Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ను మాస్ ర్యాగింగ్ చేసిన సీఎం రేవంత్‌.. విష‌యం ఏంటంటే!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. కేటీఆర్ కొత్తగా పెంచుకున్న బ్లాక్ బియర్డ్‌ను ఉద్దేశిస్తూ.. గడ్డం పెంచుకున్నంత ఈజీగా ప్రజాభిమానం సంపాదించలేరని వ్యాఖ్యానించారు. ఎన్ని వేషాలు, భాషలు మార్చినా ప్రజల్లో సానుభూతి రాదన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజల కోసమే పనిచేస్తున్నానని, గంట కూడా విశ్రాంతి లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

By:  Garuda Media   |   8 Nov 2026 8:33 AM IST
కేటీఆర్‌ను మాస్ ర్యాగింగ్ చేసిన సీఎం రేవంత్‌.. విష‌యం ఏంటంటే!
X

బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి మాస్ ర్యాగింగ్ చేశారు. ఇటీవ‌ల‌కాలంలో కేటీఆర్ త‌న ఆహార్యాన్ని పూర్తిగామార్చేసిన విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు క్లీన్ షేవ్‌తో క‌నిపించిన కేటీఆర్‌.. గ‌త నెల రోజులుగా గ‌డ్డం పెంచుకుని బ్లాక్ బియ‌ర్డ్‌తో క‌నిపిస్తున్నారు. ఎక్క‌డికి వెళ్లినా.. కేటీఆర్ ఆహార్యం గురించి బీఆర్ ఎస్ పార్టీలోనూ ఆస‌క్తికర చ‌ర్చ‌సాగుతోంది. అస‌లు ఇలా ఎందుకు మారారంటూ .. నాయ‌కులు చ‌ర్చించుకునే ప‌రిస్థితి ఉంది.అయితే.. దీనిపై కేటీఆర్ నేరుగా స్పందించ‌లేదు. గ‌తంలోనూ ఆయ‌న హెయిర్ స్ట‌యిల్‌ను ఒక‌సారి మార్చుకున్న‌ప్పుడు ఇలానే చ‌ర్చ‌కు దారితీసింది.

అయితే.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ బ్లాక్ బియ‌ర్డ్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి ర్యాగింగ్‌కు దిగారు. గ‌డ్డం పెంచుకున్నంత ఈజీగా ప్ర‌జ‌ల అభిమానం సంపాయించ‌లేరు.. అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు.. గ‌డ్డం పెంచుకున్నా... త‌న మాదిరిగా కూడా మార‌డం ఈ జ‌న్మ‌కు సాధ్యం కాద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. కేటీఆర్ ఎన్ని వేషాలు మార్చినా.. ఎన్ని భాష‌లు మార్చినా.. ప్ర‌జ‌ల్లో సింప‌తీ రాద‌ని తేల్చి చెప్పారు. ప్ర‌జ‌ల‌కు అన్నీ తెలుసున‌ని.. ఎవ‌రు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్నారో.. ఎవ‌రు ప‌ద‌వుల కోసం ఆరాట‌ప‌డుతున్నారో.. అంద‌రికీ తెలిసిందేన‌ని చెప్పారు. గ‌డ్డం పెంచుకుంటే సింప‌తీ వ‌స్తుంద‌ని అనుకుంటే.. రాజ‌కీయాల్లో ఉన్న‌వారంతా గెడ్డాలు పెంచుకునిరంగులు వేసుకుంటార‌ని త‌న దైన శైలిలో వ్యాఖ్యానించారు.

గంట కూడా రెస్టు లేదు!

ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌న‌కు గంట కూడా సెల‌వు లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గ‌త మూడేళ్లుగా ప్ర‌జ‌ల కోస‌మే తాను ప‌నిచేస్తున్నాన‌ని అన్నారు. ఒక‌ప్పుడు ముఖ్య‌మంత్రిని క‌ల‌వాలంటే.. గ‌డీలు దాటాల్సి వ‌చ్చేద‌ని.. అనేక మంది సిఫార‌సులు చేసే ప‌రిస్థితి ఉండేద‌ని మాజీసీఎం కేసీఆర్‌ను ప‌రోక్షంగా విమ‌ర్శించారు. కానీ,ఇప్పుడు ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కే ముఖ్య‌మంత్రి వ‌స్తున్నార‌ని చెప్పారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వినేందుకు.. వాటిని ప‌రిష్క‌రించేందుకు కూడా ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల చెంత‌కే వ‌స్తున్నార‌ని.. అన్నీవింటున్నార‌ని తెలిపారు. మాయ‌లు మంత్రాలు వేసే టైపు తాను కాద‌న్నారు. అన్ని ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ విజ‌యాలు ద‌క్కించుకుంద‌ని చెప్పారు. ``ఓ కుటుంబాన్ని`` ప్ర‌జ‌లు తిర‌స్క‌రించినా.. వారికి ఇంకా తెలియ‌డం లేద‌ని కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.