టాక్సిన్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి?
టాక్సిన్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి అనే సందేహం రావొచ్చు. వాస్తవానికి తరచూ నీరసం, తలనొప్పి, జీర్ణ సంబంధ సమస్యలు వస్తున్నాయంటే శరీరంలో టాక్సిన్స్ పెరిగినట్టేనని నిపుణులు చెబుతున్నారు.
By: Raja Ch | 30 Sept 2025 5:00 AM ISTశరీరంలో రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు రెగ్యులర్ మెడికల్ టెస్టులు చేయించుకుంటారనే సంగతి తెలిసిందే. ఆ రిజల్ట్ ని బట్టి ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తారు. మరి శరీరంలోపల పెరిగిపోయిన మురికిని వదిలించుకోవాలంటే ఎలా? అందుకే టాక్సిన్ టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఏమిటీ టాక్సిన్ టెస్ట్, ఎందుకు చేయించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దామ్!
అవును... కలుషితమైన గాలి, నీరు, ఆహారం వల్ల మనకు తెలియకుండానే శరీరంలోకి పెద్ద మొత్తంలో వ్యర్థాలు వెళ్లిపోతుంటాయి. ఇవి రెగ్యులర్ గా చేయించుకునే పరీక్షల్లో కనిపించవు. కాకపోతే చాలా అనారోగ్యాలకు ఇవే ప్రధాన కారణాలుగా ఉంటాయి. వీటినే టాక్సిన్స్ అని అంటారు. ఇవి సైలంట్ గా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి. చర్మం, జీర్ణవ్యవస్థ పాడైపోతాయి.
టాక్సిన్ టెస్ట్ అంటే ఏమిటి?:
మీ శరీరంలో హానికర రసాయనాలు ఏ మేరకు ఉన్నాయనేది చెప్పేదే టాక్సిన్ టెస్ట్. శరీరంలో హానికర కెమికల్స్ ఏమైనా ఉంటే ఈ టాక్సిన్ టెస్ట్ లో తెలుతుంది. వీటితో పాటు పెస్టిసైడ్స్, ప్లాస్టిక్ కణాలు కూడా ఏ మేర ఉన్నాయో తెలుస్తుంది. మిగిలిన టెస్ట్ ల మాదిరిగానే ఈ పరీక్షకు రక్తం, యూరిన్ లేదా వెంట్రుకల శాంపిల్స్ తీసుకుని ఏ మేర టాక్సిన్స్ ఉన్నాయన్నది గుర్తిస్తారు.
టాక్సిన్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి?:
టాక్సిన్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి అనే సందేహం రావొచ్చు. వాస్తవానికి తరచూ నీరసం, తలనొప్పి, జీర్ణ సంబంధ సమస్యలు వస్తున్నాయంటే శరీరంలో టాక్సిన్స్ పెరిగినట్టేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు చర్మం పొడిబారడం, నిద్ర లేమి లాంటి లక్షణాలు కనిపించినా లోపల టాక్సిన్స్ పెరిగిపోయాయని అర్థం చేసుకోవాలని అంటున్నారు.
కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారితో పాటు రెగ్యులర్ గా మద్యం సేవించడం, పొగ తాగడం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం లాంటివి టాక్సిన్స్ ని రెట్టింపు చేస్తాయని అంటున్నారు. ఇలాంటి వాళ్లు తప్పనిసరిగా టాక్సిన్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
టాక్సిన్ టెస్ట్ గురించి సమంత పోస్ట్!:
ఇటీవల తాను టాక్సిన్ టెస్ట్ చేయించుకున్నట్లు వెళ్లడించిన సమంత.. దీని గురించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా... అందరూ స్వచ్ఛమైన ఆహారం తింటున్నామని అనుకుంటారు.. స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నారని, గాలి పీలుస్తున్నారని అనుకుంటారు.. కానీ, వీటి ద్వారానే టాక్సిన్స్ లోపలకు వెళ్తున్నాయని మాత్రం గమనించడం లేదు అని సమంత పోస్ట్ పెట్టింది.
ఈ క్రమంలోనే తాను టాక్సిన్ టెస్ట్ చేయించుకున్నట్టు చెప్పింది. అనుకున్న దాని కన్నా టాక్సిన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు ఆ టెస్ట్ లో తేలిందని వెల్లడించింది.
