్షణాలను తొలి రోజుల్లోనే చూసి టీడీపీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక విభజన తరువాత రేవంత్ రెడ్డి తన రూటు మార్చారు, కాంగ్రెస్ లో 2016 లో ప్రవేశించారు ఆ తరువాత అదే పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పీసీసీ చీఫ్ గా ఎదిగారు. 2018 లో అధికారంలోకి పార్టీ రాలేకపోయినా రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక 2023లో పార్టీని విజయపధంలో నడిపారు. అందుకే ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి పదవిని అప్పచెప్పింది. ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డికే సీఎం పీఠం అప్పగించడం వెనక కాంగ్రెస్ పెద్దల ఆలోచనలు చాలానే ఉన్నాయి.

మాటకారిగా :

తెలంగాణా రాజకీయాల్లో మంచి మాటకారిగా రేవంత్ రెడ్డి పేరు సంపాదించుకున్నారు. ఆయన ఉపన్యాసం ఇస్తే అంతా ఒళ్ళప్పగించే వింటారు, ఆయన తెలంగాణా యాసలో మాట్లాడుతూ ప్రత్యర్థుల మీద చేసే విమర్శలు పంచులు సెటైర్లు అంతా ఆస్వాదిస్తారు. అలా జనాలను ఆకట్టుకునే ప్రసంగాలు చేయడం కొద్ది మందికే సాధ్యం. అది రేవంత్ రెడ్డికి ఒక ఆయుధంగా మారింది. ఆ మీదట ఆయన వ్యూహాలు కూడా పదును తేరి ఉంటాయి. అంతే కాదు ఆయన పొలిటికల్ గా తన ఇమేజ్ ని సైతం బాగా బిల్డప్ చేసుకున్నారు. తన కత్తికి ఎదురులేదన్న దూకుడు మనస్తత్వంలో ప్రజల మన్నన చూరగొన్నారు.

వరుస విజయాలతో :

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తొలిసారిగా వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కి విజయం సంపాదించి పెట్టారు. నిజానికి ఆ సీటు బీఆర్ఎస్ ది. కానీ కాంగ్రెస్ ఖాతాలో వేయడం రేవంత్ రెడ్డి స్పెషాలిటీ అయింది. ఆ తరువాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ని గెలిపించి సత్తా చాటారు. అక్కడ దాదాపుగా పదిహేనేళ్ళ నుంచి గెలిపు పిలుపు కాంగ్రెస్ వినలేదు. కానీ రేవంత్ చేసిన మ్యాజిక్ తో ఏకంగా పాతిక లక్షల మెజారిటీ హస్తం పార్టీకి దక్కింది. ఇక పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కి దక్కించడం ద్వారా గెలుపుని కాంగ్రెస్ కి అలవాటుగా మార్చేశారు, తాజాగా మునిసిపాలిటీలను ఏకపక్షంగా గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ కేరాఫ్ సక్సెస్ అన్న కొత్త అర్థాన్ని చెప్పారు.

మాటలే కాదు చేతలు :

దీంతో కాంగ్రెస్ లీడర్ క్యాడర్ మాత్రమే కాదు రాజకీయ ప్రత్యర్ధులకు సైతం తన విజయాలతోనే సరైన జవాబుని రేవంత్ ఇస్తూ పోతున్నారు. అందుకే ఆయన పార్టీలో ధీమా పెంచుతూ తాను ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నేనే రాజు నేనే మంత్రి మరో పదేళ్ళ పాటు సీఎం గా నేనే అని రేవంత్ రెడ్డి బిగ్ సౌండ్ చేస్తున్నారు అంటే ఆయన నాయకత్వం మీద అంత నమ్మకంతోనే అని చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ హై కమాండ్ కి కూడా రేవంత్ రెడ్డి సారధ్యంలో విజయాలు అలా దక్కడం ఎంతో ఆనందం కలిగిస్తోంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో తమకు ప్రత్యర్థిగా ఉంటూ అధికారంలో ఉన్న బీజేపీని తెలంగాణాలో ఎదగకుండా నిలవరించడంతో రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న పాత్ర కూడా కాంగ్రెస్ పెద్దలకు మహదానందం కలిగిస్తోంది.

పట్టు బిగించారు :

కాంగ్రెస్ అంటేనే మహా సముద్రం. ఎన్నో వర్గాలు మరెన్నో గ్రూపులు. అలాంటి చోట లౌక్యంగా అందరినీ కలుపుకుంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ రాజాకీయ ప్రయాణం ఆయనతో పాటు పార్టీకి లాభాలను తెచ్చి పెడుతోంది. సీనియర్లు అంతా దాదాపుగా పార్టీ స్టాండ్ మేరకే ముందుకు సాగుతున్నారు. ఇది రేవంత్ రెడ్డికి ఎంతో ఊరటను ఇచ్చే అంశంగా ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డి తాజా విజయంతో తనకు తిరుగులేదని చాటుతున్నారు.