Begin typing your search above and press return to search.

మాధవా... మౌనమేనా ?

ఏపీ బీజేపీని ఆయన చేతులలో పెట్టినపుడు అద్భుతాలు జరుగుతాయని అనుకోకపోయినా ఒక పెద్ద కదలిక అయితే వస్తుందని అంతా అనుకున్నారట.

By:  Satya P   |   11 Oct 2025 9:34 AM IST
మాధవా... మౌనమేనా ?
X

ఏపీ బీజేపీని ఆయన చేతులలో పెట్టినపుడు అద్భుతాలు జరుగుతాయని అనుకోకపోయినా ఒక పెద్ద కదలిక అయితే వస్తుందని అంతా అనుకున్నారట. బీజేపీలో అయితే ఇక మీదట దూకుడుగానే ఉంటుంది అని కూడా భావించారు అని అంటున్నారు. దానికి కారణం బీసీ వర్గానికి చెందిన యువ నేత, ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం బీజేపీలో ఒరిజినల్ లీడర్ కావడం తో బీజేపీకి మహర్దశ వచ్చిందని కూడా భావించారని అంటున్నారు.

ఆ ఊపు లేదా :

అయితే మాధవ్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాక అనుకున్న ఊపు అయితే పార్టీలో ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు. ఆయన పార్టీ సిద్ధాంతాల గురించి చెబుతున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం దేని మీద అయినా కార్యక్రమం ఇస్తే చేస్తున్నారు తప్పించి సొంతంగా పార్టీ యాక్టివిటీస్ ని పెంచలేకపోతున్నారు అని అంటున్నారు. అంతే కాదు అధికార ప్రతినిధులుగా చాలా మంది ఉన్నారు. అలాగే కొత్త కార్యవర్గం కూడా నియమించారు. వారంతా మూగనోము పట్టినట్లుగా ఉంటున్నారు అని చెబుతున్నారు. దాంతో పార్టీలో స్తబ్ధత అయితే పై నుంచి దిగువ దాకా ఉంది అని అంటున్నారు.

యాక్షన్ ప్లాన్ ఏదీ :

పార్టీని జనంలోకి తీసుకుని పోవాల్సిన కీలక సమయం ఇదని అంటున్నారు. వచ్చే ఏడాది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో చూస్తే కనుక కమలం కదం తొక్కాల్సి ఉంది, దాని కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ని రెడీ చేయాల్సి ఉందని అంటున్నారు. కానీ మాధవ్ ఆ విషయంలో పెద్దగా దృష్టి పెట్టడం లేదని అంటున్నారు

కూటమి మిత్రుడుగా :

ఏపీలో కూటమిలో బీజేపీ ఉంది. దాంతో అధికారంలో ఉంటూ పార్టీని ప్రజలలోకి తీసుకుని వెళ్ళడం ఒక విధంగా సులువు. మరో వైధంగా సవాల్ అని అంటున్నారు. కూటమి పార్టీగా ప్రభుత విధానాలను మెచ్చుకుంటూనే ఉండాలి. అయితే అదే సమయంలో జనాలు ఏమి ఆశిస్తున్నారు వారి ఆకాంక్షలు ఏమిటి అన్నది కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా అని పార్టీ నేతలు అంటున్నారు పార్టీని క్షేత్ర ష్తాయి నుంచి నిర్మించుకోకపోతే ఎలా అన్న చర్చ కూడా వస్తోంది.

ప్రత్యేకత ఉండాలిగా :

కూటమి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం తప్పు కాదు కానీ బీజేపీకి ఒక ప్రత్యేకత ఉండాలి కదా అని పార్టీ నేతలు అంటున్నారుట. ప్రతీ దానికి జై కొడుతూ పోతే బీజేపీ ప్రత్యేకత ఏమిటి అన్నది కూడా జనాలకు ఎలా తెలుస్తుందని పార్టీ జెండా అజెండా జనాలకు చేరువ చేయల్సిన వేళ కీలక తరుణంలో పార్టీ అధినేత వెనకబడిపోతున్నారు అని అంటున్నారు. అసలే అంతంత మాత్రంగా పార్టీ చాలా చోట్ల ఉందని దాంతో యాక్టీటీస్ కూడా లేకపోతే మరింత ఇబ్బందిలోకి వెళ్తామని బీజేపీ హితైషులు అంటున్నారు. దాంతో మాధవా మౌనమేల అని కూడా అంటున్నారని టాక్.