సీరియస్ కార్యక్రమంలో చిలిపి చేష్టలు: రాహుల్ పై ట్రోల్స్
సీరియస్‌గా ఓ కార్యక్రమాన్ని భుజాలపై వేసుకున్నప్పుడు.. అంతే సీరియస్‌గా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
By: Garuda Media | 28 Aug 2025 7:00 AM ISTసీరియస్‌గా ఓ కార్యక్రమాన్ని భుజాలపై వేసుకున్నప్పుడు.. అంతే సీరియస్‌గా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి. లేకపోతే..నవ్వుల పాలు కావడం ఖాయం. మరి ఈ విషయం తెలుసో.. తెలియదో కానీ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో విప క్ష నాయకుడు రాహుల్ గాంధీ సీరియస్‌గా తీసుకున్న కార్యక్రమంలో చిలిపి చేష్టలకు దిగారు. దీంతో ఇప్పటి వరకు తలపెట్టిన కార్యక్రమం తాలూకు సీరియస్ నెస్ తగ్గిపోవడంతో పాటు.. సదరు కార్యక్రమంపై రాజకీయంగా.. రాహుల్‌పై వ్యక్తిగతంగా కూడా ట్రోల్స్ వస్తున్నాయి.
ఏం జరిగింది?
బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్ల జాబితా ఇంటెన్సి వ్ రివిజన్ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం 65 లక్షలకు పైగాఓటర్లను జాబితాల నుంచి తొలగించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన రాహుల్‌గాంధీ.. ఎన్నికల సంఘం, బీజేపీతో కలిసి కుమ్మక్కయించిందని.. ప్రజల ఓటు హక్కును ప్రజాస్వామ్య హక్కును కూడా హరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో దేశ వ్యాప్త ఉద్యమానికి కూడా ఆయన నాంది పలికారు. ఈ పరంపరలోనే `ఓట్ అధికార యాత్ర` పేరుతో 1300 కిలో మీటర్ల మేర.. యాత్ర చేపట్టారు.
ఈ నెల 29వ తేదీ వరకు ఈ యాత్ర సాగనుంది. మొత్తం 22 జిల్లాల మీదుగా సాగే యాత్రకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా కవరేజీ ఇచ్చేలా చేసుకున్నారు. ఇంత సీరియస్ ఇష్యూను తలపెట్టిన రాహుల్ అంతే సీరియస్‌గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. తొలి రెండు రోజులు అలానే సీరియస్‌గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. కానీ, తర్వాత తర్వాత.. సీరియస్ నెస్ తగ్గిపోయింది. ఏదో ఒక వ్యాహ్యాళికి వచ్చినట్టుగా యాత్రను నిర్వహిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.
అంతేకాదు.. ఈ యాత్రలో తన వ్యక్తిగత విషయాలు, పెళ్లి గురించిన ప్రస్తావన వంటివి తీసుకురావడం ద్వారా ఓట్ చోరీ అంశంపై ప్రభావం తగ్గిపోయిందని జాతీయ విశ్లేషకులుచెబుతున్నారు. ఇక, తాజాగా బుధవారం తన సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ ని బైక్‌పై ఎక్కించుకుని చాలా సరదాగా తుళ్లూతూ.. నవ్వుతూ.. రాహుల్ గాంధీ బైక్ యాత్ర చేపట్టారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేసిస బీజేపీ.. రాహుల్ చేపట్టింది ఓట్ చోరీ యాత్ర కాదు.. వ్యాహ్యాళి యాత్ర.. అంటూ వ్యాఖ్యలుచేసింది. ఇక, నెటిజన్లు కూడా.. రాహుల్ వైఖరిని తప్పుబట్టారు. మొత్తానికి సీరియస్‌గా ప్రారంభించిన యాత్ర.. ఇప్పుడు సరదా స్థాయికి మారడంపై విమర్శలు వస్తుండడం గమనించాల్సిన అవసరం ఉంది.
