Begin typing your search above and press return to search.

‘రాకీ’తో షేక్ హ్యాండ్.. రామ్మోహన్ నాయుడు వీడియో వైరల్

విశాఖ విమానాశ్రయంలో పోలీస్ డాగ్ రాకీతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కరచాలనం చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది.

By:  Tupaki Political Desk   |   19 Feb 2026 6:01 PM IST
‘రాకీ’తో షేక్ హ్యాండ్.. రామ్మోహన్ నాయుడు వీడియో వైరల్
X

నిత్యం బిజీగా ఉండే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తనలో మరో కోణం బయటపెట్టారు. విశాఖలో ప్లీట్ రివ్యూ కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహననాయుడు తిరుగు ప్రయాణంలో నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఆయన చేసిన పనిని అభిమానులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. కేంద్ర మంత్రిగా ప్రొటోకాల్ ను పక్కన పెట్టి రామ్మోహన్ నాయుడు కాసేపు సరదాగా గడపడం అందరినీ ఆకట్టుకుంది. హోదాలను పక్కన పెట్టి రాకీతో కరచాలనం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

విశాఖ విమానాశ్రయంలో పోలీస్ డాగ్ రాకీతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కరచాలనం చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. విశాఖ ప్లీట్ రివ్యూ ముగించుకుని ఢిల్లీకి తిరుగు పయానమైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కాసేపు వీఐపీ లాంజ్ లో ఉన్నారు. విమానం బయలుదేరే సమయంలో లాంజ్ నుంచి బయటకు వస్తుండగా, అక్కడే విధుల్లో ఉన్న పోలీసు జాగిలం రాకీని చూశారు. వెంటనే దాని వద్దకు వెళ్లి తలపై చేయి వేసి ఆప్యాయంగా నిమిరారు. కాసేపు సరదాగా ఆడుకున్నారు. ఇక పక్కనే ఉన్న సిబ్బంది సూచనలతో రాకీ కేంద్ర మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చింది.

ఈ దృశ్యం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. కొందరు వీడియోలు తీసి తమ సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది. కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు తన హోదాను పక్కన పెట్టి పోలీసు జాగిలం తలపై నిమిరడం, దానితో కరచాలనం చేయడాన్ని విశేషంగా చెబుతున్నారు. రామ్మోహన్ నాయుడు స్వతహాగా మూగ జీవాలను ప్రేమిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పోలీసు జాగిలాన్ని చూడగానే, అక్కడికి వెళ్లి దాని పేరు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ‘హలో రాకీ.. హౌ ఆర్ యూ’ అంటూ పలకరించారు.

సాధారణంగా కేంద్ర మంత్రులు వెళ్తున్నప్పుడు అధికారులు, సిబ్బంది హడావుడి కనిపిస్తుంది, కానీ రామ్మోహన్ నాయుడు మాత్రం అధికారుల హడావుడిని దాటుకుని పోలీసు జాగిలం వద్దకు వెళ్లడం, దానికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎంతో ప్రేమగా నిమరడంపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. డ్యూటీలో నిమగ్నమైన ఆ జాగిలం కూడా మంత్రి ప్రేమకు ప్రతిస్పందించడం ఆకట్టుకుందని అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి హోదాలో ఉన్నప్పటికీ, మూగజీవాల పట్ల ఆయన చూపిన ఈ ఆత్మీయత నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. "మంత్రి గారు భలే సరదా మనిషి" అంటూ విమానాశ్రయ ప్రయాణికులు కూడా చర్చించుకున్నారు.