Begin typing your search above and press return to search.

విచార‌ణ‌కు పిలిస్తేనే వేధింపా.. బీఆర్ఎస్‌ న‌యా ట్రెండ్‌!

ఏ కేసులో అయినా.. విచార‌ణ ప్రాథ‌మికం. విచార‌ణ లేకుండా అస‌లు కేసులు ఉండ‌వు. ఏం జ‌రిగిందో తెలుసుకునేందుకు.. ఏం జ‌రిగిందో తేల్చేందుకు కూడా విచార‌ణే ముఖ్యం.

By:  Garuda Media   |   1 Feb 2026 4:47 PM IST
విచార‌ణ‌కు పిలిస్తేనే వేధింపా.. బీఆర్ఎస్‌ న‌యా ట్రెండ్‌!
X

ఏ కేసులో అయినా.. విచార‌ణ ప్రాథ‌మికం. విచార‌ణ లేకుండా అస‌లు కేసులు ఉండ‌వు. ఏం జ‌రిగిందో తెలుసుకునేందుకు.. ఏం జ‌రిగిందో తేల్చేందుకు కూడా విచార‌ణే ముఖ్యం. ఈ విష‌యంలో ఎవ‌రూ ఎవ‌రినీ త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అస‌లు విచార‌ణే త‌ప్పు అన్న‌ట్టుగా ఇప్పుడు రాజ‌కీయాలు మారుతున్నాయి. ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డిని గ‌తంలో ఓటుకు నోటు కేసులో విచార‌ణ‌కు పిలిచిన‌ప్పుడు.. టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చాయి. ఈ విషయం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. కానీ, అప్ప‌ట్లో అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ నాయ‌కులు.. దీనిని పెద్ద ఎత్తున త‌ప్పుబ‌ట్టారు.

``విచార‌ణ‌కు ఎందుకు చేస్త‌రు? దీనికి కూడా అంత ఉలికిపాటా? త‌ప్పు చేయ‌న‌ప్పుడు.. ఇంత యాగీ చేయుడేంది.`` అంటూ.. సీఎం స్థానంలో ఆనాడు ఉన్న కేసీఆర్ వ్యాఖ్యానించిన మాట‌లు ఇప్ప‌టికీ యూట్యూబుల్లో ఉన్నాయి. ఆనాడు విచార‌ణ‌కు పిలిస్తే.. ఆ స‌మ‌యంలో నిర‌స‌న వ్య‌క్తం చేయాల‌ని టీడీపీ భావిస్తే.. దానిని త‌ప్పుబ‌ట్టిన కేసీఆర్ అండ్ కో.. ఇప్పుడు అదే పని చేయ డం చూస్తే.. బీఆర్ఎస్ న‌యా ట్రెండ్ రాజ‌కీయాలు స్ప‌ష్టం అవుతున్నాయి. ఒక్క రేవంతే కాదు.. అనేక కేసుల్లో గ‌తంలో విచార ణకు హాజ‌రైన వారి విష‌యంలో బీఆర్ ఎస్ అప్ప‌టి మంత్రులు ఇవే వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్య‌వ‌హారంలో బీఆర్ ఎస్ అధినేత‌.. మాజీ సీఎం కేసీఆర్‌ను విచార‌ణ‌కు పిలిచారు. అనేక చ‌ర్చ‌లు.. ఆలోచ‌న‌ల అనంత‌రం.. కేసీఆర్ ఎట్ట‌కేల‌కు.. విచార‌ణ‌కు ఒప్పుకొన్నారు. మొత్తంగా ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ యంలో సిట్ అధికారులు ఆయ‌న‌ను విచారించ‌నున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌కంగా భావిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న విచార‌ణ‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇదిలావుంటే.. త‌మ అధినేత‌ను విచార‌ణ‌కు పిలువుడేంది? అంటూ.. బీఆర్ ఎస్ కీలక నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విచార‌ణ‌కురాజ‌కీయ కోణాన్ని కూడా తొడిగేశారు. వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

కానీ.. ఇప్పుడు కేసీఆర్‌ను విచార‌ణ‌కు పిలిచిన నేప‌థ్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న‌ల‌కు, ధ‌ర్నాల‌కు పిలుపునిస్తూ.. మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ద‌ర్నాలు నిర్వ‌హించాల‌ని.. పేర్కొన్నారు. అంతేకాదు.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి స‌ర్కారు అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, రాజకీయ కక్షసాధింపుల‌కు దిగుతోంద‌ని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను వేధిస్తున్నార‌ని, దీనిలో భాగంగానే ఆయ‌న‌ను అవమానిస్తున్నార‌ని కూడా కేటీఆర్ అన్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌కు ఆయ‌న పిలుపునిచ్చారు.