Begin typing your search above and press return to search.

ఐబొమ్మ రవి అరెస్టును తనదైన శైలిలో అభివర్ణించిన రాజమౌళి!

ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు హైదరాబాద్ సిటీ పోలీసు కమీషనర్ సజ్జనార్ తో భేటీ అయ్యారు.

By:  Raja Ch   |   17 Nov 2025 6:34 PM IST
ఐబొమ్మ రవి అరెస్టును  తనదైన శైలిలో అభివర్ణించిన రాజమౌళి!
X

ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు హైదరాబాద్ సిటీ పోలీసు కమీషనర్ సజ్జనార్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం సజ్జనార్ తో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్పందించిన రాజమౌళి తనదైన శైలిలో ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ పై స్పందించారు.

అవును... ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ వ్యవహారం అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు బయటా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అతడు పోలీసులను ఛాలెంజ్ చేయడం.. అది జరిగిన రెండు నెలల తర్వాత అతడిని పోలీసులు అరెస్ట్ చేయడం.. రూ.3 కోట్లు జప్తు చేయడం.. అతడి హార్డ్ డిస్క్ లో 21 వేల సినిమాలు ఉన్నాయనే విషయం బయటకు రావడం సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా స్పందించిన దర్శకుడు రాజమౌళి... సీపీ సజ్జనార్, సీవీ ఆనంద్, హైదరాబాద్, తెలంగాణ పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అనంతరం... ఇది సినిమాలో సూపర్ హిట్ స న్నివేశంలా ఉందని.. విలన్ ఛాలెంజ్ చేస్తే, రెండు నెలల తర్వాత హీరో అతడిని కటకటాల వెనక వేసినట్లు ఉందని అన్నారు.

ఇదే సమయంలో.. భస్మాసురుడి హస్తంలా తన తలమీద తనే చేయిపెట్టుకున్నాడని చెప్పిన రాజమౌళి.. పోలీసులతో ఆటలొద్దని అన్నారు. ఈ సందర్భంగా... ఏదీ ఉచితంగా రాదని, ఒక వేళ అలా వస్తే దాని ఎనుక పెద్ద ప్రమాదమే పొంచి ఉంటుందని.. అది చావు వరకూ తీసుకెళ్తుందని.. సినిమాలేగా ఏముంది లే ఫ్రీగా చూస్తున్నామని అంతా అనుకుంటున్నారని రాజమౌళి వ్యాఖ్యానించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... వైరసీ చేసే వాళ్లు ఏమీ సంఘసేవ చేయడం లేదని.. పెద్ద పెద్ద సర్వర్లు ఉపయోగించి పైరసీ చేస్తున్నారని చెప్పిన రాజమౌళి.. దీనికి అంత డబ్బు తాము వాళ్లకు ఇవ్వడం లేదని.. మా సినిమాలూ పైరసీ చేసి వాళ్లు సంపాదిస్తున్నారని.. అంటే వారికి మీరే ఇస్తున్నారని.. మీ వ్యక్తిగత డేటాను అమ్మడం వల్ల ఇస్తున్నారని అన్నారు.

ఇదే క్రమంలో పర్సనల్ డేటా అంటే చాలా మందికి తెలియకపోవచ్చని చెప్పిన రాజమౌళి... మీ పేరు, ఫోన్ నంబర్, ఆధార్, ఈ-మెయిల్ ఉంటే చాలు మీరు సైబర్ బారిన పడతారని.. ఈ డేటాను క్రిమినల్స్ కు అమ్ముతున్నరని.. మీరు ఫోన్ నంబరే కదా అని ఎంటర్ చేస్తే.. దాని వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని.. డబ్బే కాదు, ప్రాణాలు పోయే వరకూ వెళ్తోందని తెలిపారు.

ఈ పైరసీల వల్ల సినిమా ఇండస్ట్రీ కంటే ఎక్కువగా ప్రజలే నష్టపోతున్నరని.. ఈ విషయం అర్ధం చేసుకోవాలని.. ఇలాంటి పైరసీ వెబ్ సైట్లలో ఉచితంగా సినిమాలు చూసి ఇబ్బందుల్లో పడకండని రాజమౌళి సూచించారు.