Begin typing your search above and press return to search.

ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు.. బల్లులు, పాములతో లైవ్ డాన్స్.. ఎక్కడో తెలుసా?

అయితే ఇది వారి సంప్రదాయమే అయినా మూగజీవాలను హింసించడం కిందికే వస్తుంది. అయితే చాలామంది ఈ సంఘటనను ద్విగ్భాతికరమైనదిగా, కలత పెట్టేదిగా పేర్కొంటున్నారు.

By:  Madhu Reddy   |   5 Sept 2025 3:10 PM IST
ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు.. బల్లులు, పాములతో లైవ్ డాన్స్.. ఎక్కడో తెలుసా?
X

ఇండియా అంటేనే భిన్న సంప్రదాయాలు, వింత సంస్కృతులకు నిలయం.. ఇక్కడ దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కోసారి ఈ భక్తి ముసుగులో కొంతమంది ప్రమాదాలకు నెలవు అయ్యే ఆటలు కూడా ఆడతారు.ముఖ్యంగా జల్లికట్టు లాంటి సాంప్రదాయ ఆటల వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు మనం చూసాం. అలాంటి మరో సాంప్రదాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రతి ఏడాది తేజ్ దశమి రోజున 'గోగాజీ మేళా' నిర్వహిస్తారు. ఈ మేళాలో ప్రజలు అందరూ ఒక్క దగ్గర కలిసి నృత్యం చేస్తూ విష సర్పాలతో ఆటలాడుతారు. ముఖ్యంగా చాలామంది ప్రజలు పాములు, బల్లులు, రక్తపింజర లాంటి వాటిని పట్టుకొని నాట్యం ఆడుతారు.

అయితే ఇది వారి సంప్రదాయమే అయినా మూగజీవాలను హింసించడం కిందికే వస్తుంది. అయితే చాలామంది ఈ సంఘటనను ద్విగ్భాతికరమైనదిగా, కలత పెట్టేదిగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ లో జరిగే ఈ గోగాజీ మేళాలో పాములు, బల్లులను మెడలో వేసుకొని గాల్లో ఎగరవేస్తూ డాన్స్ చేయడం వారి ఆచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జంతు ప్రేమికులకు కోపం తెప్పిస్తోంది. ఈ ఆచారంపై దేశవ్యాప్తంగా నెటిజన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వీడియో చూసిన చాలామంది విషపూరిత జీవులను ఈ విధంగా చేయడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. వినోదం కోసం ఇలా ప్రాణాలు పణంగా పెట్టడం మంచి పద్ధతి కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.

అలాగే జంతు ప్రేమికులు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది అమానవీయమైనది.. జంతువులు వాటి ఇష్టపూర్వకంగా ఈ వేడుకలో పాల్గొనలేదు. బలవంతంగా వారు తీసుకువచ్చి ఇందులో వాటిని హింసిస్తున్నారు అంటూ మాట్లాడుకువస్తున్నారు. యువకులు ఆ పాములను గాల్లోకి ఎగరవేస్తూ మళ్ళీ పట్టుకోవడం మెడలో వేసుకొని అటు ఇటు తిప్పడం వల్ల అవి మరణించే అవకాశం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా ఈ వీడియో ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది.

దీన్ని చూసి ఇదేం సాంప్రదాయం, అసలు విష సర్పాలను పట్టుకోడానికే భయపడతారు అలాంటిది మెడలో వేసుకొని డాన్సులు చేయడం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి విషసర్పాల భద్రత అలాగే, అందులో పాల్గొన్న వారి భద్రతను చూడాలి కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.