Begin typing your search above and press return to search.

ట్రెండింగ్ మోజులో ఊబిలో చిక్కుకుంటున్న యువత.. ఈ జంట ఏం చేసిందో తెలుసా?

ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ పేరిట యువత ఏ ఏ పనులు చేస్తున్నారో కూడా చెప్పడం కష్టంగా మారిపోయింది.

By:  Madhu Reddy   |   17 Sept 2025 10:13 AM IST
ట్రెండింగ్ మోజులో ఊబిలో చిక్కుకుంటున్న యువత.. ఈ జంట ఏం చేసిందో తెలుసా?
X

ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ పేరిట యువత ఏ ఏ పనులు చేస్తున్నారో కూడా చెప్పడం కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా పర్సనల్ విషయాలను కూడా ట్రెండింగ్ పేరుతో పబ్లిక్ లో పెట్టే అంత పిచ్చిలో బ్రతుకుతున్నారనే మాటలు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి వెలువడుతున్నాయని చెప్పవచ్చు. పైగా పబ్లిక్ లో పాపులారిటీని సొంతం చేసుకోవడానికి, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని, ఫాలోవర్స్ ను పెంచుకోవాలని రీల్స్ పిచ్చితో చేస్తున్న చేష్టలు ఇప్పుడు వార్తలుగా మారుతున్నా.. యువత ఆగడాలు మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి..

పైగా ట్రెండింగ్ మోజులో పడి ఏకంగా ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక జంట రీల్ పిచ్చిలో పడి ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టేసింది.. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక జంట చేసిన రీల్ అందరిలో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. కొంతమంది అబ్బాయిలు వంతెనపై నిలబడి ఉండగా.. వారందరూ కలిసి ఏదో స్టంట్ కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అప్పుడే కెమెరా వంతెన నుండి తలకిందులుగా వేలాడుతున్న వ్యక్తిని చూపిస్తుంది. ఒక తాడు అతడు పాదాలకు గట్టిగా కట్టవేయబడింది. ఇక రివర్స్ లో ఆ వ్యక్తిని కిందికి వదిలారు..క్రింద నదిలో బలమైన ప్రవాహంలో ఒక అమ్మాయి ఉంది. ఆమె మునిగిపోతున్నట్లు నటిస్తుంటే.. అతను కాపాడుతున్నట్లు ఆ వీడియోలో చూపించారు. ఇదంతా ఒక రీల్ షూటింగ్ అని స్పష్టంగా తెలుస్తోంది కూడా.. నీటిలో మునిగిపోతున్న అమ్మాయిని రక్షించడానికి బాలుడు సాహసం చేస్తున్నాడు అనే కాన్సెప్ట్ తో ఈ పిచ్చి రీల్స్ చేశారు. ఒకవేళ పొరపాటున ఆ తాడు తెగినా.. నీటి ప్రవాహం పెరిగినా ఇద్దరి ప్రాణాలు నీటిలో కలిసినట్లే .దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

రీల్స్ మోజులో పడి పాపులారిటీని పెంపొందించుకోవడానికి.. ఫాలోవర్స్ ను సంపాదించుకోవడానికి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎంత కాలం చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ట్రెండింగ్ మోజులో పడి యువత ఈ ఊబిలో చిక్కుకుపోతూ ప్రాణాలను కూడా కోల్పోతున్నారనటంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువత రీల్స్ మోజులో పడి రైళ్ల కింద పడుకోవడం.. వేగంగా వెళుతున్న రైళ్ల పక్కన నడవడం.. నదిలోకి దూకడం.. వెళ్తున్న కారు నుండీ డోరు తీసి సడన్గా పక్కకు దూకి దాని పక్కనే డాన్స్ చేస్తూ ముందుకు వెళ్లడం.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని పిచ్చి పనులు చేస్తూ ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు. మరి ఇలాంటి ఆగడాలను అరికట్టాలి అంటే అధికారులు రంగంలోకి దిగాలని సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి ఎప్పటికీ తమను తాము మార్చుకొని వాస్తవం లోకి వస్తారో చూడాలి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.