'జాతిపిత' రాజకీయం: రేవంత్ వర్సెస్ హరీష్‌రావ్!
తెలంగాణలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల వేళ.. రాజకీయాల వేడి మరింత పెరుగుతోంది.
By: Garuda Media | 3 Feb 2026 5:00 PM ISTతెలంగాణలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల వేళ.. రాజకీయాల వేడి మరింత పెరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఇరు పక్షాల మధ్య రాజకీయాన్ని వేడెక్కించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరు పార్టీల్లోనూ మం టలు పుట్టించాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు నిమిషాల వ్యవధిలోనే స్పందించారు. `` హార్వర్డ్‌లో చదువుకున్న ముఖ్యమంత్రి తన గుణం మాత్రం మార్చుకోలేకపోయారు`` అని వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పరోక్షంగా బీఆర్ఎస్ అధినే త, మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తెలంగాణ `జాతిపిత` అంటూ ఎద్దేవాచేశారు. `కొంత మంది ఈ మధ్య కాలంలో `జాతిపిత` అంటూ వాళ్లకు వాళ్లే టైటిల్ ఇచ్చేసుకుంటున్నారు`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తమకు తామే ఉద్యమకారులమని కూడా చెప్పుకొంటున్నారని దుయ్యబట్టారు. కానీ, కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇచ్చిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.
ఈ వ్యాఖ్యలే బీఆర్ ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. సీఎం చేసిన వ్యాఖ్యలపై హరీష్‌రావు నిమిషాల వ్యవ ధిలోనే కౌంటర్ ఇచ్చారు. ``రేవంత్ రెడ్డి మరోసారి తన అజీర్తిని, అక్కసును వెళ్లగక్కారు`` అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు .. విద్వేష పూరిత ప్రసంగాల కోసం పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదని.. రేవంత్ ప్రసంగాలు వింటే సరిపోతుందని దుయ్య బట్టారు. ఉద్యమ కారుల గురించి రేవంత్‌కు మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణకు కేసీఆరే జాతిపిత అని నొక్కి చెప్పారు. ప్రజాస్వామ్యం గురించి.. నీతుల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు.
ఎందుకీ వివాదం?
వాస్తవానికి కేసీఆర్‌ను `జాతిపిత` అంటూ బీఆర్ఎస్ నాయకులు తరచుగా ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంపైనే ఇటీవల కొందరు స్పందిస్తూ.. జాతిపిత వంటి కేసీఆర్‌ను కూడా విచారిస్తారా? అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలనే కోట్ చేస్తూ.. రేవంత్ రెడ్డి స్పందించారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకువెళ్లారనడంలో కేసీఆర్‌కు మంచి మార్కులే పడ్డాయి. అయితే.. ఆయన జాతిపితా.. లేక.. జాతి హితా.. అనేది ప్రజలు నిర్ణయించాలి. కానీ, ప్రస్తుతం ఎన్నికలు ఉన్ననేపథ్యంలో ఈ వ్యవహారం కూడా వివాదానికి దారి తీసింది.
