'గ్యాంగ్ లీడర్' వీడియో వైరల్... కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు డ్యాన్స్ పీక్స్!
మన రాజకీయ నాయకులకు, మన పాలకులకు చాలా హిడెన్ టాలెంట్స్ ఉంటాయి.
By: Raja Ch | 29 July 2025 5:29 PM ISTమన రాజకీయ నాయకులకు, మన పాలకులకు చాలా హిడెన్ టాలెంట్స్ ఉంటాయి. ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ వంటివి వచ్చినప్పుడు.. వారిలోని టాలెంట్ బయటకు వస్తుంటుంది! ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీల్లో ఒక్కొక్కరూ వారి వారి టాలెంట్ లు చూపించారు. ఈ సమయంలో తాజాగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు డాన్స్ తో దుమ్ములేపారు.
అవును... అటు ఎంపీగా, ఇటు బాధ్యతాయుతమైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నిత్యం బిజీగా ఉంటూ, కాస్త సీరియస్ లుక్ లో కనిపించినట్లుండే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు.. తనలోని హిడెన్ టాలెంట్ ను బయట ప్రపంచానికి చూపించారు. నిత్యం పాలనలో బిజీగా ఉండే ఆయన... ఎవరూ ఊహించని రీతిలో అన్నట్లుగా స్టేజ్ పై డ్యాన్స్ తో అదరగొట్టారు.
శ్రీకాకుళంలో తన బంధువుల వివాహానికి హాజరైన కేంద్ర మంత్రి.. వేదికపై ఉత్సాహంగా కాలు కదిపారు. ఈ క్రమంలో తొలుత కాస్త సిగ్గుపడినట్లు కనిపించిన రామ్మోహన్ నాయుడు.. ఆ తర్వాత వారితో కలిసి సరదాగా స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా... హీరో నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలోని పాటకు కాలు కదిపి, వేదికపై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
పైగా.. ఏదో పాట వస్తుంది, దానికి కాలు కదిపాము, చేతులు ఆడించాము, దాన్ని డ్యాన్స్ అనుకోవచ్చు అన్నట్లు కాకుండా.. ప్రొఫెషనల్ గా, చాలా ఈజ్ తో, ఫుల్ రిథమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నా యుడు వేసిన స్టెప్పులు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో... అన్నలో ఈ యాంగిల్ వేరే లెవెల్ అంటూ కార్యకర్తలు కామెంట్లు పెడుతున్నారు.
