Begin typing your search above and press return to search.

అబ్బాయిలకూ పీరియడ్స్ టాపిక్... మహిళా డాక్టర్ కీలక వ్యాఖ్యలు!

మరోవైపు నెట్టింట దీనికి సమాధానంగా పలు నివేదికలు హల్ చల్ చేస్తున్నాయి! ఈ నేపథ్యంలో ఓ మహిళా డాక్టర్ ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.. ప్రశంశల వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.

By:  Raja Ch   |   16 Nov 2025 5:08 PM IST
అబ్బాయిలకూ పీరియడ్స్ టాపిక్... మహిళా డాక్టర్ కీలక వ్యాఖ్యలు!
X

'సీత కష్టాలు సీతవైతే, పీత కష్టాలు పీతవి' అనేది నానుడి. అంటే ఈ సృష్టిలో ఏ జీవి కష్టాలు వాటికి ఉంటాయి.. అయితే, అవి వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పుడు ఈ చర్చ ఎందుకంటే... పీరియడ్స్ విషయలో ఇటీవల రష్మిక చేసిన వ్యాఖ్యలు.. దీనిపై నెట్టింట జరుగుతున్న చర్చ.. తెరపైకి వస్తోన్న పలు నివేదికలు.. తాజాగా ఓ మహిళా వైద్యురాలు ఇచ్చిన వివరణ.

అవును... నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల "ది గర్ల్ ఫ్రెండ్" మూవీ రిలీజ్ నేపథ్యంలో జగపతిబాబు "జయమ్ము నిశ్చయమ్మురా" టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పందిస్తూ.. మగాళ్లకు ఒకసారి పీరియడ్స్ వస్తే, ఆడవాళ్లు పడే బాధ అర్థమవుతుందని.. ఆ నొప్పి, అసౌకర్యం, మూడ్ స్వింగ్స్ అన్నీ అర్ధం చేసుకోవాలంటే వారికి లైఫ్ లో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలని అన్నారు!

దీంతో ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. దీనిపై కొంతమంది అబ్బాయిల నుంచి కౌంటర్లు పడుతుండగా.. మరికొంతమంది నుంచి వివరణలు వస్తున్నాయి! మరోవైపు నెట్టింట దీనికి సమాధానంగా పలు నివేదికలు హల్ చల్ చేస్తున్నాయి! ఈ నేపథ్యంలో ఓ మహిళా డాక్టర్ ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.. ప్రశంశల వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.

దీనిపై స్పందించిన సదరు మహిళా వైద్యురాలు... నేను అమ్మాయిగా పుట్టాను, దీనివాల్లే నాకు పీరియడ్స్ వస్తున్నాయి.. అబ్బాయిగా పుట్టుంటే బాగుండేది అని కొంతమంది అనుకుంటారు కానీ.. అమ్మాయిగా పుట్టడం అనేది ఒక వరం, అది వీక్ నెస్ కానే కాదని.. ఈ పీరియడ్స్ వల్లే ఈ సృష్టి నిలుస్తుందని అన్నారు. అమ్మాయిలకు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ వల్ల 'పీఎంఎస్' (ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోం) సింటమ్స్ ఉంటాయని తెలిపారు.

అయితే... ఇవే హార్మోన్లు అబ్బాయిలలోనూ ఉంటాయని.. వారిలో ఈ హార్మోన్స్ మార్పుల వల్ల నిద్ర, శక్తి, మూడ్ అన్నీ డిస్ట్రబ్ అవుతాయని తెలిపారు. వీటితో పాటు మగాళ్లలో టెస్టోస్టిరాన్ హార్మోన్ లో మార్పులు ఎక్కువగా జరుగుతుంటాయని తెలిపారు. దీనివల్ల ఇరిటేషన్, మూడ్ స్వింగ్స్ ఉంటాయని అన్నారు. వాస్తవానికి అమ్మాయిలకు పీఎంఎస్ వస్తే ఇంట్లో కేర్, భర్త కేర్ దొరుకుతుందని తెలిపారు.

కానీ... ‘మేల్స్ కి పీఎంఎస్ వస్తే’? అనే కీలక ప్రశ్నను ఆమె సంధించారు. ఈ సందర్భంగా.. చిన్నప్పటి నుంచీ "నువ్వు అబ్బాయివిరా నువ్వు ఏడవకూడదు.. గట్టిగా ఉండాలి" అని చెప్పారని.. వాళ్లకు నిజంగా చాలా డిస్ట్రబెన్స్ ఉంటుందని వెల్లడించారు! పీఎంఎస్ అంటే డ్రామా కాదు హార్మోన్స్ అని గుర్తుపెట్టుకోవాలని ఆమె సూచించారు.

ఇదే సమయంలో... ఇంట్లో భార్యకు పీఎంఎస్ వస్తే దాన్ని ఆమె చెప్పే ఓ సాకుగా చూడకుండా... "ఏమైనా హెల్ప్ కావాలా?" అని అడగండని మగాళ్లకూ సూచించారు. ఈ సందర్భంగా... అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిల హార్మోన్స్ రెండింటినీ గౌరవించుకోవాలని తెలిపారు.