మోడీని ముగ్గులోకి లాగుతున్న రాహుల్ ?
ప్రధాని మోడీ తనతో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే సవాల్ చేస్తున్నారు. తాజాగా తన ఫోన్‌ను మోడీ ట్యాప్ చేస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్ ఆస్క్ మీ సెషన్‌లో ఆరోపించారు. తన ఫోన్‌లో ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో మోడీ, బీజేపీపై రాజకీయ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
By: Satya P | 14 Nov 2026 8:52 AM ISTప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలలో తప్ప ఎక్కడా పెద్దగా మాట్లాడరని అంటారు. పార్లమెంట్ సమావేశాలలో సైతం అవసరం అయితేనే మోడీ మాట్లాడుతారు. లేకపోతే విపక్షాలను హోంమంత్రి అమిత్ షా ధీటుగా ఎదుర్కొని జవాబు చెబుతారు. మీడియా సమావేశాలు మోడీ పెట్టింది కూడా పెద్దగా ఉండదు, సోషల్ మీడియాలో మాత్రం మోడీ చాలా క్రియాశీలకంగా ఉంటారు. తన అభిప్రాయాలను ఆయన అందులోనే పంచుకుంటారు. ఈ నేపధ్యంలో నరేంద్ర మోడీని తనతో డిబేట్ కి రావాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పిలుస్తున్నారు. అంతే కాదు తనతో చర్చకు మోడీ ఎందుకు రావడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాహుల్ గాంధీ ఇదే అంశం మీద ప్రధానిని ప్రశ్నిస్తూ జనంలో ఒక సీరియస్ ఇష్యూగా మార్చుతున్నారని అంటున్నారు.
రెండిందాల లాభమే :
మోడీ తనతో డిబేట్ కి వస్తే కనుక రాహుల్ ఆ మేరకు పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్లు. అంతకంటే విజయం కూడా వేరేది ఉండదు. అందువల్ల మోడీని రాహుల్ పదే పదే పిలుస్తున్నారు. ఒక వేళ రాకపోతే చూశారా నేను అనేక అంశాల మీద చర్చకు దేశ ప్రధానిని ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చకు ఆహ్వానిస్తే రావడం లేదని మీడియా ద్వారా జనం ముందు దానిని పెట్టడం ద్వారా బీజేపీదే తప్పు అన్నట్లుగా చూపిస్తున్నారు. దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్నది బీజేపీ నాయకులకు అర్థం కావడం లేదని అంటున్నారు. ఎలా చూసుకున్నా రాహుల్ కి ఇది రాజకీయంగా లాభంగానే ఉంది అని అంటున్నారు.
రోజుకో ఆరోపణతో :
ఇక రాహుల్ గాంధీ డిబేట్ కి రావాలని మోడీని కోరుతూ అక్కడే ఆగిపోవడం లేదు. రోజుకో కొత్త ఆరోపణ చేస్తూ బీజేపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా చూస్తే తన తన ఫోన్ ప్రధాని నరేంద్ర మోదీ ట్యాప్ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలే చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ఆస్క్ మీ సెషన్‌లో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ రాహుల్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో రాహుల్ తన ఫోన్ చూపిస్తూ ప్రధానికి వ్యతిరేకంగా తన దగ్గర అన్ని ఆధారాలు ఈ ఫోన్‌లోనే ఉన్నాయని మరింతగా రాజకీయాన్ని దట్టించారు.
జనంలో అలా చూపించాలనా :
తాను డిబేట్ కి పిలిస్తే మోడీ రాలేదు అని రాహుల్ చెప్పడం ద్వారా ఏమి ఆశిస్తున్నారు అంటే రాజకీయంగా చాలానే అని అంటున్నారు. తన దగ్గర ఎన్నో నిజాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే చర్చకు ప్రధాని రావడం లేదని చెప్పడం ద్వారా ఆయన వెనకడుగు వేస్తున్నారు అన్నది జనంలో చూపించాలన్నదే రాహుల్ వ్యూహంగా ఉంది అని అంటున్నారు. అంతే కాదు తనతో డిబేట్ తర్వాత మోదీ ప్రధానిగా అసలు కొనసాగలేరని కూడా అంటున్నారు. అంటే తనతో డిబేట్ అంటే వెరీ సీరియస్ మ్యాటర్ అని చెప్పకనే చెబుతున్నారు అన్న మాట.
మింగుడు పడనిదిగానే :
రాహుల్ గాంధీని లైట్ తీసుకోవాలని బీజేపీ పెద్దలు అనుకున్నా కుదిరే వ్యవహారంగా కనిపించడం లేదు అని అంటున్నారు. ఈ మధ్య అనేక రకాలైన ఉద్యమాలతో ఆయన జనంలో ఉంటున్నారు. గతంతో పోలిస్తే గ్రాఫ్ పెరిగింది అని అంటున్నారు. అలాగే దగ్గరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వరసగా కూడా 2029 వరకూ సగానికి పైగా రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో రాహుల్ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవాలో బీజేపీకి పాలు పోవడం లేదని అంటున్నారు. మౌనంగా ఉన్నా కూడా మోడీ విషయంలో రాహుల్ చెప్పిందే నిజం అని జనాలు అనుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. మొత్తానికి అయితే రాహుల్ రాజకీయంగా బీజేపీని టీజ్ చేస్తున్నారా ర్యాగింగ్ చేస్తున్నారా లేక వ్యూహాత్మకంగా గురి చూసి దెబ్బ కొడుతున్నారా అన్నది అర్థం కావడం లేదు కానీ కమలం మాత్రం రాహుల్ దూకుడుతో కకావికలం అవుతోంది అన్నది వాస్తవం అంటున్నారు.
