రాహుల్ ది రణఘోష.. కంఠశోష.. లైట్ తీసుకున్న ఈసీ!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ.. ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతోందని పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు.
By: Garuda Media | 8 Aug 2025 3:22 PM ISTకాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ.. ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతోందని పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం(ఈసీ)-బీజేపీతో ములాఖత్ అయి.. అనుకూలంగా వ్యవహరి స్తోందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం చేస్తున్న దురాగతాలపైనా.. ఎన్నికల వ్యవహారంలో చేస్తున్న అక్రమాలపైనా అణుబాంబును పేలుస్తానని రాహుల్ పదే పదే చెబుతున్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా.. ఎన్నికల సంఘం మహారాష్ట్ర సహా.. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వ్యవహరించిన తీరును ఆయన బయట పెట్టారు.
అయితే.. ఈసీపై రాహుల్‌గాంధీ రణఘోష చేస్తున్నా.. ఆయనకు మిగులుతున్నది కంఠశోషేనని పరిశీల కులు చెబుతున్నారు. ఎందుకంటే.. రాహుల్ గాంధీ.. ఏం చెప్పినా ఈసీ కనీసం పరిశీలన కూడా చేయ డం లేదని.. కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ రాహుల్ తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవాల పేరుతో కొన్ని పద్దులను ప్రజల ముందు పెడుతున్నారు. ఇలా.. రాహుల్ తాజాగా ప్రకటించిన... ఎన్నికల జాబితా సహా.. ఇతర అంశాలను పరిశీలిస్తే.. దారుణమైన నిజాలేనని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
+ ఒక్క నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు చేర్చారు. ఒక్క బెంగుళూరు సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గంలో 1,00,250 దొంగ ఓట్లు ఉన్నాయి. వీటిని సాక్షాధారాలతో రాహుల్ సమగ్రంగా వివరించారు.
+ ఓటర్ లిస్టుల్లో ఓటర్ కార్డు ఐడీతో ఒకే వ్యక్తికి లక్షా 250 ఓట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
+ ఇక, పలు రాష్ట్రాల్లో ఒకే పేరుతో చేర్చిన దొంగ ఓట్లు 11,965
+ నకిలీ అడ్రస్సులతో మరో 40,009 ఓట్లు చేర్చారు.
+ ఒకే అడ్రసుతో 10,452 ఓట్లు ఉన్నాయని రాహుల్ వివరించారు. వాటివివరాలను ఎన్నికల సంఘం సైట్‌లోని సమాచారం ద్వారానే వివరించారు.
+ అనర్హులైన ఫోటోల ద్వారా 4,132 ఓట్లు ఇచ్చారు. ఫామ్ 6 ద్వారా 33,000 ఓట్లు ఇచ్చారని ఆయన తెలిపారు.
+ ఓటింగ్ సీసీ ఫుటేజ్ లను 45 రోజుల్లో ద్వాంసం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందని రాహుల్ నిలదీశారు.
+ దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని రాహుల్ డిమాండ్ చేశారు.
