మాధవ్ మర్మం: సీమలో బీజేపీ పాగా.. ఈజీయేనా?
ఏపీ బీజేపీ కొత్త చీఫ్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్... గత రెండు రోజులుగా రాయలసీమ ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తు న్నారు.
By: Garuda Media | 31 July 2025 6:00 PM ISTఏపీ బీజేపీ కొత్త చీఫ్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్... గత రెండు రోజులుగా రాయలసీమ ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తు న్నారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. పార్టీలో జోష్ పెంచే అవకాశం ఉన్నా.. క్షేత్రస్థాయిలో మా త్రం ఆయన అనుకుంటున్నట్టుగా పార్టీ పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. ఇంతకీ మాధవ్ పదే పదే చెబుతున్న మాట.. ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో సీమలో బీజేపీ సగానికి పైగా సీట్లలో విజయం సాధి స్తుందనే!.
రాయలసీమ జిల్లాల్లో మొత్తం 53 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో సగం అంటే.. 25 పైనే. మరి ఆ రేం జ్‌లో విజయం అంటే.. బీజేపీకి సాధ్యమేనా? అనేది ప్రశ్న. గత ఏడాది ఎన్నికల్లో జమ్మలమడుగు నియో జకవర్గంలో విజయం దక్కించుకున్నారు. అయితే.. బీజేపీ ఎప్పుడు గెలిచినా.. టీడీపీతో పొత్తు ఉన్నప్పు డు మాత్రమే సాధ్యమవుతోంది. టీడీపీతో పొత్తు కాదని.. 2019లో ఒంటరి పోరాటం చేసినప్పుడు చాలా మంది డిపాజిట్లు కూడా కోల్పోయారు. సో.. పొత్తులో ఉంటేనే బీజేపీని ప్రజలు గుర్తిస్తున్నారు.
ఇక, పొత్తు ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ అన్నో ఇన్నో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. కానీ, మాధవ్ చెబుతున్నట్టుగా.. ఆయన రాజకీయ మర్మం మాత్రం సాకారం అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే.. గుండుగుత్తగా 53 సీట్లలో బీజేపీకి 25 సీట్లు ఇచ్చేసే ఆలోచన టీడీపీ చేయదు. ఒకవేళ ఇచ్చినా.. సీమకు బీజేపీ ఏం చేసిందన్న ప్రశ్నలు తెరమీదికి వస్తాయి. సుదీర్ఘకాలంగా.. విభజన చట్టంలోనే ఉన్న కడప ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం మొండి చేయి చూపిస్తూనే ఉంది.
ఇప్పటికీ.. సీమలో ఏర్పాటు కావాల్సిన రైలు ప్రాజెక్టులు ఎక్కడివక్కడే ఉన్నాయి. ఇటీవల ఒక్క రైలు ప్రాజెక్టును మాత్రం ఇచ్చారు. తిరుపతి- కాట్పాడిమధ్య డబుల్ లైన్ మంజూరు చేశారు. ఇది తప్ప సీమకు ఏం చేశారన్నది ప్రశ్న. ఇక, ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు విషయంపై బీజేపీ చేసిన ప్రయత్నం కూడా ఏమీ లేదు. చంద్రబాబు పదిసార్లు ఢిల్లీ తిరిగారు. మరి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు కనీసం పట్టించుకున్న దాఖలానే లేదు. అలాంటప్పుడు.. సీమలో బీజేపీ పాగా వేయాలని మాధవ్ చెబుతున్న మాట... ఏమేరకు సాకారం అవుతుంది? అనేది ప్రశ్న. ఏదేమైనా.. బీజేపీ వ్యూహం ప్రకారం అడుగులు వేస్తే.. వైసీపీ ఓటు బ్యాంకును మాత్రం చీల్చే అవకాశం ఉంటుంది.
