Begin typing your search above and press return to search.

దురంధ‌ర్ - ఐపిఎల్ జోరుతో అంబానీకి 35,000 కోట్ల రికార్డ్ ఆదాయం!

ముంబైలో శుక్రవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) కంపెనీ చైర్మన్ ముకేష్ అంబానీ అందించిన కొన్ని కీలక వివరాలు షాక్ కి గురి చేస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   20 Jun 2026 7:00 AM IST
దురంధ‌ర్ - ఐపిఎల్ జోరుతో అంబానీకి 35,000 కోట్ల రికార్డ్ ఆదాయం!
X

ముంబైలో శుక్రవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) కంపెనీ చైర్మన్ ముకేష్ అంబానీ అందించిన కొన్ని కీలక వివరాలు షాక్ కి గురి చేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2026 (FY26)లో రిలయన్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాలు రూ.34,917 కోట్ల (3.7 బిలియన్ డాల‌ర్లు) భారీ ఆదాయాన్ని ఆర్జించాయి. ఐపీఎల్ స‌హా లైవ్ స్పోర్ట్స్ సౌజ‌న్యంతో పాటు, `ధురంధర్` ఫిల్మ్ ఫ్రాంచైజీ ఈ రికార్డు స్థాయి వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

జియోస్టార్, జియోహాట్‌స్టార్ , జియో స్టూడియోస్ , నెట్‌వర్క్18 వంటి దిగ్గజ బ్రాండ్‌లతో కూడిన మీడియా వ్యాపారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,842 కోట్ల (616 మిలియన్ డాల‌ర్లు), ఎబిటా - రూ.3,434 కోట్ల (362 మిలియన్ డాల‌ర్లు) నికర లాభాన్ని నమోదు చేసింది. లీనియర్ టెలివిజన్ విభాగంలో `జియోస్టార్` ఏకంగా 34.7 శాతం వ్యూయర్‌షిప్ షేర్‌తో దూసుకుపోతోంది. అంతేకాదు జ‌యోస్టార్ వ్యూవ‌ర్ షిప్ దాని త‌ర్వాతి స్థానాల్లో ఉన్న మూడు అతిపెద్ద నెట్ వ‌ర్క్ ల‌తో స‌మానం అని విశ్లేషించారు అంబానీ. అలాగే 39 కోట్ల మంది త‌మ చాన‌ళ్ల‌ను వీక్షిస్తున్నార‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

డిజిటల్ వేదిక‌ `జియోహాట్‌స్టార్` ఈ ఏడాది సగటున 451 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. భారతదేశంలో ఒక పెయిడ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ వన్ బిలియన్ (100 కోట్ల) డౌన్‌లోడ్ల మైలురాయిని అందుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలోని 99 శాతం కనెక్టెడ్ టెలివిజన్లలో జియోహాట్‌స్టార్ అందుబాటులో ఉంది. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు ఈ ప్లాట్‌ఫారమ్‌కు అత్యధిక ఆదరణను తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్ సమయంలో రికార్డు స్థాయిలో ఏకకాలంలో 72.5 మిలియన్ల (7.25 కోట్లు) కాన్‌కరెంట్ వ్యూయర్స్ లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో `ధురంధర్ 2` అన్‌కట్ వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే అప్‌డేట్ అందించింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం `ధురంధర్ 2` సరికొత్త అన్‌కట్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేయడానికి సర్వం సిద్ధం చేసింది. జూన్ 19 నుండి ఈ చిత్రం అన్‌సెన్సార్డ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. అంతేకాదు థియేట్రిక‌ల్ రిలీజ్ చేసిన వెర్ష‌న్ కంటే కూడా ఈ ఓటీటీ వెర్ష‌న్ మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ కంటెంట్ తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని, క‌ట్ చేసిన సీన్ల‌ను యాడ్ చేసి రీవ్యాంప్ చేయ‌డం ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీట్ గా మారుతుంద‌ని తెలుస్తోంది.

ఈ అన్‌కట్ ఎడిషన్‌లో థియేటర్లలో మ్యూట్ చేసిన బూతు పదాలను యధాతథంగా ఉంచడంతో పాటు... మరింత నిడివికి పొడిగించిన యాక్షన్, వయలెంట్ సీన్లను కూడా చేర్చారు. ఇది సినిమా ప్రేమికులకు సరికొత్త - మరింత సీరియ‌స్ వీక్షణ అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు. రణ్‌వీర్ సింగ్ నటనతో మెప్పించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అభిమానులు మొత్తం ఐదు భారతీయ భాషల్లో వీక్షించేలా నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకువస్తోంది.