రంపచోడవరంలో టీడీపీ డీలా పడుతోందా...?
రంపచోడవరం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన ఎస్టీ నియోజకవర్గం. గతంలో వైసీపీకి బలంగా ఉన్న నియోజకవర్గంలో గత 2024 ఎన్నికల్లో టీడీపీవిజయం సాధించింది.
By: Garuda Media | 22 May 2026 3:00 PM ISTరంపచోడవరం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన ఎస్టీ నియోజకవర్గం. గతంలో వైసీపీకి బలంగా ఉన్న నియోజకవర్గంలో గత 2024 ఎన్నికల్లో టీడీపీవిజయం సాధించింది. వాస్తవానికి 2009 నుంచి చూసుకుంటే.. అప్పట్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం దక్కించుకున్నారు. మరోవైపు.. వైసీపీ తన పార్టీ తరఫున పోటీ చేసే వారిని మార్చినప్పటికీ..ఇ క్కడ నుంచి విజయం దక్కించుకోవడంగమనార్హం.
అయితే.. గత ఎన్నికల్లో కూటమి ప్రభావంతో ఇక్కడ టీడీపీ నాయకురాలు మిరియాల శిరీషా దేవి విజయం సాధించారు. అయితే.. గత మూడు ఎన్నికలతో పోల్చుకుంటే.. ఆమె పెద్దగా మెజారిటీ దక్కించుకోలేక పోయారు. కేవలం 9 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే దక్కించుకున్నారు. ఇక, గడిచిన రెండు సంవత్సరాల కాలంలో శిరీషా దేవి గ్రాఫ్ ఎలా ఉందన్న ప్రశ్నకు మాత్రం ఒకింత పెదవి విరుపులే కనిపిస్తున్నాయి. పార్టీపరంగా పెద్దగా దూకుడు కనిపించడం లేదు.
మరోవైపు.. వైసీపీ నాయకురాలు, 2019లో విజయం దక్కించుకున్న ధనలక్ష్మి.. అందరినీ కలుపుకొని పోతున్నారు. ఈ పరిణామాలకు తోడు.. వైసీపీ ఇస్తున్న పిలుపు మేరకు నిరసనలు, ధర్నాలను కూడా ఈ నియోజకవర్గంలో ఆమె ముందుండి నడిపిస్తున్నారు. ఎస్టీలకు వైసీపీ హయాంలో జరిగిన మేళ్లను ఆమె వివరిస్తున్నారు. ఇటీవల కొన్నాళ్ల పాటు ఇంటింటి ప్రచారం కూడా చేశారు. జగన్ ఆలోచనల మేరకు.. ఆయన ఇస్తున్న ఆదేశాల మేరకు.. పార్టీపరంగా దూకుడుగా ఉన్నారు.
ఇక, టీడీపీ విషయాన్ని చూసుకుంటే.. అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయని అంటున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వంతల రాజేశ్వరికి ప్రాధాన్యం లేకపోవడంతోపాటు.. ఎమ్మెల్యే కనీసం తనకు అప్పాయింట్మెంటు కూడా ఇవ్వడం లేదని రాజేశ్వరి, ఆమె కుటుంబం కూడా ఆవేదన తో ఉన్నారు. ఇది అంతర్గత కలహాలకు.. వర్గ పోరుకు దారి తీస్తోంది. అయితే.. ఎన్నికలకు ఇంకా చాలానే సమయం ఉందని భావిస్తున్న ఎమ్మెల్యే వీటిని లైట్ తీసుకుంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఫిఫ్టీ- ఫిఫ్టీ అన్నట్టుగానే మారిందని పరిశీలకులు చెబుతున్నారు.
