Begin typing your search above and press return to search.

బిజినెస్ లెక్కలు.. జక్కన్న ఫోకస్ అక్కడే ఎందుకు?

పాన్ ఇండియా సినిమా అంటే ఇప్పుడు మొదట గుర్తొచ్చే పేరు రాజమౌళిదే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఆయన మార్కెట్ పాన్ ఇండియా రేంజ్ కు పెరిగింది.

By:  M Prashanth   |   15 July 2026 3:33 PM IST
బిజినెస్ లెక్కలు.. జక్కన్న ఫోకస్ అక్కడే ఎందుకు?
X

పాన్ ఇండియా సినిమా అంటే ఇప్పుడు మొదట గుర్తొచ్చే పేరు రాజమౌళిదే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఆయన మార్కెట్ పాన్ ఇండియా రేంజ్ కు పెరిగింది. హిందీ బెల్ట్ నుంచి ఓవర్సీస్ మార్కెట్ల వరకు ఆయన సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే జక్కన్నకు ఇంత పెద్ద మార్కెట్ ఉన్నప్పటికీ, రాజమౌళి సినిమాల బిజినెస్ లో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకకు ఇప్పటికీ ప్రత్యేక ప్రాధాన్యత కనిపిస్తోందనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

దీనికి ప్రధాన కారణం ఆ మూడు ప్రాంతాలే రాజమౌళి సినిమాల అసలు బలమైన మార్కెట్లు కావడమే. తెలుగు ప్రేక్షకులతో పాటు కర్ణాటకలో కూడా ఆయన సినిమాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. బాహుబలి సిరీస్‌ కు కర్ణాటకలో వచ్చిన వసూళ్లు, ఆర్ఆర్ఆర్ కు దక్కిన రెస్పాన్స్ దీనికి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెబుతుంటారు. అందుకే ఆ ప్రాంతాల్లో విడుదల, థియేటర్ల అడ్జెస్ట్మెంట్, అడ్వాన్స్ బుకింగ్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలను అత్యంత కీలకంగా భావిస్తారనే అభిప్రాయం ఉంది.

హిందీ మార్కెట్ పెద్దదే అయినా, అక్కడి వసూళ్లు ఎక్కువగా కంటెంట్, ప్రచారం, విడుదల సమయంపై ఆధారపడతాయి. కానీ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో మాత్రం స్టార్ పవర్‌ తో పాటు దర్శకుడిగా రాజమౌళి బ్రాండ్‌ కే స్పెషల్ మార్కెట్ ఉంది. సినిమా ఎలా ఉన్నా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చే స్థాయి ఫ్యాన్ బేస్ ఆ ఏరియాల్లో ఉంది. ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే, రాజమౌళి సినిమాల రికార్డు స్థాయి కలెక్షన్లకు ఫౌండేషన్ ఎక్కువగా ఆ మూడు మార్కెట్ల నుంచే పడుతుంది.

తొలి వారం వసూళ్లు, థియేటర్ల ఆక్యుపెన్సీ, ఎక్స్ ట్రా షోలు వంటి అంశాల్లో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక కీలక పాత్ర పోషిస్తాయి. తర్వాత ఆ ప్రభావం నేషనల్ వైడ్ గా కనిపిస్తుంది. అందుకే ఆ ప్రాంతాల బిజినెస్ విషయంలో రాజమౌళి టీమ్ ఎప్పుడూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది.. కేవలం ఎక్కువ మొత్తం ఆఫర్ చేసిన వారికంటే, స్థానిక మార్కెట్‌ పై అవగాహన ఉన్నవారు, థియేటర్ నెట్‌ వర్క్ గట్టిగా ఉన్నవారు, గతంలో పెద్ద సినిమాలను విజయవంతంగా నిర్వహించినవారికే ఇంపార్టెన్స్ దక్కుతుందనే అభిప్రాయం ఉంది.

పాన్ ఇండియా ఇమేజ్ పెరిగినా, రాజమౌళి సినిమాల హార్ట్‌ ల్యాండ్ మాత్రం ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకే అని చెప్పవచ్చు. అందుకే ఆ మూడు మార్కెట్లపై ఆయన ప్రత్యేక ఫోకస్ పెట్టడం వెనుక కేవలం బిజినెస్ లెక్కలు మాత్రమే కాదు, తన స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ను మరింత బలోపేతం చేయాలనే వ్యూహం కూడా ఉండొచ్చని సినీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉన్నా, ప్రతి పెద్ద బ్రాండ్‌ కు ఒక స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. రాజమౌళి విషయంలో ఆ బేస్ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక. అందుకే ఆ మూడు మార్కెట్లకు ఆయన సినిమాల బిజినెస్‌లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటోందనే చర్చ ఇప్పుడు మరింత బలపడుతోంది.