Begin typing your search above and press return to search.

పీఓకే ని భారత్ టచ్ చేస్తుందా...పాక్ కి భారీ షాక్ ?

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఈ రోజున మండిపోతోంది. అక్కడ జనాలు రెండు నెలలుగా తీవ్రమైన స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నారు.

By:  Satya P   |   26 July 2026 9:00 PM IST
పీఓకే ని భారత్ టచ్ చేస్తుందా...పాక్ కి భారీ షాక్ ?
X

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఈ రోజున మండిపోతోంది. అక్కడ జనాలు రెండు నెలలుగా తీవ్రమైన స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నారు. అదే సమయంలో భారత్ లో విలీనం అవుతామని కూడా ప్రతిపాదిస్తున్నారు. అయితే వీటి మీద భారత్ స్పందించింది అయితే పెద్దగా లేదు. కానీ తాజాగా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పీఓకే ప్రస్తావన తెచ్చారు. పాకిస్థాన్‌తో భవిష్యత్తులో ఎలాంటి చర్చలైనా కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో విలీనం కావడం గురించి మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు పాక్ ప్రేరేపితమైన ఉగ్రవాదంపైనే చర్చలు ఉంటాయని కూడా తేల్చి చెప్పారు.

వైఖరి లో మార్పు లేదు :

ఇదే భారత్ యొక్క స్థిరమైన మార్పు లేని దౌత్య వైఖరిగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పీఓకే తిరిగి భారత్‌లో కలవడంపై మాత్రమే చర్చలు జరుగుతాయని రాజ్ నాథ్ సింగ్ అనడం పట్ల ఇపుడు అంతర్జాతీయంగా మరోసారి డిస్కషన్ మొదలైంది. పీవోకే ఇప్పటికే అన్ని విధాలుగా పాక్ తో పోరాడుతూ తెగ తెంచుకోవాలని చూస్తోంది. ఈ సమయంలో భారత్ నోట పీఓకే మాట రావడం అంటే ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు. ఇక పాకిస్తాన్ తన గడ్డపై నుంచి సాగిస్తున్న ఉగ్రవాదాన్ని అణచివేయడం పైనే భారత్ పాక్ తో సాగించే సంభాషణ ఉంటుందని కూడా కేంద్ర.ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

భారత్ లో అంతర్భాగం :

ఇక పీఓకే భారతదేశంలో అంతర్భాగమని కూడా రాజ్ నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. భారతదేశంలో అంతర్భాగమైన పీఓకే ప్రాంతాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుందని ఆయన విమర్శించారు. అందువల్ల దాని మీదనే తాము చర్చలలో పట్టుబడతామని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అంతే కాదు పాకిస్తాన్ చేసే ప్రతి దుస్సాహసానికి దాని ఊహకు అందని తీవ్రతతో ప్రతిస్పందించగల సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకు ఆపరేషన్ సింధూర్ విజయం ఒక ఉదాహరణ అన్నారు. పాకిస్తాన్‌లో సైన్యానికి మిలిటెంట్లకు మధ్య ఉన్న వ్యత్యాసం కనుమరుగైందని ఆయన విమర్శించారు. ఆ దేశం ఉగ్రవాదాన్ని తన ప్రభుత్వ విధానంలో ఒక భాగంగా మార్చుకుందని మండిపడ్డారు. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారితో కలిసి పనిచేస్తోంది అని ఆయన అన్నారు. అందుకే ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్రవాదులను, వారికి అండగా నిలిచే ప్రభుత్వాలను భారతదేశం ఇకపై వేర్వేరుగా చూడదని మేము స్పష్టం చేశామని ఆయన అన్నారు.

పీఓకే విలీనం ఖాయమా :

రాజ్ నాథ్ సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలతో పీఓకే భారత్ లో విలీనానికి రంగం సిద్ధం అవుతోందా అన్న కొత్త చర్చ వస్తోంది. పీఓకే కూడా ఇదే కోరుకుంటోంది, భారత్ కూడా అదే మాట అంటోంది. ఇక పాక్ విషయం తీసుకుంటే పీఓకే మీద చర్చలకు ఆ దేశం ఎపుడూ సుముఖంగా ఉండదని అంటున్నారు. దాంతో చాలా కాలంగా పీఓకే మీద మాట్లాడుతూ వస్తున్న భారత్ సరైన సమయం చూసి ఆ విషయంలో తన సత్తా చూపిస్తుందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఒక చూస్తే మరో మూడేళ్ళలో దేశంలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఎన్నికలకు ముందు కనుక పాక్ తో పీఓకే మీద సర్జికల్ స్ట్రైక్స్ ఉంటాయా అన్నది కూడా చర్చగా సాగుతోంది. పీఓకే మీద భారత్ పట్టుబట్టి రంగంలోకి దిగితే మాత్రం పాక్ కి ముచ్చెమటలు పట్టినట్లే అని అంటున్నారు. ఎందుకంటే పీఓకే గ్రౌండ్ లో నిలిచి యుద్ధం చేయాలనుకున్నా అక్కడ ఇపుడున్న వ్యతిరేక పరిస్థితుల వల్ల సాధ్యపడేలా కనిపించడం లేదని అంటున్నారు. ఏది ఏమైనా కేంద్రం పాక్ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అని అంటున్నారు.