Begin typing your search above and press return to search.

గో ఎహెడ్ రామ్మోహన్....సంక్షోభ వేళ మోడీ

సరైన సమయంలో ఏకంగా సమయస్ఫూర్తితో వ్యవహరించారంటూ కంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు.

By:  Satya P   |   9 Dec 2025 9:02 AM IST
గో ఎహెడ్  రామ్మోహన్....సంక్షోభ వేళ మోడీ
X

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ ఇండిగో విమానం సంక్షోభం నేపథ్యంలో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జాతీయ మీడియా అయితే ఇదే ఇష్యూ మీద ఫుల్ ఫోకస్ చేస్తూ కేంద్ర మంత్రిని గట్టిగా ప్రశ్నిస్తోంది. వేలాది మంది ప్రయాణీకులు వారితో పాటే ప్రభావితం అవుతున్న మరిన్ని వేల మంది ప్రజలతో ఇండిగో అతి పెద్ద సంక్షోభాన్ని దేశంలో క్రియేట్ చేసింది. ఈ కష్ట సమయంలో రామ్మోహన్ తాను చేయాల్సినవి అన్నీ చేస్తున్నారు. అయితే ఆయనకు విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అలాగే మీడియా నుంచి కూడా ప్రషర్ పెరుగుతోంది. అయితే ఇంతటి క్లిష్టమైన వేళ కూడా ఎక్కడా తగ్గకుండా తాను అనుకున్న విధంగా సంక్షోభాన్ని క్లియర్ చేసే పనిలో యువ కేంద్ర మంత్రి ఉన్నారు. ఆయన రాత్రీ పగలూ తేడా లేకుండా సమయం వెచ్చింది మరీ ఒక కొలిక్కి తీసుకుని వస్తున్నారు.

పార్లమెంట్ లోనూ ధీటుగా :

ఇక ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆన్ గోయింగ్ సెషన్ లో ఇది అతి పెద్ద ఇష్యూ కావడంతో మొత్తం విపక్షం అయితే కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర మంత్రి మీద కూడా తన బాణాలను ఎక్కు పెడుతోంది. కానీ రామ్మోహన్ తనకు ఉన్న వాగ్దాటితో సమయ స్పూర్తితో ధీటుగా వాటిని ఎదుర్కోని పదునైన జవాబులు ఇస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వంగా తాము ఏమి చేసింది అన్నది సభ దృష్టిలో పెడుతున్నారు. ఇల ఒక వైపు శాఖాపరంగా ఒత్తిడి, మరో వైపు జాతీయ మీడియా ఇంకో వైపు పార్లమెంట్ లో ప్రతిపక్షం ఈ విధంగా ముప్పేట ఇబ్బందులు ఒకేసారి ఎదుర్కొంటున్న రామ్మోహన్ కి అతి పెద్ద అండ లభించింది. దేశాన్ని ఏలే ప్రధాని కేంద్ర ప్రభుత్వ సారధి అయిన నరేంద్ర మోడీ అయితే శభాష్ రామ్మోహన్ అని ప్రశంసించడం విశేషం.

భారీ కితాబు :

సరైన సమయంలో ఏకంగా సమయస్ఫూర్తితో వ్యవహరించారంటూ కంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. శాఖాపరంగా సరైన నిర్ణయాలు తీసుకున్నారు అని కూడా మోడీ చెప్పడం విశేషం. మీ పనితీరు భేషుగ్గా ఉందని క్లిష్ట సమయంలో సమర్ధంగా వ్యవహరిస్తున్నారు అని మోడీ మెచ్చుకోవడం విశేషం. విపక్షాల విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవద్దని మీ పని మీరు చేసుకుంటూ పోవాలని మోడీ రామ్మోహన్ కి సూచించడం గమనార్హం.

భారీ మద్దతుగానే :

దేశాన్ని ఏలే ప్రధాని నుంచి కేంద్ర మంత్రికి ఈ స్థాయి మద్దతు దక్కడం అంటే నిజంగా గ్రేట్ అని అంటున్నారు. పైగా మీ పనితీరు బాగుంది అని ప్రశంసించడం కూడా గొప్పగా చూడాలని అంటున్నారు. ఇక చూస్తే రామ్మోహన్ విపక్షాలకు అటు లోక్ సభ ఇటు రాజ్యసభలోనూ వివరణ ఇవ్వడమే కాకుండా శాఖాపరంగా ధీటైన తీరులో చెప్పాల్సింది చెప్పారని అంటున్నారు. కేంద్ర తీసుకుంటున్న చర్యల గురించి ఆయన చక్కగా వివరిస్తూ మోడీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో వెనకేసుకుని వచ్చారు.

చాకచక్యంగా వ్యవహరిస్తూ :

ఇక వారం రోజుల నుంచి చూస్తే ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన వందలాది విమానాలు రద్దు కావడంతో అది పెద్ద సంక్షోభానికి దారి తీసింది. అంతే కాదు దేశవ్యాప్తంగా ప్రయాణికులు అధిక సంఖ్యలో ఈ సమస్యకు ప్రభావితం అయ్యారు. వారు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం ఉంది. దాంతో అందరి వేళ్ళూ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడునే చూపించాయి. అందరి నుంచి ఆయన తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ ఆయన చాకచక్యంగా వ్యవహరిస్తూ మొత్తానికి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. ఈ మొత్తం విషయాలను స్టడీ చేసిన మీదటనే మోడీ రామ్మోహన్ ని మెచ్చుకున్నారు అని అంటున్నారు. దాంతో ఈ యువ మంత్రికి మోడీ మరింతగా రానున్న కాలంలో ప్రాధాన్యత ఇవ్వడం ఖాయమని అంటున్నారు.