Begin typing your search above and press return to search.

బ్రిక్స్ లో శాకాహారం....రాహుల్ వర్సెస్ బీజేపీ హాహాకారం !

బ్రిక్స్ సదస్సు అంటే ఈ భూగోళం మీద సగం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల నుంచి అగ్ర నేతలు వారి వెంట ఉనంత స్థాయి యంత్రాంగం అంతా హాజరైన అతి పెద్ద ఇంటర్నేషనల్ సమ్మిట్.

By:  Satya P   |   14 Sept 2026 8:58 AM IST
బ్రిక్స్ లో శాకాహారం....రాహుల్ వర్సెస్ బీజేపీ హాహాకారం !
X

బ్రిక్స్ సదస్సు అంటే ఈ భూగోళం మీద సగం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల నుంచి అగ్ర నేతలు వారి వెంట ఉనంత స్థాయి యంత్రాంగం అంతా హాజరైన అతి పెద్ద ఇంటర్నేషనల్ సమ్మిట్. ఒక ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సు గురించి అంతర్జాతీయ మీడియా అయితే అద్భుతమైన సమీక్షలు రాసింది. జపాన్ మీడియా అయితే భారత్ ఈజ్ గ్రేట్ అన్నది.

పటిష్టమైన వారధిగా :

ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం పోషిస్తున్న కీలక పాత్రను జపాన్ మీడియా అక్కడి అంతర్జాతీయ దౌత్య నిపుణులు ఎంతో ప్రశంసించారు. ప్రస్తుతం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక పటిష్టమైన వారధిగా అవతరించిందని కొనియాడారు. ఒకవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వంటి అగ్రనేతలతో బ్రిక్స్ వేదికను పంచుకుంటూనే మరోవైపు అమెరికా జపాన్, ఆస్ట్రేలియా తో కూడిన క్వాడ్ కూటమితో రక్షణ, వ్యూహాత్మక బంధాన్ని భారత్ అంతే సమర్థవంతంగా సమతుల్యం చేస్తోందని అంతర్జాతీయ నిపుణులు కొనియాడారు.

రాహుల్ కామెంట్స్ వైరల్ :

బ్రిక్స్ లో శాకాహారం వంట వడ్డించడం పట్ల కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గాలా డిన్నర్‌లో విదేశీ ప్రతినిధులకు పూర్తిగా శాకాహార వంటకాలను మాత్రమే వడ్డించడం ఏంటని ఆయన ప్రశ్నించరు. భారతదేశంలో 80 శాతం మంది మాంసాహారులే అని ఆయన అన్నారు. భారతీయ మాంసాహార వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయని చెప్పారు. మా సోదరి ప్రియాంకా గాంధీ చేసే చోళే భటూరే కూడా అంతే రుచిగా ఉంటుందని చెప్పారు. భారతదేశానికి చెందిన విభిన్న ఆహార సంస్కృతిని, వైవిధ్యాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ వాదన ప్రకారం చూస్తే అంతర్జాతీయ వేదికలపై భారతీయ ఆహార వైవిధ్యాన్ని చాటిచెప్పే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విదేశీ నేతలపై తమ ఆహార ప్రాధాన్యతలను బలవంతంగా రుద్దుతోందని పవన్ ఖేరా వంటి కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

బీజేపీ ఘాటు కౌంటర్ :

అయితే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ అంతర్జాతీయ దేశాధినేతలు హాజరైన సదస్సులో వడ్డించిన భోజన మెనూపై కూడా కాంగ్రెస్ రాజకీయం చేయడం విచారకరమన్నారు. విదేశీ అతిథులు భారతీయ సంప్రదాయ శాకాహార రుచులను ఎంతో ఆస్వాదించారని ఆయన పేర్కొన్నారు. ఇది నిజంగా కాంగ్రెస్ మార్క్ రాజకీహ్యమని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బ్రిక్స్ వంటి శిఖరాగ్ర సదస్సు భారత్ అద్భుతంగా నిర్వహించి విజయవంతం అయిన నేపధ్యంలో ఈ కామెంట్స్ రావడం కాంగ్రెస్ నుంచి అందులో విమర్శలు రావడం పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

బ్రిక్స్ మెనూలో ఏముంది :

ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహించిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా శనివారం రాత్రి భారత్ మండపంలో ఇచ్చిన ఈ అధికారిక విందులో ఏముంది అన్న ఆసక్తి మరింతగా పెరుతోంది. అయితే ఈ డిన్నర్ లో పనీర్ లబాబ్దార్, గుచ్చి మార్మిక్ అంటే హిమాలయన్ మష్రూమ్స్ తో చేసినది మిల్లెట్ పులావ్, ఖాండ్వీ, జలేబీ వంటి విభిన్న ప్రాంతీయ శాకాహార వంటకాలను పెద్ద ఎత్తున ఏర్చి కూర్చి మరీ వడ్డించారు.

లాజిక్ ఇంతేగా మరి :

దాంతో దీని మీద కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. భారత్ దేశం అంటే భిన్న రుచులు భిన్న ఆహారపు అలవాట్లతో కూడిన దేశం అన్నది కాంగ్రెస్ వాదనగా ఉంది. అయితే శాకాహారం. అయితే ఈ దేశంలో ఎనభై శాతం మాంసాహారులు అని రాహుల్ అన్నారు. వారంతా కూడా శాకాహారాన్ని కూడా ఇష్టపడి తింటున్నారు. మరి ఆ లెక్కన చూస్తే మొత్తం నూరు శాతం శాకాహారం తినే దేశంగా కూడా భారత్ ని చూడొచ్చు కదా అన్నది కొందరు నెటిజన్ల వాదనగా ఉంది. అదే మాంసాహారమే వడ్డిస్తే రాహుల్ అన్నట్లుగా ఎనభై శాతం ప్రజల ఇష్ట్రమే ప్రతిబించినట్లు అయ్యేదని అంటున్నారు. సో బీజేపీ చేసినది ఈ విషయంలో కరెక్టే కదా అని కొందరు నెటిజన్లు అంటూంటే ఇతర దేశాలలో ఉన్న అహారపు అలవాట్లను కూడా వండి వడ్డిస్తే బాగుండేదేమో అని మరి కొందరు అంటున్నారు. మొత్తానికి శాకాహారం రాజకీయ హాహాకారానికి కారణం అయింది.