Begin typing your search above and press return to search.

కింజరాపు ఫ్యామిలీలో కొత్త సంబరం... పిక్స్ వైరల్!

కింజరాపు ఫ్యామిలోకి ఇటీవల వారసుడొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మరోసారి తండ్రయ్యారు

By:  Raja Ch   |   26 Oct 2025 2:10 PM IST
కింజరాపు ఫ్యామిలీలో కొత్త సంబరం... పిక్స్  వైరల్!
X

కింజరాపు ఫ్యామిలోకి ఇటీవల వారసుడొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మరోసారి తండ్రయ్యారు. రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. శ్రావ్య ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆగస్టు 13న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఆ బిడ్డకు నామకరణ వేడుక జరిగింది.

అవును... రామ్మోహన్ నాయుడికి తొలి సంతానంగా పాప ఉండగా.. రెండో సంతానంగా బాబు పుట్టిన సంగతి తెలిసిందే. కింజరాపు ఫ్యామిలీలోకి వారసుడు రావడంతో ఎర్రన్నాయుడు మళ్లీ పుట్టారంటూ కింజరాపు కుటుంబ అభిమానులు సంతోషంలో ఉన్నారు. వారి సంతోషాన్ని రెట్టిపుచేస్తూ అన్నట్లుగా.. ఎర్రన్నాయుడు గౌరవార్థం ఆ బిడ్డకు ప్రేమగా శివన్ ఎర్రన్నాయుడు అని పేరు పెట్టారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుండి అనేక మంది నాయకులు హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తో పాటు రామ్మోహన్ నాయుడి బాబాయ్, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు హాజరయ్యారు. వీరితోపాటు సన్నిహితులు, శ్రేయోభిలాషులు, రాజకీయ సహచరులు హాజరై చిన్నారికి ఆశీస్సులు అందించారు.

కాగా... రామ్మోహన్ నాయుడు, శ్రావ్యల వివాహం 2017లో జరిగింది. వీరికి తొలి సంతానంగా పాప ఉండగా.. రెండో సంతానంగా బాబు పుట్టాడు. రామ్మోహన్ నాయుడు 2014,2019, 2024 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరఫు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం కేందమ్రంత్రి వర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు.

రామ్మోహన్ నాయుడు కుమారుడికి లోకేష్ ఆశీస్సులు!:

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష.. గత నెల మొదటివారంలో ఢిల్లీలోని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా... రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు జన్మించిన కుమారుడిని ఆయన ఆశీర్వదించారు. బాబును ఎత్తుకొని ముద్దాడారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి మాధవీలతని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.