వడ్డీ రేట్లు పెరగవు.. కానీ, ధరలు పెరుగుతాయి!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మరోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. వాస్తవానికి ప్రతి రెండు మాసాలకు ఒకసారి ద్రవ్యపరపతి(లోన్) విధానాన్ని ఆర్బీఐ సమీక్షిస్తోంది.
By: Garuda Media | 5 Aug 2026 12:17 PM ISTరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మరోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. వాస్తవానికి ప్రతి రెండు మాసాలకు ఒకసారి ద్రవ్యపరపతి(లోన్) విధానాన్ని ఆర్బీఐ సమీక్షిస్తోంది. గతంలో ఆరు మాసాలకు లేదా మూడు మాసాలకు ఒకసారి సమీక్షించే ఈ విధానంలో మార్పులు చేశారు. ఈ క్రమంలోనే రెండు మాసాలకు ఒకసారి సమీక్షిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు సార్లు సమీక్షించగా.. ఒక్కసారి కూడా వడ్డీ రేట్లను తగ్గించలేదు. పెంచలేదు.
తాజాగా బుధవారం ఆర్బీఐ గవర్నర్ మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం వడ్డీ రేట్లను యథాతథంగా నే కొనసాగిస్తున్నట్టు తెలిపారు. దీంతో హోం లోన్, వాహనాల రుణాలు, విద్యా రుణాలకు చెల్లించే వడ్డీ లలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే... ఇక్కడే తిరకాసు ఉంది. ఇవి గృహ వాహన, విద్యా రుణాలకు మాత్రమే పరిమితం. కానీ, మరోవైపు ద్రవ్యోల్బణం పొంచి ఉన్న నేపథ్యంలో బ్యాంకులకు స్వేచ్ఛ కల్పించారు. గరిష్టంగా నూటికి 50 పైసలు చొప్పున పెంచుకునేందుకు బ్యాంకులకు వెసులు బాటు ఉంటుంది.
దీనిపై మాత్రం మల్హోత్రా ఎలాంటి ప్రకటనచేయలేదు. ఇక, డొమెస్టిక్ ఇండెక్స్‌లోనూ మార్పులు చేయలే దు. తద్వారా.. ప్రస్తుతం ఉన్న నిత్యావసరాల ధరలు.. యథాతథంగానే ఉంటాయని చెప్పకనే చెప్పినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్కెట్ ఇంటర్వెన్షన్‌ను తీసేశారు. అంటే.. ధరలు పెరిగినప్పుడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యంచేసుకునే వెసులు బాటు ఇక నుంచి ఉండదు. తద్వారా బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగితే.. వినియోగదారులపైనే ఆ భారం పడనుంది.
ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని.. ప్రజలకు కొంత మేరకు ధరలు తగ్గించాల్సి ఉంటుంది. కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎత్తేయడంతో ధరలను తగ్గించే అవకాశం .. అవసరం కూడా ప్రభుత్వాలకు ఉండదు. అంటే.. ప్రత్యక్షంగా ద్రవ్యపరపతి విధానం మేరకు వడ్డీలను పెంచకపోయినా.. ధరలను అదుపు చేసే యంత్రాగంపై మాత్రం ఆర్బీఐ దృష్టి పెట్టలేదు. దీంతో భవిష్యత్తుల్లో నిత్యావసరాల ధరలు మరింత పెరగనున్నాయన్నది నిపుణులు చెబుతున్నమాట.
