రాహుల్ గౌరవంగా తప్పుకోవడమే మంచిదా!?
ఈ పరిణామాలు.. పార్టీలో తీవ్ర అసంతృప్తికి, వ్యతిరేక ధోరణికి కూడా దారితీస్తున్నాయి. రాహుల్‌పై గత కొన్నాళ్లుగా సీనియర్లు అసంతృప్తితోనే ఉన్నారు.
By: Garuda Media | 4 April 2026 9:00 PM ISTకాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష సభ్యుడు రాహుల్‌గాంధీ.. గౌరవంగా పార్టీ పదవుల నుంచి తప్పు కోవడమే మంచిదా? ఆయన మౌనంగా ఉండడమే బెటరా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. దాదాపు మూడు ఎన్నికలుగా పార్టీని గెలిపించుకోలేక పోతున్న వైనంతోపాటు.. ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా.. పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేసే విషయంలోనూ ఆయన వెనుకబడుతున్నారు.
ఈ పరిణామాలు.. పార్టీలో తీవ్ర అసంతృప్తికి, వ్యతిరేక ధోరణికి కూడా దారితీస్తున్నాయి. రాహుల్‌పై గత కొన్నాళ్లుగా సీనియర్లు అసంతృప్తితోనే ఉన్నారు. పార్టీ కాదన్నా.. ఔనన్నా ఇది నిజం. ప్రస్తుత ఐదు రాష్ట్రా ల అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఈఅసంతృప్తి పరోక్షంగా పార్టీని దెబ్బతీసేలా వ్యవహరించేలా చేస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీస పరువు నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అల్లాడుతోంది. ఈ క్రమంలో నాయకులు కూడా ఐక్యంగా ఉండాలి.
కానీ, దీనికి భిన్నమైన వైఖరితో సీనియర్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల వేళ పనిగట్టుకుని పొరుగు పార్టీ బీజేపీని భుజాన మోస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని పరోక్షంగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పశ్చిమాసి యాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని.. ముఖ్యంగా అమెరికా కనుసన్నల్లో మోడీ పాలన సాగిస్తున్నారని.. రాహుల్‌గాంధీ పార్లమెంటులోనూ బయట కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే.. దీనికి భిన్నంగా పార్టీ సీనియర్లు పలువురు... మోడీని మెచ్చుకుంటున్నారు. మోడీ చాలా స్థితః ప్రజ్ఞతతో వ్యవహరిస్తున్నారని.. అందుకే ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నా.. భారత్‌లో మాత్రం దానికి భిన్నంగా చమురు, గ్యాస్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని.. బీజేపీ నాయకుల కంటే కూడా.. ఎక్కువగా కాంగ్రెస్ సీనియర్లు ఎక్స్ వేదికగా మోడీని కొనియాడేస్తున్నారు. ఈ ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం కనిపిస్తోంది.
రాహుల్‌పైనే రచ్చ!
అయితే.. ఈ కారణాల నేపథ్యంలో రాహుల్ ఎందుకు మౌనంగా ఉండాలన్నది ప్రశ్న. ఎందుకంటే.. సీని యర్లకు, రాహుల్ గాంధీకి మధ్య భారీ గ్యాప్ పెరుగుతోంది. ఇది ఎన్నికల వేళ మరింత ఎక్కువగా ఉంటోం ది. కేవలం రాహుల్‌పై ఉన్న అక్కసుతోనే.. సీనియర్లు యూటర్న్ తీసుకుంటున్నారన్నది వాస్తవం. అందుకే మరికొందరు నాయకులు రాహుల్ గౌరవంగా తప్పుకోకపోతే.. పార్టీ మరింతగా నష్టపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
