Begin typing your search above and press return to search.

గ్యాస్ ఛార్జీలు వద్దు సరే.. మెనూ కార్డు మార్చేస్తే?

అయితే.. ఇలా గ్యాస్ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేయటం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ స్పష్టం చేసింది.

By:  Garuda Media   |   26 March 2026 6:00 PM IST
గ్యాస్ ఛార్జీలు వద్దు సరే.. మెనూ కార్డు మార్చేస్తే?
X

అక్కడెక్కడో ఇరాన్ మీద ఇజ్రాయెల్.. దాని స్నేహితుడు అమెరికా కలిసి యుద్ధం చేస్తున్న వేళ.. దానికి ఏ మాత్రం సంబంధం లేని సుబ్బారావు.. తన ఇంటికి కాస్త దూరంలో ఉన్న రెస్టారెంట్ లో టిఫిన్ చేస్తే.. బిల్లుకు గ్యాస్ ఛార్జీ కింద బాదేస్తున్న వైనం గడిచిన మూడు వారాలకు పైనే సాగుతోంది. ఇదంతా ఇలా ఉంటే.. గ్యాస్ కొరత నేపథ్యంలో బ్లాక్ లో భారీగా ధరల్ని పెంచేస్తున్నారు. అందుకు తగ్గట్లే హోటళ్లు.. రెస్టారెంట్లు తమ మీద పడిన భారాన్ని అంతే వేగంగా వినియోగదారులకు బదిలీ చేస్తున్న పరిస్థితి. దీంతో.. మెనూతో సంబంధం లేకుండా.. పెరిగిన గ్యాస్ బండ భారాన్ని డబుల్ గా వసూలు చేస్తున్న పరిస్థితి.

అయితే.. ఇలా గ్యాస్ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేయటం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ స్పష్టం చేసింది. అంతేకాదు అదనంగా సర్వీసు ఛార్జీ వసూలు చేస్తే చర్యలు తప్పనిసరి అంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీసీపీఏ కీలక వ్యాఖ్యలు చేసింది. అందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. ‘‘కొందరు వినియోగదాల నుంచి అదనపు ఛార్జీలువసూలు చేస్తున్న అంశంపై మాకు ఫిర్యాదులు అందాయి. మెనూలో పేర్కొన్న దాని కంటే అదనంగా వసూలు చేయొద్దు’’ అని స్ఫష్టం చేశారు. ఎల్పీజీ ఛార్జీలు.. ఇంధన వ్యయం పేరుతో అదనపు బాదుడుకు చెక్ పెట్టాలని భావిస్తోంది.

ఇందుకు తగ్గట్లే కేంద్రం స్పందించింది. మెనూలో పేర్కొన్న దాని కంటే అదనంగా వసూలు చేయద్దని పేర్కొంది. ‘‘మెనూలో పేర్కొన్న దాని కంటే అదనంగా వసూలు చేయొద్దు. మెనూలో పేర్కొన్నవే తుది ధరలని.. అదనపు ఛార్జీల పేరుతో వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదు. వినియోగదారుల చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పని తేల్చేస్తున్నారు.

ఇదంతా ఓకే కానీ.. మెనూలో ధరల్ని మార్చేస్తూ నిర్ణయం తీసుకుంటే అప్పుడేమవుతుంది? ఇప్పటివరకు హోటళ్లు.. రెస్టారెంట్లు పెరిగిన గ్యాస్ ధరలు తాత్కాలికంగా పేర్కొంటున్నాయి. అందుకే మెనూలో మార్చేసే కన్నా.. ప్రస్తుతానికి అదనపు ఛార్జీలు వసూలు చేసి.. గ్యాస్ కష్టాలు తీరినంతనే పాత ధరల్ని వసూలు చేసేలా ప్లాన్ చేసుకున్నారు. తాజాగా విడుదలైన అదనపు ఛార్జీలపై హెచ్చరికల పుణ్యమా అని.. మెనూ కార్డులోని ధరల్ని మార్చేస్తే, అప్పుడేమవుతుంది? అన్నదే ప్రశ్న. ఆ దిశగా పలు హోటళ్లు అడుగులు వేయనున్నట్లుగా చెబుతున్నారు.