గ్రౌండ్ రియాల్టీ: సిందూర రెడ్డికి సెగ.. !
వాస్తవానికి ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజాదర్బార్‌లలో పాల్గొని సమస్యలు పరిష్కరించా లని ఎమ్మెల్యేలకు చంద్రబాబు చెబుతున్నారు.
By: Garuda Media | 14 Jan 2026 10:43 AM ISTపైకి ఎంత బాగున్నామని చెప్పుకొన్నా.. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే.. నాయకుల పనితీరు. .ప్రజల నాడి ఇట్టే తెలుస్తాయి. ఎమ్మెల్యేలు ఏమేరకు ప్రజలకు చేరువ అవుతున్నారు. ప్రజలు వారి గురించి ఏమను కుంటున్నారు? అనే విషయాలు స్పష్టం అవుతాయి. ఈ క్రమంలో తాజాగా శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పరిస్థితులను టీడీపీ తెలుసుకుంది. ఐవీఆర్ ఎస్ సర్వే ద్వారా ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకుంటామని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు.
ఈ క్రమంలో ఒక్కొక్క నియోజకవర్గంపై గ్రౌండ్ లెవిల్లో ఆయన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పుట్టపర్తి వ్యవ హారంపై ప్రజలు ఆసక్తిగా స్పందించారు. క్షేత్రస్థాయిలో సిందూర రెడ్డి కనిపించడం లేదని పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి అని అంటున్నారు. తన అవసరం ఉంటే తప్ప ఆమె ప్రజల మధ్యకు రావడంలేదని చెబుతున్నారు. ఇక, ప్రజా పిర్యాదులు తీసుకునే కార్యక్రమానికి వస్తున్నప్పటికీ.. మొక్కుబడిగానే స్పందిస్తున్నారన్నది మరో ప్రధాన విమర్శ.
వాస్తవానికి ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజాదర్బార్‌లలో పాల్గొని సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు చెబుతున్నారు. దీనికి వారు ఊ.. కొడుతున్నారు.కానీ, తీరా చూస్తే.. 50 శాతం కన్నా తక్కువ మందే ఈకార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక, పుట్టపర్తిలో అయితే.. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జోక్యం ఇప్పటికీ ఉందని.. ఆయనే అధికారులను నడిపిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. సరే.. అనుభవజ్ఞుడు కావడంతో ఆయనను తప్పుపట్టడం లేదు.
కానీ.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాల్సిన ఎమ్మెల్యే సిందూరరెడ్డి మౌనంగా ఉండడం.. ఏదో నెలకు రెండు మూడు రోజులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండడం వంటిప్రశ్నగా మారుతున్నాయి. తొలిసారి ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న నేపథ్యానికి తోడు మహిళా ఎమ్మెల్యేగా ఆమెపై చాలానే అంచనాలు ఉన్నాయి. అయితే.. ఆమె వాటి రీచ్ అయ్యే రేంజ్‌లో ఎక్కడా పనిచేయడం లేదని పార్టీకి అందిన ఐవీఆర్ ఎస్ సర్వే రిజల్ట్‌ను బట్టి తెలుస్తోంది అని ప్రచారం జరుగుతుంది. మరి ఆమె తన పనితీరు మార్చుకుంటారో లేదో చూడాలి.
