'కార్పొరేషన్ల' పదవులు.. నేతలు సర్దుమణుగుతారా?
ఇక, ఇప్పుడు మాజీ క్రికెటర్, గత ఎన్నికల్లో ఓడిపోయిన అజారుద్దీన్‌కు పార్టీ మంత్రీ పీఠాన్ని కట్టబెడుతోం ది. దీనిపై ఇప్పుడు సీనియర్లు పైకి చెప్పకపోయినా.. గుర్రుగానే ఉన్నట్టు తెలుస్తోంది.
By: Garuda Media | 31 Oct 2025 6:00 AM ISTతెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు.. చాలా మంది మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు ప్రయ త్నించారు. అయితే.. ప్రస్తుతం ఉన్న ప్రజానాడి.. పార్టీ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొద్దిమందికే అవకాశం కల్పించింది. వీరిలోనూ కొందరు కొత్త నేతలు కూడా ఉన్నారు. అయితే.. సీనియర్ల పరిస్థితి ఏంటి? అనేది కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది. వీరిని ఎప్పటికప్పుడు సర్దిచెబుతూ.. అధిష్టానం ముందుకు సాగుతోంది.
ఇక, ఇప్పుడు మాజీ క్రికెటర్, గత ఎన్నికల్లో ఓడిపోయిన అజారుద్దీన్‌కు పార్టీ మంత్రీ పీఠాన్ని కట్టబెడుతోం ది. దీనిపై ఇప్పుడు సీనియర్లు పైకి చెప్పకపోయినా.. గుర్రుగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. వారిని కూడా శాంత పరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్లు.. ముఖ్యంగా సామాజిక వర్గాల ఆధారంగా.. పదవులు కోరుకుంటున్న వారి జాబితాను రెడీ చేయించినట్టు తెలిసింది.
వీరికి కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్నవా టిలో ఖాళీగా ఉన్న పదవులతో పాటు.. కొత్తగా కూడా మరికొన్ని కార్పొరేషన్లు సృష్టించాలని వాటిని కూడా భర్తీ చేయాలని భావిస్తున్నారు. వీటిలో ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల కార్పొరేషన్ ను తెరమీదికి తెచ్చారు. అలాగే.. కొత్తగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ సహా.. ఐటీ అభివృద్ధి, ప్రాజెక్టుల కల్పన కు సంబంధించి కూడా కొత్త కార్పొరేషన్‌ను ఒకదానిని ఏర్పాటు చేయాలని సీఎం చెబుతున్నారు.
ఈ క్ర మంలో త్వరలోనే.. అంటే.. నాలుగైదు రోజుల్లోనే ఈ కార్పొరేషన్లకు తుది రూపం ఇచ్చి.. మంత్రి పీఠాలు ఆశించిన వారిని సంతృప్తి పరచాలని నిర్ణయించారు. మరి ఆయా నేతలు ఏమేరకు సంతృప్తి వ్యక్తం చేస్తారో చూడాలి. అయితే.. ఒకటి మాత్రం వాస్తవం.. జూబ్లీహిల్స్ ఎన్నిక సమయంలో వివాదాలకు తావులేకుండా.. సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
