బడ్జెట్‌లో కొత్త పథకం.. 1.15 కోట్ల కుటుంబాలకు `భద్రత`
తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది.
By: Garuda Media | 21 March 2026 7:00 AM ISTతెలంగాణ వార్షిక బడ్జెట్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. `ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా` పేరిట ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ పథకా న్ని ప్రకటించారు. దీనివల్ల 1.15 కోట్ల(కోటీ 15 లక్షల) కుటుంబాలకు.. మేలు జరుగుతుందన్నారు. ఒక్కొక్క కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ.. రూ.5 లక్షల చొప్పున ఆరోగ్య బీమాను అందిస్తామని చెప్పారు. దీనివల్ల ఆయా కుటుంబాల కు ఆరోగ్య భద్రత చేకూరుతుందన్నారు.
ఈ పథకాన్ని జూన్ 2వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు వివరించారు. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చి నప్పటికీ.. ఈ బీమా వారి కుటుంబాలకు రక్షణగా ఉంటుందని తెలిపారు. ఈ పథకం కింద లబ్ధిదారులు చెల్లించేది ఏమీ ఉండదని.. బీపీఎల్ కుటుంబాలను ప్రామాణికంగా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు వివరించారు. తద్వారా.. ప్రజల ఆరోగ్యానికి త మ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు.
మూల ధనానికి ప్రాధాన్యం..
మరోవైపు.. రాష్ట్రంలో ఆదాయ వనరుల పెంపునకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. తాజా బడ్జెట్‌లో మూల ధన వ్యయం పెంచడం ద్వారా.. ప్రభుత్వానికి ఆదాయాన్ని వచ్చే మార్గాలను విస్తృత పరచనుంది. మూల ధన వ్యయానికి రూ.47,267 కోట్లు కేటాయించారు. అలాగే.. ఉద్యోగులకుజీతాలు.. సంక్షేమ పథకాలకు మాత్రం మెజారిటీ నిధులను కేటాయించారు. రెవెన్యూ వ్యయం కింద.. రూ.2,34,406 కోట్లు కేటాయించారు. ఇది పింఛన్లు, సంక్షేమ పథకాలు.. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు కేటాయించడం గమనార్హం.
మొత్తం తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లలో రెవెన్యూ వ్యయమే 2,34,406 కోట్లు ఉండడం గమనార్హం. ఇక, వృద్ధి విషయంలోనూ ప్రభుత్వం ఎక్కడా అంచనాలు మించకుండా జాగ్రత్తలు తీసుకుంది. తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా పేర్కొన్న ప్రభుత్వం వచ్చే 2026-27లో వృద్ధి రేటు 10.2శాతంగా పేర్కొంది. తద్వారా.. రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం కన్నా.. ప్రస్తుతం ఉన్న దానినే కొనసాగించనున్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు రూ.500 కోట్లు కేటాయించారు. కానీ.. ఇవి సరిపోవన్నది నిపుణులు చెబుతున్న మాట.
