Begin typing your search above and press return to search.

లోడ్ లారీ బొలెరో పై పడితే... హైవేపై వైరల్ వీడియో!

అవును... ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలో ఆదివారం ఒక విషాద సంఘటన జరిగింది.

By:  Raja Ch   |   29 Dec 2025 1:21 PM IST
లోడ్ లారీ బొలెరో పై పడితే... హైవేపై వైరల్ వీడియో!
X

దేశంలో ప్రతీ ఏటా వేల మంది రోడ్డు ప్రమాదాల వల్ల మృతి చెందుతున్నట్లు ఘణాంకాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేక, పూర్తి అభ్యాసం చేయకుండానే షార్ట్ కట్ లో లైసెన్స్ సంపాదించుకుని రోడ్లపైకి వచ్చేయడం వల్ల, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల, కొన్ని సందర్భాల్లో మినిమం కామన్ సెన్స్ లేకపోవడం వల్ల.. కారణం ఏదైనప్పటికీ రోడ్డు ప్రమాదాల వల్ల వేల ప్రాణాలు పోతున్నాయి. ఈ క్రమంలో తాజా ఘటన తీవ్ర సంచలనంగా మారింది.

అవును... ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలో ఆదివారం ఒక విషాద సంఘటన జరిగింది. ఇందులో భాగంగా... నైనిటాల్ జాతీయ రహదారిపై పొట్టుతో ఫుల్ గా లోడైన ట్రక్కు కదులుతున్న బొలెరోపైకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ బొలెరో వాహనంలోని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. పహాడీ గేట్ సమీపంలోని గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పొట్టును ఫుల్ గా లోడ్ చేసుకుని తీసుకెళ్తున్న లారీ.. జాతీయ రహదారిపై వెళుతుండగా నియంత్రణ కోల్పోయింది. దీంతో.. దాని పక్కనే ప్రయాణిస్తున్న బొలెరో వాహనంపై తిరగబడిపోయింది! ఈ ఘటనలో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదానికి గురైన ఆ బొలెరో వాహనంపై 'గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్' అని రాసి ఉంది. దీంతో.. ఇది ప్రభుత్వ వాహనమై ఉంటుందని అంటున్నారు!

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న రాంపూర్ పోలీసు సూపరింటెండెంట్ విద్యాసాగర్ మిశ్రా.. సమీపంలోని పోలీసు స్టేషన్ల నుండి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా.. బొలెరో వాహనంపై పడిన లారీని జేసీబీ యంత్రం సాయంతో లేపి.. బొలెరో వాహనం నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం.. మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ బొలెరోలో డ్రైవర్ ఒక్కరే ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఎస్పీ మిశ్రా... ప్రధానంగా జాతీయ రహదారుల్లో రద్దిగా ఉండే ప్రాంతాల్లో వాహందారులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమయంలో.. రహదారిపై ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసు బృందాలతో పాటు అగ్నిమాపక వాహనాలను మొహరించినట్లు వెల్లడించారు. మృతుడి మొబైల్ ఆధారంగా కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు!