Begin typing your search above and press return to search.

శ్రీరామ నవమికి ముందే పవన్ కానుక

ఇదిలా ఉంటే ఇక్కడ గిరి ప్రదక్షిణం చేయాలంటే భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం గతంలో రాళ్లు రప్పలు ముళ్ల కంపలతో పూర్తిగా నిండి ఉండేది.

By:  Satya P   |   26 March 2026 6:00 AM IST
శ్రీరామ నవమికి ముందే పవన్ కానుక
X

శ్రీరామ నవమికి సరిగ్గా రెండు రోజుల ముందు భక్తులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహత్తరమైన కానుకను అందించారు. ఉత్తరాంధ్రాలో మరో ఆయోధ్యగా భక్తులకు రెండవ భద్రాచలం గా ప్రసిద్ధి పొందిన రామతీర్థం పుణ్య క్షేత్రానికి గిరి బాటను వేసి పవన్ ఆధ్యాత్మికతను నిండా నింపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న రామతీర్థం రాముడికి అతి పెద్ద పుణ్యక్షేత్రం గా ఉంది. ఉత్తరాంధ్రా నలు మూలల నుంచి భక్తులు ప్రతీ ఏటా శ్రీరామ నవతి సందర్భంగా ఇక్కడికి వేలాదిగా తరలి వస్తారు. వారందరికీ ఒక్కటే కోరిక. రామతీర్థం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయాలని. చిరకాల ఆ కోరికను పవన్ కళ్యాణ్ ఈసారి నవమికి ముందే నెరవేర్చి భక్తులలో అనందం తీసుకుని వచ్చారు.

రామతీర్థంలో భారీ అభివృద్ధి :

రామతీర్థం ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. పురాణేతిహాసాల్లో ప్రస్తావన ఉంది. అలాంటి ఆలయాన్నికి కొత్త సొబగులను అద్దే ప్రయత్నమే ఈ గిరి బాటగా చెబుతున్నారు. 3 కోట్ల 40 లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గిరిబాట నిర్మాణం చేపట్టారు. గిరి ప్రదక్షిణ కోసం తరలి వచ్చే వేలాది భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేలా ఆ మార్గంలో రోడ్డు మంజూరు చేసి వేగంగా పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని దృశ్య మాధ్యమం ద్వారా పవన్ కళ్యాణ్ తాజాగా ప్రారంభించారు. సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు 3.70 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు.

రాళ్లు, ముళ్ల కంపలతోనే :

ఇదిలా ఉంటే ఇక్కడ గిరి ప్రదక్షిణం చేయాలంటే భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం గతంలో రాళ్లు రప్పలు ముళ్ల కంపలతో పూర్తిగా నిండి ఉండేది. అయినప్పటికీ స్వామి పట్ల భక్తిని చాటుకుంటూ భక్తులు కష్టమైనా ఆ మార్గంలోనే నడిచేవారు. అయితే ఈ విషయాన్ని స్థానికంగా భక్తుల నుంచి ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతుల మేరకు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రోడ్డు నిర్మాణానికి కేటాయించారు. అలా ముళ్ల పొదలు తుప్పలతో నిండిన దారి కాస్తా చక్కనైన బీటీ రోడ్డుగా మారింది. అంతే కాదు శ్రీరామ నవమికి రెండు రోజుల ముందే రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో భక్తులు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

20 నెలల్లో 40 కోట్లు :

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక గడచిన ఇరవై నెలలలోనే 40 కోత్ల రూపాయలను వెచ్చించి ఆలయాల అభివృద్ధికి పలు నిర్మాళాను చేపట్టింది. ఈ 40 కోట్లతో 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు వసతి కల్పించామని పవన్ చెప్పారు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని మహా శివరాత్రి పండుగకు ముందే అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. అలాగే ⁠కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా తొందరలో చేపడతామని చెప్పారు.

నాడు ఆవేదన అంటూ :

ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదే రామతీర్థం పుణ్యక్షేత్రంలో రాములవారి విగ్రహం శిరచ్ఛేదం చేస్తే కోట్లాది మంది హిందువు భక్తులు బాధకి గురయ్యారని అన్నారు. అలాంటి వారిలో తానూ ఒకడిని అని చెప్పారు. ఆ ఘటన తనకు తీవ్ర వేదన కలిగించిందని ఆయన అన్నారు. అయితే ఈ రోజున ఆలయానికి గిరి ప్రదక్షిణ మార్గాన్ని సుందరంగా నిర్మించడం గొప్ప విశేషం అన్నారు. సంస్కృతి సంప్రదాయాలను కూటమి ప్రభుత్వం కాపాడుతుందని పవన్ హామీ ఇచ్చారు.