Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరుగుతోందా ?

కాంగ్రెస్ కి దేశంలో మూడు రాష్ట్రాల్లో సొంతంగా అధికారం ఉంటే అందులో రెండు పెద్ద రాష్ట్రాలు దక్షిణాన ఉన్నాయి.

By:  Satya P   |   29 July 2025 8:00 AM IST
రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరుగుతోందా ?
X

కాంగ్రెస్ కి దేశంలో మూడు రాష్ట్రాల్లో సొంతంగా అధికారం ఉంటే అందులో రెండు పెద్ద రాష్ట్రాలు దక్షిణాన ఉన్నాయి. కర్ణాటకలో ఎంతో అనుభవం కలిగిన వారుగా గతంలో కాంగ్రెస్ సీఎం గా అయిదేళ్ళ పాటు పాలించిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణాలో అయితే మంత్రిగా కూడా పనిచేయకుండానే ఏకంగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఉన్నారు. వేరే పార్టీలలో పనిచేసి కాంగ్రెస్ లో చేరిన కేవలం అయిదారేళ్ళలోనే అత్యున్నత సీఎం పీఠం అధిరోహించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వం పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకుంటున్నారా అంటే అవును అన్న సమాధానం వస్తోందిట.

కాంగ్రెస్ లో యువ సీఎం గా :

కాంగ్రెస్ లో యువ సీఎం గా రేవంత్ రెడ్డి గుర్తింపు సంపాదించారు. దక్షిణాన తెలంగాణాలో రాజకీయాన్ని ఒడిసిపట్టి కాంగ్రెస్ పార్టీకి వాతావరణాన్ని అనుకూలం చేయడంలో రేవంత్ రెడ్డి గడచిన ఏణ్ణర్ధంగా సక్సెస్ అవుతున్నారు అని అంటున్నారు. బీఆర్ఎస్ ని ఓడించడం కష్టమని అంతా అనుకున్న తరుణంలో ఒక్కసారిగా కాంగ్రెస్ ఆశలకు రెక్కలు తొడిగి అందలం ఎక్కించిన ఘనతను ఆయన సాధించారు అని చెబుతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డి పట్ల సానుకూల అభిప్రాయంతోనే ఉంది అని అంటున్నారు.

దాంతోనే హైకమాండ్ ఫుల్ హ్యాపీ :

తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ గణనను చేపట్టింది. తొందరలోనే ఈ కార్యక్రమం పూర్తి చేసి నివేదికను రప్పించింది. దాంతో దేశంలో ఇపుడు తెలంగాణా ఆదర్శంగా మారింది. నిజానికి చూస్తే బీసీ కుల గణన అన్నది కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తమ అజెండాగా చేసుకుంది. దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకోవాలంటే ఓబీసీలను పార్టీ వైపు మళ్ళించడమే అతి ముఖ్యమని భావించిన కాంగ్రెస్ ఆ దిశగా మేధోమధనం చేస్తూ చర్యలు తీసుకుంటోంది. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం మనసెరిగి తెలంగాణాలో బీసీ కుల గణన జరిపి దేశంలో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చాంపియన్ గా నిలిచారని అంటున్నారు దాంతో హై కమాండ్ ఫుల్ హ్యాపీగా ఉందని చెబుతున్నారు.

దేశానికే ఉదాహరణగా :

ఇక చూస్తే కనుక తెలంగాణాలో బీసీ కుల గణన మేము పూర్తి చేశామని అనేక వేదికల మీద రాహుల్ గాంధీ గొప్పగా చెబుతున్నారు. తమ డిమాండ్ తరువాతనే కేంద్రంలో నాయకత్వం వహిస్తున్న బీజేపీ ప్రభుత్వం కూడా బీసీ కుల గణన అని అంటోందని చెబుతున్నారు. బీసీ కుల గణన అన్న అంశాన్ని తాము ఎత్తుకున్నామని అలా బడుగులకు బాసటగా నిలిచామని రాహుల్ గాంధీ చెబుతునారు. తెలంగాణాలో మొదట దేశంలోనే బీసీ కుల గణన జరిపామని దానిని ఆయన ఒక ఉదాహరణగా చెబుతున్నారు. జాతీయ స్థాయిలో ఆ విధంగా తెలంగాణాను ఆయన స్పూర్తిగా తీసుకోవాలని చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి మార్కులు వేస్తున్నారు అని అంటున్నారు.





రేవంత్ రెడ్డికి ప్లస్ అయినట్లేనా :

కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టిలో రేవంత్ రెడ్డి ఈ విధంగా ఉండడం పట్ల ఆయన అనుచరులతో పాటు కాంగ్రెస్ వాదులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఏణ్ణర్థం కాలంలో రేవంత్ రెడ్డి సాధించిన అతి పెద్ద అచీవ్ మెంట్ గా బీసీ కులగణను చెబుతున్నారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏ ఆశయం కోసం అయితే పనిచేస్తోందో దానిని రేవంత్ రెడ్డి బలంగా తీసుకుని తెలంగాణాలో చేసి చూపించారు అని అంటున్నారు. ఆ విధంగా దేశంలో ఒక అతి పెద్ద సామాజిక విప్లవానికి తెలంగాణా నాంది పలికింది అంటే రేవంత్ రెడ్డి కృషి ఎంతో ఉందని అంటున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇమేజ్ కూడా బాగా పెరిగింది అని చెబుతున్నారు. రానున్న రోజులలో ఇది రేవంత్ రెడ్డికి మరింతగా సామాజికంగా రాజకీయంగా ఇమేజ్ ని తెచ్చి పెడుతుందని అంచనా వేస్తున్నారు. సో ఈ పరిణామాలతో రేవంత్ రెడ్డి ఇమేజ్ బాగా పెరిగింది అని విశ్లేషిస్తున్నారు.