Begin typing your search above and press return to search.

మెస్సీ తో రాహుల్ గాంధీ స్పానిష్ లో మాట్లాడాడా?

అందరికీ అన్ని భాషలు రావాలన్న రూల్ లేదు. ఎంతో మంది పూటకు లేని స్థాయి నుంచి దేశ ప్రధానులు, దిగ్గజ క్రీడాకారులుగా ఎదిగారు. భాష అనేది సమస్య కాదని.. తన భావజాలం, పోరాట పటిమ, పట్టుదల ముఖ్యమని చాటిచెప్పారు.

By:  A.N.Kumar   |   14 Dec 2025 12:52 PM IST
మెస్సీ తో రాహుల్ గాంధీ స్పానిష్ లో మాట్లాడాడా?
X

అందరికీ అన్ని భాషలు రావాలన్న రూల్ లేదు. ఎంతో మంది పూటకు లేని స్థాయి నుంచి దేశ ప్రధానులు, దిగ్గజ క్రీడాకారులుగా ఎదిగారు. భాష అనేది సమస్య కాదని.. తన భావజాలం, పోరాట పటిమ, పట్టుదల ముఖ్యమని చాటిచెప్పారు. ఎక్కడో మారుమూల సౌత్ అమెరికా దేశం అర్జెంటీనా నుంచి అంతర్జాతీయ క్రీడాకారుడిగా అష్టకష్టాలు పడి ఎదిగిన లియోనెల్ మెస్సీ కూడా అంతే. అతడి జీవితంలో ఎన్నో కష్టాలు అధిగమించి ఈ స్థాయికి చేరాడు. అతడికి ఇంగ్లీష్ రాదన్న విషయం అందరికి తెలిసిందే. తన మాతృభాష స్పానిష్ లోనే ఎప్పుడు మాట్లాడతాడు. ట్రాన్స్ లేటర్ ఆయన మాటలను తర్జుమా చేస్తారు . అందుకే రాహుల్ గాంధీ సైతం తనకు వచ్చిన స్పానిష్ లోనే మెస్సీతో మాట్లాడినట్టుగా ఒక వీడియో వైరల్ అవుతోంది.

ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన సందర్భంగా రాజకీయ సామాజిక వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యంగా ‘మెస్సీ’తో రాహుల్ గాంధీ స్పానిష్ లో మాట్లాడాడా?’ అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.

మెస్సీకి ఇంగ్లీష్ రాదా?

మెస్సీకి ఇంగ్లీష్ పెద్దగా రాదన్న విషయం ప్రపంచమంతటికీ తెలిసిందే.. తన కెరీర్ మొత్తం స్పెయిన్ , అర్జెంటీనాలో గడిపిన మెస్సీకి స్పానిష్ మాతృభాష. ఇంగ్లీష్ లో అతడు సాధారణ సంభాషణలకే పరిమితమవుతాడని అంతర్జాతీయ మీడియా కూడా పలుమార్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో అతడు మాట్లాడాడంటే ఏ భాషలో మాట్లాడారు అన్నది ఆసక్తిగా మారింది.

రాహుల్ గాంధీకి స్పానిష్ వచ్చు అంటున్న నెటిజన్లు

ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఆయన విదేశాల్లో చదువుకున్నారు. ఇంగ్లీష్ తోపాటు ఇతర భాషలపై కూడా ఆయనకు అవగాహన ఉందని గతంలో పలుమార్లు చర్చకు వచ్చింది. అందుకే కొంతమంది అభిమానులు, నెటిజన్లు ఆయనకు స్పానిష్ వచ్చి ఉండొచ్చు అని ఊహాగానాలు చేస్తున్నారు. ‘రాహుల్ కు స్పానిష్ వచ్చు కావచ్చు. మెస్సీతో మాట్లాడితే ఖచ్చితంగా స్పానిష్ లోనే మాట్లాడి ఉంటారు’ అనే వాదనలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.

నిజమెంత?

ఈ వాదనలు ఆసక్తికరంగా ఉన్నా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకూ రాహుల్ గాంధీ స్పానిష్ లో మెస్సీతో మాట్లాడాడని అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు. ఆ భేటిలో అనువాదకుడు కూడా లేడు. సో చిన్నపాటి ఇంగ్లీష్ స్పానిష్ మిశ్రమ సంభాషణ జరిగి ఉండొచ్చు అని అంటున్నారు. అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక వీడియో లేదా స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు.

రాజకీయ కోణంలో సోషల్ మీడియా రచ్చ

సోషల్ మీడియా మాత్రం ఈ అంశాన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళుతుంది. కొందరు రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ.. ‘గ్లోబల్ లీడర్ లా ప్రవర్తించారు’ అంటుంటే.. మరికొందరు మాత్రం ఇది కేవలం హైప్ మాత్రమే అంటూ విమర్శిస్తున్నారు.

మెస్సీకి ఇంగ్లీష్ రాదు.. రాహుల్ కు స్పానిష్ వచ్చు అన్న వాదన ఆసక్తికరంగానే ఉన్నా.. ఇప్పటికీ ఇది నిజం కంటే ఊహాగానామే ఎక్కువ అని చెప్పాలి. అధికారికంగా రుజువు అయ్యే వరకూ ఇది సోషల్ మీడియా చర్చగానే మిగిలే అవకాశం ఉంది. ఇలాంటి అంశాలు రాజకీయాలు, సెలబ్రిటీలు కలిసినప్పుడు ప్రజల్లో మరింత ఉత్సుకతను రేపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.