భారత్ కే కాదు పాకిస్థాన్ ప్రపంచానికే ప్రమాదకరం.. ఇదిగో ప్రూఫ్!
ఈ సందర్భంగా... పాకిస్థాన్ అక్రమ అణు వ్యవహారాలపై అమెరికా అధ్యక్షుడు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
By: Raja Ch | 26 Dec 2025 3:00 PM ISTఅణ్వాయుధాలు కలిగిన ఎకైన ముస్లిం సైనిక పాలన దేశంగా పేరెన్నికగన్న పాకిస్థాన్ విషయంలో చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తాయన్న సంగతి తెలిసిందే. అనధికారికంగా ప్రజాస్వామ్యం దేశం కాని పాకిస్థాన్ వద్ద అణ్వాయుధలు ఉండటాన్ని.. పిచ్చొడి చేతిలో రాయిగా పలువురు అభివర్ణిస్తుంటారు. ఈ సమయంలో సుమారు పాతికేళ్ల క్రితమే ఈ విషయంపై రష్యా అధక్షుడు పుతిన్.. అమ్మటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారట.
అవును... పాకిస్థాన్ అణ్వాయుధాల గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్.. గతంలో ఓ సారి, సుమారు పాతికేళ్ల క్రితమే ఆందోళన వ్యక్తం చేశారంట. ఈ సందర్భంగా... ఆ దేశాన్ని అణ్వాయుధాల కలిగిన ఒక సైనిక కూటమిగా అభివర్ణిస్తూ పుతిన్ అమెరికా వద్ద ప్రస్తావించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సుమారు పాతికేళ్ల క్రిందట రష్యా అధ్యక్షుడు పుతిన్ - అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ మధ్య జరిగిన సంభాషణ తాజాగా వెలుగులోకి వచ్చింది.
సమాచారం హక్కు చట్టం దావా తర్వాత ఈ వారం.. అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ 2001-2008 నాటి వివరాలను బహిర్గతం చేసింది. ఇందులో.. పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని అణు కార్యక్రమాన్ని నాడు తీవ్ర సమస్యగా పుతిన్ - బుష్ పరిగణించినట్లు ఆ పత్రాలను బట్టి స్పష్టమవుతోంది.
జూన్ 16 - 2021న స్లోవేనియాలోని బర్నోకోట్ జరిగిన వ్యక్తిగత సమావేశంలో పుతిన్, నాటి అమెరికా అధ్యక్షుడు బుష్ వద్ద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. అణు కార్యక్రమాల నిబంధనలను ఉల్లంఘించిట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాల విషయంలో వ్యవహరించినట్లుగా.. పాకిస్థాన్ పై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని నాడు అమ్రికా ప్రెసిడెంట్ ను పుతిన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా. పాక్ ను అణ్వాయుధాలు కలిగిన సైనిక కూటమిగా పేర్కొన్నారు.
ఇదే సమయంలో.. పాక్ లో ప్రజాస్వామ్యం లేదని.. అది పూర్తిగా మిలిటరీ పాలనలో ఉందని.. అయినప్పటికీ పశ్చిమ దేశాలు దానిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని.. ఈ సమయంలో దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని రష్యా అధ్యక్షుడు తెలిపారు. ఇదే సమయంలో వెస్ట్రన్ కంట్రీస్, పాక్ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంపైనా పుతిన్ పలు అనుమానాలు లేవనెత్తారు. అయితే.. ఈ వ్యాఖ్యలతో బుష్ ఏకీభవించారు.
ఈ సందర్భంగా... పాకిస్థాన్ అక్రమ అణు వ్యవహారాలపై అమెరికా అధ్యక్షుడు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే సమయంలో.. పాక్ అణుపితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కార్యకలాపాలు బయటపడిన తర్వాత ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చామని.. అదేవిధంగా.. ఖాన్ తో పాటు అతడి అనుచరులను నిర్బంధించేలా చేశామని నాడు బుష్ వెల్లడించారు. కానీ ఈ అణు పదార్థాలు పాక్ నుంచి ఎవరెవరికి చేరాయనే విషయంపై మాత్రం క్లారిటీ లేదని తెలిపారు.
కాగా... 2001లో పాకిస్థాన్ ను దాని సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ నడిపించిన సంగతి తెలిసిందే. పాక్ అణ్వస్త్ర విస్తరణపై భారత్ చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో.. ఇదే విషయంపై సుమారు పాతికేళ్ల క్రితమే రష్యా అధ్యక్షుడూ చెప్పడం గమనార్హం. అందుకే అంటారు... పాకిస్థాన్ అనే దేశం భారత్ కే కాదు ప్రపంచానికే ప్రమాదకరం అని!!
