మళ్లీ మెట్రో పంచాయితీ.. లేఖాస్త్రాల్ని సంధించిన సీఎం రేవంత్
దాదాపుగా రెండు వారాలు కావొస్తున్నా.. ఈ నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడకపోవటంతో రేవంత్ తాజాగా లేఖల్ని సంధించారు.
By: Garuda Media | 6 July 2026 2:47 PM ISTమెట్రోపై మరోసారి గళం విప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత నెల చివరి వారంలో మెట్రో రైలు ప్రాజెక్టు అంశంపై తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీరును తప్పు పట్టి.. విమర్శలు సంధించిన ఆయన ఎట్టకేలకు ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇరువురు కలిసి కేంద్రమంత్రుల వద్దకు వెళ్లటం.. మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి చర్యల నిమిత్తం ఏమేం చేయాలన్న దానిపై చర్చలు జరపటం తెలిసిందే. అనుకున్న ప్రకారం ఎస్ బీఐ క్యాప్స్ ను నియమించేలా కేంద్రం నిర్ణయం తీసుకోగా.. అందుకు సీఎం రేవంత్ ఓకే చెప్పారు.
ఫేజ్ 1ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియ.. ఫేజ్ 2 విస్తరణకు అవసరమైన పరిపాలన.. ఆర్థిక ఆమోదానికి సంబంధించిన అనుమతుల కోసం తమ వినతిని ఓకే చెబుతూ నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ తాజాగా లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తో పాటు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. మెట్రో ప్రాజెక్టు అమలులో జరిగే ఆలస్యం కారణంగా ప్రాజెక్టు మీద అదనపు భారం పడుతుందన్న ఆందోళనను వ్యకతం చేశారు.
గత నెల 23న రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో.. 24న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తో భేటీ కావటం తెలిసిందే. ఇందుకు సీఎం రేవంత్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ.. వాటి అమలు ఇప్పటివరకు కాకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మీటింగ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఎస్ బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ .. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ.. ఆర్థిక పరిస్థితుల సమీక్ష.. అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చే రీఫైనాన్సింగ్ అవకాశాల్ని పరిశీలించాలని.. ఫేజ్ 1 ప్రాజెక్టును తెలంగాణ ప్రబుత్వానికి బదిలీ చేసేందుకు అవసరమైన ఆర్థిక పరిశీలన బాధ్యతలు అప్పగించాలని గత సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
దాదాపుగా రెండు వారాలు కావొస్తున్నా.. ఈ నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడకపోవటంతో రేవంత్ తాజాగా లేఖల్ని సంధించారు. తాను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నా.. కేంద్రం నుంచి మాత్రం సానుకూల స్పందన రావటం లేదన్న విషయాన్ని తన చేతలతో సీఎం రేవంత్ చూపిస్తున్నారని చెప్పాలి. అయితే.. ఈ లేఖల్ని గుట్టుచప్పుడు కాకుండా.. బహిరంగంగా విడుదల చేయటం ద్వారా ఒత్తిడి పెంచాలన్న సీఎం వ్యూహం ఎంతమేర పని చేస్తుందన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఈ లేఖల సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది.. పెండింగ్ పైళ్లను ముందుకు కదిలించేందుకు కేంద్రం పెద్దలతో మాట్లాడాలని కిషన్ రెడ్డిని దాదాపుగా రెండు వారాలు కావొస్తున్నా.. ఈ నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడకపోవటంతో రేవంత్ తాజాగా లేఖల్ని సంధించారు.
సీఎం రేవంత్ కోరటం తరహా తీరు కేంద్రం ఎలా చూస్తుందన్నది ప్రశ్న. దీనికి కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
