Begin typing your search above and press return to search.

రేవంత్ ఐదున్నరేళ్ల సీఎం ?

రేవంత్ రెడ్డి తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఎన్నో ఆలోచనలు ప్రశ్నలు చర్చలకు తావిస్తున్నాయి.

By:  Satya P   |   11 July 2026 4:00 AM IST
రేవంత్ ఐదున్నరేళ్ల సీఎం ?
X

రెండు తెలుగు రాష్ట్రాలలో గతంలో చూడని ముచ్చట రానున్న కాలంలో చూడబోతున్నామా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఉమ్మడి ఏపీ కానీ అంతకు ముందు ఆ తరువాత విభజన ఏపీలో తెలంగాణాలో కానీ అయిదేళ్ళ సీఎంలను ఇంకా చెప్పాలంటే అంతకు తక్కువ పదవీ కాలం పనిచేసిన ముఖ్యమంత్రులనే అంతా చూశారు. అతి తక్కువ కాలం పనిచేసిన నెల రోజుల సీఎం గా నాదెండ్ల భాస్కరరావు ఒక రికార్డు క్రియేట్ చేశారు. ఇపుడు అయిదున్నరేళ్ళకు పైగా సీఎం గా పనిచేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నారా అంటే రేవంత్ రెడ్డి మాటలను బట్టి చూస్తే జరగబోయేది అదే అని అర్ధం అవుతోంది.

ఆరు నెలలు ముందుకు :

రేవంత్ రెడ్డి తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఎన్నో ఆలోచనలు ప్రశ్నలు చర్చలకు తావిస్తున్నాయి. ఆయన ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాకు షెడ్యూల్ ప్రకారం 2028 డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలు 2029 మే లేదా జూన్ లో జరుగుతాయని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే మరో ఆరేడు నెలల పాటు తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని అర్ధం అవుతోంది. అంతే రేవంత్ రెడ్డి ఏకంగా అయిదున్నర ఏళ్ళకు పైగా ముఖ్యమంత్రిగా ఉంటారని కూడా దీనిని బట్టి చెప్పుకోవాల్సి ఉంటుంది.

విపక్షాలకు షాక్ :

అదే జరిగితే తెలంగాణాలో విపక్షాలకు అది భారీ షాక్ అని చెప్పాల్సి ఉంటుంది. విపక్షాలు అంటే బీజేపీ కాదు, బీఆర్ఎస్ అని కూడా ఇక్కడ భావించాలి. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీ తలచుకుంటేనే తెలంగాణాలో సార్వత్రిక ఎన్నికలు మరో ఆరు నెలల పాటు పొడిగించబడతాయి. దాంతో మరో రెండేళ్ళు ఆగండి మనదే ప్రభుత్వం అని తరచూ బీఆర్ఎస్ అగ్ర నేతలు జనాలకు పార్టీ జనాలకు చెబుతున్నారు. ఇపుడు వారే దిగాలు పడాల్సి ఉంటుంది. రాజకీయాల్లో ప్రతీ క్షణం విలువ అయినదే. అలాంటిది ఏకంగా ఆరేడు నెలలు కాంగ్రెస్ కి అదనంగా కలసి వస్తే కనుక కచ్చితంగా తెలంగాణా రాజకీయ సమీకరణలనే అది సమూలంగా మార్చేసే చాన్స్ ఉంటుంది. అలాంటపుడు మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమూ ఉండొచ్చు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి చెప్పైన ఈ మాటలు అయితే ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో బిగ్ డిబేట్ గా మారబోతున్నాయని చెప్పక తప్పదు.

దేశంలో ఇందిరమ్మ తరువాత :

ఇక రేవంత్ రెడ్డి అన్న మాట ప్రకారమే తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు మరో ఆరు నెలల పాటు పొడిగించబడితే మాత్రం కచ్చితంగా రేవంత్ రెడ్డి రికార్డు క్రియేట్ చేసినట్లే. దేశంలో ఆరేళ్ళ పాటు ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైం లో పనిచేశారు. ఆ విధంగా రేవంత్ రెడ్డి కూడా అయిదేళ్ళకు మించి అయిదున్నరేళ్ళ పాటు సీఎం గా పనిచేస్తే అది ఎప్పటికీ బ్రేక్ చేయలేని రికార్డుగా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి తాజా సభలో చేసిన సంచలన కామెంట్స్ బిగ్ డిబేట్ కి దారి తీస్తున్నాయి. మరి దీని మీద బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.