Begin typing your search above and press return to search.

బుల్డోజర్ న్యాయం.. మైనర్ బాలిక అత్యాచార ఇష్యూలో 3 హోటళ్ల కూల్చివేత!

విన్నంతనే ఉలిక్కిపడే షాకింగ్ ఉదంతం ఒకటి రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఇంతటి అరాచకమా? ఇలా కూడా చేస్తారా? అన్న సందేహానికి గురయ్యేలా ఉన్న ఈ వైనం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

By:  Garuda Media   |   2 July 2026 12:39 PM IST
బుల్డోజర్ న్యాయం.. మైనర్ బాలిక అత్యాచార ఇష్యూలో 3 హోటళ్ల కూల్చివేత!
X

విన్నంతనే ఉలిక్కిపడే షాకింగ్ ఉదంతం ఒకటి రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఇంతటి అరాచకమా? ఇలా కూడా చేస్తారా? అన్న సందేహానికి గురయ్యేలా ఉన్న ఈ వైనం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఒక రిక్షావాడు.. ఆమెను ఒక హోటల్ కు అమ్మేయటం.. ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ.. సదరు బాలికకు బలవంతంగా మత్తుమందు ఇవ్వటం ద్వారా వరుస పెట్టి పలువురు హోటల్ యజమానులు అత్యాచారానికి పాల్పడిన వైనం అనూహ్య రీతిలో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మూడు హోటళ్లను బుల్డోజర్ల కూల్చివేశారు. ఇప్పటికి పలువురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ అమానుష ఉదంతం లోతుల్లోకి వెళితే..

రాజస్థాన్ రాష్ట్ర ఉత్తర సరిహద్దులో చివరన ఉన్న ప్రముఖ జిల్లా శ్రీగంగానగర్. ఆ రాష్ట్ర రాజధాని జైపూర్ కు 450కి.మీ. దూరంలో ఉండే ఈ జిల్లాలోనే ఈ దారుణ ఉదంతం చోటు చేసుకుంది. ఈ జిల్లా ప్రత్యేకత ఏమంటే.. భారత్ - పాక్ అంతర్జాతీయ సరిహద్దుకు చాలా సమీపంలో ఉండటమే కాదు.. ఈ జిల్లాకు ఉత్తర.. తూర్పు సరిహద్దుల్లో పంజాబ్ రాష్ట్రం.. దక్షిణాన రాజస్థాన్ కు చెరందిన బికనీర్.. హనుమాన్ గఢ్ జిల్లాలు ఉంటాయి.ఒకప్పుడు ఏడారి ప్రాంతంగా ఉన్న ఈ జిల్లా ఇప్పుడు ఆ రాష్ట్ర ఫుడ్ బాస్కెట్ అన్న పేరు వచ్చింది. దీనికి కారణంగా సట్లెజ్ నది నుంచి గంగ్ కాలువ ద్వారా నీటిని మళ్లించటంతో ఈ జిల్లా రూపురేఖలు మారిపోయాయి. జూన్ 18న జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన పదమూడేళ్ల మైనర్ బాలిక తన స్నేహితురాలిని కలిసేందుకు బయటకు వచ్చి కనిపించకుండా పోయింది. రిక్షా కార్మికుడు ఒకడు బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆ బాలికను స్థానికంగా ఉన్న హోటల్ యజమానికి అమ్మేశాడు.

ఈ అరాచకం అక్కడితే ఆగలేదు. ఆ మాటకు వస్తే.. ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో ఆ బాలికకు ఈ దుర్మార్గులు చూపించారు. వాట్సప్ లో ప్రత్యేక గ్రూప్ తయారు చేసి.. కోడ్ లాంగ్వేజ్ లో ఆ బాలికపై ఐదు రోజుల పాటు.. రోజుకు ఐదుగురు నుంచి ఆరుగురు చొప్పున దాదాపు 30 మంది అత్యాచారానికి పాల్పడినట్లుగా సమాచారం. నొప్పితో విలవిలాడే ఆ చిన్నారి కేకలు వేయకుండా ఉండేందుకు ఆమెకు బలవంతంగా మత్తు మందు ఇవ్వటం గమనార్హం. బాలిక కనిపించకపోవటంతో ఆందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ నెల 23న ఒక హోటల్ నుంచి బాలికను సురక్షితంగా రెస్క్యూ చేశారు. బాలిక స్టేట్ మెంట్ ఆధారంగా భయానక గ్యాంగ్ రే*ప్ ఉదంతం గురించి వివరాలు సేకరించారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారిలో అత్యధికులు హోటల్ యజమానులుగా తేల్చారు. నిందితులపై పోక్సో కేసులు నమోదు చేశారు. ఇప్పటికి ఈ దారుణ ఉదంతానికి కారణమైన 14 మందికి పైనే నిందితుల్ని అరెస్టు చేశారు.

మిగిలిన వారి కోసం తీవ్రంగా గాలింపులు జరుపుతున్నారు. ఈ అమానుష ఉదంతంపై స్థానికంగానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీధుల్లోకి వచ్చి బాధితురాలికి మద్దతుగా నిరసనలు.. భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో.. ఈ ఉదంతంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భావించింది. ఇందులో భాగంగా సదరు హోటళ్ల యజమానులకు సంబంధించిన హోటళ్లను బుల్జోజర్లతో కూల్చివేశారు. ఇప్పటికి మూడు హోటళ్లను నేలమట్టం చేశారు. మిగిలిన వాటిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసు వర్గాలు వ్యవహరిస్తున్నాయి. దారుణ నేరాలకు అడ్డాగా నిలిచిన ఈ హోఠల్లు అక్రమంగా.. నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్లుగా గుర్తించారు. మొత్తంగా బుల్డోజ్ న్యాయంతో ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహా జ్వాలల్నితక్షణమే తగ్గించేందుకు వీలుగా తాజా చర్యలు ఉన్నట్లుగా చెప్పాలి. మరోవైపు బాధితురాలికి వైద్యసాయం.. సైకలాజికల్ కౌన్సెలింగ్ అందిస్తున్నారు.