Begin typing your search above and press return to search.

రేవంత్ జాగ్రత్త అంటున్న హితుడు

రేవంత్ రెడ్డి ఈ డిసెంబర్ తో తెలంగాణాకు రెండేళ్ళ సీఎం గా తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారు. ఆయన చేతిలో ఇంకా మూడేళ్ళ పాలన ఉంది.

By:  Satya P   |   26 Oct 2025 9:20 PM IST
రేవంత్ జాగ్రత్త అంటున్న హితుడు
X

హితుడా అని దాన వీర శూర కర్ణ లో ఒక డైలాగ్ ఉంటుంది. తన మిత్రుడు కర్ణుడిని ఉద్దేశించి తరచూ సుయోధనుడు అలా అప్యాయానురాగాలతో సంభోదిస్తూ ఉంటారు. అయితే రాజకీయాల్లో హితులు సన్నిహితులు ఉంటారా ఉంటే ఎంతవరకూ ఉంటారు అన్నది కూడా ఒక కీలకమైన మౌలికమైన ప్రశ్న. జవాబు మాత్రం దొరకదు. ఇక అవసరాలే హితులను సమకూర్చిపెడుతూ ఉంటాయి. పోనీ టెంపరరీగా అయినా హితులు కొందరు దొరికితే మంచిదే. అయితే వారు ఇచ్చే సూచనలు ఎంతవరకూ పాటించాలి ఏమిటి అన్నది ఆయా రాజకీయ అధిపతుల మీద ఆధారపడి ఉంటుంది.

తుస్సుమన్న ప్రచారం :

ఈ మధ్యకాలంలోనే తెలంగాణా రాజకీయాల్లో ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. అది ఏంటి అంటే ఏకంగా ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే రేవంత్ సర్కార్ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అని. తనను కలవడానికి వచ్చిన కొందరు తెలంగాణా కాంగ్రెస్ నేతలతో ఆయన పాలన తీరు మీద ఒకింత విమర్శలు చేశారు అని ప్రచారం అయితే పీక్స్ లో సాగింది. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ దానిని ప్రత్యర్ధులు బాగానే వాడేసుకున్నారు. తెగ వైరల్ చేశారు. తీరా చూస్తే చివరికి అది ఫేక్ అని తేలిపోయింది అని అంటున్నారు అయితే ఈలోగా దాని మీద సీఎం వైపు నుంచి పెద్దగా కౌంటర్లు లేకపోవడంతో అది జనంలోకి బాగా వెళ్ళి వైరల్ అయి జరగాల్సిన నష్టం వాటిల్లింది.

రెండేళ్ళ సీఎం గా :

రేవంత్ రెడ్డి ఈ డిసెంబర్ తో తెలంగాణాకు రెండేళ్ళ సీఎం గా తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారు. ఆయన చేతిలో ఇంకా మూడేళ్ళ పాలన ఉంది. అయితే కాంగ్రెస్ అన్నది ఒక మహా సముద్రం. అందులో సొంత వారే కొన్ని సార్లు ప్రత్యర్ధులుగా ఉంటారు, వారిని తట్టుకోవాలి. అదే సమయంలో ఎటూ బయట ప్రతిపక్షాలు ఉంటాయి, వారితోనూ పోరాటం చేయాలి. ఇదంతా వ్యూహాత్మకంగా చేయాల్సిందే ఈ విషయంలో ఎప్పటికి ఏది చేయాలో అలా చేస్తూ పోవాలి. అంతే కాదు తగిన విధంగా కనుక అడుగులు వేయకపోతే ఇబ్బందులు అవుతాయి. అదే మీడియా హితుడు రేవంత్ రెడ్డికి హిత బోధ చేయడం మీదనే చర్చ సాగుతోంది.

కాంగ్రెస్ అంటేనే :

కాంగ్రెస్ పార్టీలో ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అంటారు. గతంలో వెనక్కి వెళ్తే వైఎస్సార్ అయిదేళ్ళ పాటు ఉమ్మడి ఏపీకి సీఎం గా చేశారు. ఆయన విషయంలో కూడా స్వపక్షీయులు వెళ్ళి పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయిలో పెద్దలకు చెప్పాల్సింది చెప్పారని అంటారు. కాంగ్రెస్ లో ఎవరికి ఎపుడు రాజయోగం ఉంటుందో ఎపుడు రాజదండం ఎవరి చేతి నుంచి జారుతుందో తెలియదు అంటారు. అందుకే హితుడుగా మారిన ఆ మీడియా పెద్దాయన రేవంత్ రెడ్డికి జాగ్రత్తలు చెబుతూ చాలానే తన మీడియా ద్వారా రాశారని అంటున్నారు. ఇంతకీ రేవంత్ రెడ్డికి ఆ తరహా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఏమో రాజకీయం లో ఏదీ అంచనా వేయడం బహు కష్టమని అంటున్నారు సో హితుడి పలుకుల వెనక ఏముందో చూసుకుంటూ దానికి రాజకీయ అనువాదం చేసుకోవడమే అంటున్నారు.