Begin typing your search above and press return to search.

రేవంత్ కు ఏదీ తెలియదు’.. ఆయన చదివిన స్కూల్ ప్రిన్సిపాల్ వ్యాఖ్యలు..!

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదువుకున్న స్కూల్ కు ప్రిన్సిపాల్ గా వ్యవహించిన ఒక గురువు రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   14 April 2026 1:47 PM IST
రేవంత్ కు ఏదీ తెలియదు’.. ఆయన చదివిన స్కూల్ ప్రిన్సిపాల్ వ్యాఖ్యలు..!
X

ఒక గురువు తన శిష్యుడి గురించి ఇంత ఘాటుగా, బహిరంగంగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపింది. సాధారణంగా గురువులు తమ శిష్యులు ఉన్నత స్థానాల్లో ఉంటే గర్వపడుతుంటారు. కానీ ఇక్కడ మూసీ ప్రక్షాళన, బఫర్ జోన్ అంశంపై నెలకొన్న ఉద్రిక్తతలు ఒక టీచర్‌ను ఈ స్థాయిలో ఆగ్రహానికి గురిచేశాయి.

సీఎంపై ఓ టీచర్ సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలు, బఫర్ జోన్ నోటిఫికేషన్లు సామాన్య ప్రజల్లోనే కాకుండా, మేధావుల్లో కూడా తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదువుకున్న స్కూల్ కు ప్రిన్సిపాల్ గా వ్యవహించిన ఒక గురువు రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మూసీ నదికి ‘బఫర్ జోన్’ ఉండదు అన్న ఆయన వాదన సాంకేతిక చర్చకు దారితీస్తోంది.

నదులకు ఎఫ్‌టీఎల్ ఉండదు..

రేవంత్ రెడ్డి తనకు శిష్యుడే అని చెప్పుకుంటూనే, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని ఆ ఆయన మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ‘నదులకు ఎఫ్టీఎల్ అనేది ఉండదని కేవలం హెచ్ఎఫ్ఎల్ (హైఎస్ట్ ఫ్లూడ్ లెవల్-గరిష్టంగా వరదలు వచ్చిన ప్రదేశం) మాత్రమే ఉంటుందని చెప్పారు. అయితే గత 40 సంవత్సరాలలో ఎప్పుడూ హెచ్ఎఫ్ఎల్ తో ఒక్క ఇల్లు కూడా ఎఫెక్ట్ కాలేదని ఆయన చెప్పారు.

నిజాం కాలం నుంచి వంతెనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు..

నిజాం కాలం నుంచి నదులపై వంతెనలు కట్టాలే కాని బఫర్ జోన్ పేరిట కూల్చివేతలు కరెక్టు కాదన్నారు. సాధారణంగా నదులకు ఉండే నిబంధనలు మూసీ లాంటి ప్రాంతాలకు వర్తించవని లేదా ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పని ఆయన అభిప్రాయపడుతున్నారు. మూసీ గురించి అసలు రేవంత్ రెడ్డికి అవగాహన లేదని ఆయన విమర్శించారు.

తనపై ఇంతటి ఘాటు వ్యాఖ్యలు చేసిన గురువుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా సమాధానం ఇస్తారు? లేదా ఆ గురువు చెబుతున్న సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి. ఏదేమైనా, ఒక గురువు తన శిష్యుడిని ఇలా బహిరంగంగా తప్పుబట్టడం అనేది రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానంలో ఒక ఇబ్బందికర పరిణామమే.