Begin typing your search above and press return to search.

అయిదున్నరేళ్ళ సీఎం గా రేవంత్ ?

అలా తాను పదిన్నరేళ్ళ పాటు సీఎం గా ఉంటాను అని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ పదిన్నర ఎక్కడ నుంచి వచ్చింది అన్నదే చాలా మందికి అర్ధం కాని విషయంగా ఉంది.

By:  Satya P   |   13 Feb 2026 4:00 AM IST
అయిదున్నరేళ్ళ సీఎం గా రేవంత్ ?
X

తెలంగాణాకు చెందిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రెండేళ్ళకు పైగా పాలనను పరుగులు తీయిస్తున్న ఎనుముల రేవంత్ రెడ్డి తానే రాజు తానే మంత్రి అని ఢిల్లీ వేదిక మీద బిగ్ సౌండ్ చేశారు, అంతే కాదు మరో టెర్మ్ కూడా కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. అలా తాను పదిన్నరేళ్ళ పాటు సీఎం గా ఉంటాను అని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ పదిన్నర ఎక్కడ నుంచి వచ్చింది అన్నదే చాలా మందికి అర్ధం కాని విషయంగా ఉంది.

రేవంత్ కి కలిసొస్తుందా :

అసలు మ్యాటర్ ఏంటి అంటే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2029లో జమిలి ఎన్నికలు వస్తున్నాయని చెప్పారు. అంతే కాదు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుందని, మహిళా రిజర్వేషన్ల కోటా తేలి జమిలి ఎన్నికల్లో మూడవ వంతు వారికే కేటాయిస్తారు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే 2029 లో జమిలి ఎన్నికలు అంటున్నారు. తెలంగాణాలో 2028 నవంబర్ లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. మరి అది ఎలా అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయం.

అక్కడే ఉంది ట్విస్ట్ :

ఇక అక్కడే ఉంది అసలైన విషయం అని అంటున్నారు. జమిలి ఎన్నికలు పెట్టాలని కేంద్రం అనుకున్నపుడు కొన్ని అంశాల మీద సీరియస్ గా స్టెప్ తీసుకుంటారు 2029 మే లో జమిలి ఎన్నికలు అంటే అప్పటికి ఆరు నెలల ముందు ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు మరో ఆరు నెలలు పదవీ కాలం పొడిస్తారు అని అంటున్నారు. అలాగే 2029 చివరిలో జరగాల్సిన మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ఎన్నికలను ఆరు నెలల ముందుకు తెస్తారు. అంటే అక్కడ ఆరు నెలలు తగ్గుతాయన్న మాట. మరి తెలంగాణా వంటి స్టేట్స్ కి ఇది లాభంగా ఉండబోతోందా అన్న చర్చ సాగుతోంది.

ఆరు నెలలు ఎక్కువగా :

ఈ విధంగా కనుక జమిలి ఎన్నికల విషయంలో ఫ్రేం వర్క్ చేస్తే రేవంత్ రెడ్డి చేతిలో అధికారం అయిదేళ్ల పాటు కాదు ఐదున్నరేళ్ల దాకా ఉంటుందని అంటున్నారు. అందుకేనా వీటిని దృష్టిలో ఉంచుకుని తాను పదిన్నరేళ్ల సీఎం ని అని రేవంత్ అంటున్నారు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక 2029 లో మరోసారి గెలిస్తే 2034 వరకూ రేవంత్ రెడ్డి సెకండ్ టెర్మ్ కూడా ఫుల్ గా తాను సీఎం గా ఉంటాను అని లెక్క వేసుకుని చెప్పారని అంటున్నారు. సో జమిలి ఎన్నికలు కనుక జరిగితే తెలంగాణా కాంగ్రెస్ అధికారం మరో ఆరు నెలలు పొడిగించబడుతుందా అన్న చర్చ సాగుతోంది.

బీఆర్ఎస్ కి బ్యాడ్ న్యూస్ :

ఇక ఇదే జరిగితే బీఆర్ఎస్ కి బ్యాడ్ న్యూస్ గానే చూడాల్సి ఉంది. ఎందుకంటే 2028 లో ఎన్నికలు అంటూ ఇప్పటి నుంచే ఆ పార్టీ నేతలు మొదలెట్టారు. మీ చేతిలో ఉంది రెండేళ్ళు మాత్రమే అని కూడా ఇటీవల మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ హరీష్ రావు అన్నారు కూడా. కానీ జమిలి ఎన్నికలు కనుక పెట్టాలని కేంద్రం అనుకుంటే కాంగ్రెస్ కి మూడేళ్ళకు పైగా అధికారం నిండుగా ఉంటుందని అంటున్న వారూ ఉన్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.