రాహుల్ మార్క్ మార్చ్...లక్షల మంది వస్తున్నారా ?
ఇక మరో వైపు రామ్ లీలా మైదానం పరిసరాలలో దీపావళి పండుగ సందర్భంగా పది వేల కోట్ల దాకా వ్యాపారం జరుగుతుందని అంటున్నారు.
By: Satya P | 30 Oct 2026 1:00 AM ISTతగ్గేది లేదంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. నవంబర్ 1న రామ్ లీలా మైదానం దాకా మార్చ్ చేయాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. ఇది రాజకీయ యాత్ర కాదు దేశం యాత్ర అంటున్నారు. బీజేపీతో విసిగిన జనాలు అంతా ఢిల్లీకి రావాలని మార్చ్ లో పాల్గొనాలని రాహుల్ పిలుపు ఇచ్చారు. ఓట్ల చోరీ సాగుతోంది అని అందుకే రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకే ఈ మార్చ్ అని రాహుల్ చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీలో మార్చ్ జరిగి తీరుతుందని ఆయన అంటున్నారు.
ప్రజాస్వామ్యం కోసం :
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ యాత్ర అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ర్యాలీ కాదని ఆయన అంటున్నారు. నరేంద్ర మోడీ అమిత్ షా విధాలతో విసిగిన ప్రజలందరికీ ఈ మార్చ్ లో పాల్గొనేందుకు ఆహ్వానం అని ఆయన చెబుతున్నారు. మాతో కలసి రండి పోరాడుదామని కోరుతున్నారు. లాఠీ దెబ్బలకు అసలు భయపడవద్దు అని సూచిస్తున్నారు. ఇది మీ సమస్య మన సమస్య మీ యాత్ర అని కూడా రాహుల్ స్పష్టం చేస్తున్నారు.
పది లక్షల మంది :
ఇదిలా ఉంటే ఢిల్లీలో నవంబర్ 1న జరప తలపెట్టిన మార్చ్ కి పది లక్షల మంది వస్తారని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి అంచనా వేస్తోంది. ఇక రాహుల్ గాంధీ అయితే ఇది అత్యంత ప్రతిష్టగా తీసుకున్నారు. బీజేపీ మీద ఓట్ల చోరీ మీద కేంద్ర ఎన్నికల సంఘం మీద ఆయన జరుపుతున్న మలి విడత పోరాటంలో ఇది కీలకమైనదిగా చెబుతున్నారు. తొలి విడతగా అక్టోబర్ మొదటి వారంలో వరుసగా మూడు రోజుల పాటు ఆందోళనలు చేశారు. సుప్రీం కోర్టు దాకా ర్యాలీ తీశారు. ఈసారి రామ్ లీలా మైదానం దాకా ఈ మార్చ్ అని అంటున్నారు.
వద్దని చెప్పినా :
ఇక మరో వైపు రామ్ లీలా మైదానం పరిసరాలలో దీపావళి పండుగ సందర్భంగా పది వేల కోట్ల దాకా వ్యాపారం జరుగుతుందని అంటున్నారు. దాంతో ఈ పండుగ వేళలో ర్యాలీలు ఆందోళనలు వద్దు అని స్థానిక వ్యాపార వర్గాలు కాంగ్రెస్ ని కోరుతున్నాయి. అయితే రాహుల్ మాత్రం తగ్గేది లేదని అంటున్నారు. వ్యాపారుల సమస్యలను అర్ధం చేసుకున్నామని కానీ అంతకంటే పెద్ద సమస్యగా ఓట్ల చోరీ అనంది ఉందని అన్నారు. ఇది పిల్లల భవిష్యత్తు దేశ భవిష్యత్తు అని చెబుతున్నారు.
రాజధానిలో లాక్ డౌన్ :
నిజానికి దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది అని ఆయన ఆరోపించారు. ఇప్పటికే మెట్రో రైళ్ళను మూసేసింది అని రోడ్లను అన్ని చోట్లా మూసేశారు అని ఆయన విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు సాధారణం కావాలని అంటే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చేత కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయిస్తే చాలు తాము ఆందోళన విరమిస్తామని రాహుల్ స్పష్టం చేస్తున్నారు.
సక్సెస్ అవుతుందా :
అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద నిరసనలు అంటూ సీజేపీ ఇచ్చిన పిలుపుని విజయవంతంగా భగ్నం చేశారు. అయితే అది సీజేపీ ఉద్యమం. ఇపుడు కాంగ్రెస్ సహా అన్ని కీలక పార్టీలు మార్చ్ లో పాల్గొనబోతున్నాయి. మరి ఈ మార్చ్ ని ఏ విధంగా అడ్డుకుంటారు అన్నది చర్చ గా ఉంది. అయితే ఢిల్లీలోకి జనాలు ఇతర ప్రాంతాలకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. దాంతో పది లక్షల మందితో జరప తలపెట్టాలనుకున్న రాహుల్ మార్క్ మార్చ్ ఎంత మందితో సాగుతుంది అన్నది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. రాహుల్ మాత్రం ప్రెస్టేజ్ గానే దీనిని తీసుకున్నారు అని అంటున్నారు.
