పోయే కాలం: రామాయణం నాటక ప్రదర్శనలో అశ్లీలం
గంజాం జిల్లాలో దిగపొహండి సమితి నిర్వహిస్తున్న నాటక యాత్రలో భాగంగా రెండు నాటక బృందాలు పోటాపోటీగా ప్రదర్శించిన రామాయణం నాటకంలో అశ్లీలత హద్దులు దాటింది.
By: Garuda Media | 17 Nov 2025 12:27 PM ISTవీరి చేష్టల ముందు బరితెగింపు అన్న మాట కూడా చిన్నదే అవుతుంది. కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరిస్తున్న ఈ నాటక బృందం గురించి తెలిస్తే ఒళ్లు మండిపోవటమే కాదు.. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. పరమ పవిత్ర గ్రంధంగా భావించే రామాయణాన్ని నాటక రూపంలో ప్రదర్శించే క్రమంలో అశ్లీలతను జొప్పించటం.. హద్దులు దాటేసే అరాచకాల్ని ప్రదర్శించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఒడిశాలో చోటు చేసుకున్న ఈ దుర్మార్గం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.
గంజాం జిల్లాలో దిగపొహండి సమితి నిర్వహిస్తున్న నాటక యాత్రలో భాగంగా రెండు నాటక బృందాలు పోటాపోటీగా ప్రదర్శించిన రామాయణం నాటకంలో అశ్లీలత హద్దులు దాటింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఇలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రామాయణం నాటక ప్రదర్శన పేరుతో రెండు నాటక బృందాలు 24 గంటల పాటు నాన్ స్టాప్ గా నిర్వహించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా ఈ రెండు టీంలు పోటాపోటీగా యాభై గంటలకు పైనే నిర్వహించాయి. ఇందులో భాగంగా హిజ్రాలతో డ్యాన్సులు నిర్వహించటం.. నాటకంలో భాగంగా పాత్రధారులు హద్దులు దాటిన అశ్లీలాన్ని ప్రదర్శించారు. పరమ పవిత్రంగా పేర్కొనే సీత పాత్రధారిణిని రావణుడు ఆమె శరీరంలో పలు చోట్ల తాకటం.. మద్దులు పెట్టటం లాంటి పైత్యాన్ని ప్రదర్శించాడు.
దీనికి తోడు ఐటెమ్ గర్ల్ నిషా మహరణా అశ్లీల న్రత్యాలు.. హిజ్రాల అర్థనగ్నంగా డ్యాన్సులు వేయటం..ఒక దశలో క్రేన్ ఎక్కి ప్రమాదకరంగా చేసిన విన్యాసాలు షాక్ కు గురి చేశాయి. రామాయణం లాంటి పౌరాణిక నాటకంలో అశ్లీల ప్రదర్శనలు అత్యంత హేయమని పలువురు మండి పడుతున్నారు. ఈ తరహా ప్రదర్శనలు ఇచ్చే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆలిండియా థియేటర్ కౌన్సిల్ జాతీయ ఉపాధ్యక్షుడు రాజ్ గోపాల్ వ్యాఖ్యానించారు. నిజమే.. ఈ తరహా కల్చర్ ను మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఏంతైనా ఉంది.
