వైసీపీ మాజీ ఎంపీకి బిగుస్తున్న ఉచ్చు.. ఏం జరిగింది ..!
వైసీపీ మాజీ ఎంపీ.. తరచుగా మీడియా ముందుకు వచ్చి కూటమి సర్కారుపై సెటైర్లు పేల్చే భరత్ రామ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
By: Garuda Media | 14 Nov 2025 10:00 PM ISTవైసీపీ మాజీ ఎంపీ.. తరచుగా మీడియా ముందుకు వచ్చి కూటమి సర్కారుపై సెటైర్లు పేల్చే భరత్ రామ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. గత 2019 ఎన్నికల్లో రాజమండ్రి ని యోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఆయన.. 2024 ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యా రు. ఆ తర్వాత నుంచి కూటమిపై విమర్శలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. తాజాగా భరత్ అనుచరుడు ఒకరు మీడియా ముందుకు వచ్చారు.
గతంలో భరత్ చేసిన చీకటి దందాకు తానే సాక్ష్యం అని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. దీని పై కూటమి నేతలు నిశితంగా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా.. భరత్ ప్రధాన అనుచరుడు పీతా రామకృష్ణ వద్ద పనిచేసిన రామశర్మ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు.
అప్పటి ఎంపీ భరత్ చీకటి దందాలకు తానే సాక్ష్యమని.. అన్నీ తనకు తెలుసునని శర్మ వ్యాఖ్యానించాడు . అంతేకాదు.. అందుకే తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదేసమయంలో కొన్ని కీలక విషయాలు కూడా చెప్పుకొచ్చారు. భరత్ కోసం నేను చాలా చేశాను. టీడీపీ నాయకుడు యిన్నమూరి దీపును బెదిరించి వైసీపీలోకి వచ్చేలా చేశాం. ఏపీ పేపర్ మిల్లు యూనియన్ నేత చిట్టూరి ప్రవీణ్ చౌదరిని వైసీపీలోకి లాగేశాం. రెడ్ గ్రావెల్ మైనింగ్, ఇసుక ర్యాంప్, బుర్రిలంక ఇసుక ర్యాంప్‌నకు సంబంధించి నెలవారీ మామూళ్లు 5 కోట్ల వరకు వసూలు చేశామని కూడా వెల్లడించాడు.
అంతేకాదు.. పార్టీ కోసం కూడా తాను ఎంతో ఖర్చు చేసినట్టు శర్మ చెప్పుకొచ్చాడు. ఈ పరిణామాలతో.. భరత్ వ్యవహారం బయటకు వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇప్పటి వరకు భరత్‌పై పెద్దగా ఎలాంటి ఆరోపణలు లేకపోవడం గమనార్హం. కానీ, ఆయన దగ్గర పనిచేసిన అనుచరుడే ఇప్పుడు బయటకు వచ్చి సంచలన ఆరోపణలు చేయడం.. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా తనవద్ద ఉన్నాయని చెప్పడం తో సహజంగానే భరత్ ఇప్పుడు టార్గెట్ అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
