పుతిన్ పర్యటనలో హైలెట్ కారు ఇదే
రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ భారత్ కు మరోసారి వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు వస్తున్న ఆయనకు సంబంధించి బోలెడన్ని వార్తలు వస్తున్నాయి.
By: Garuda Media | 4 Dec 2025 9:54 AM ISTరష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ భారత్ కు మరోసారి వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు వస్తున్న ఆయనకు సంబంధించి బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. వీటిల్లో సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు అందరి చూపు పుతిన్ కు కల్పించే భద్రత.. ఆయనకు సంబంధించి పెద్దగా వార్తల్లో రాని అంశాల మీదనే ఆసక్తి వ్యక్తమవుతుంది. ఆ విషయానికి వస్తే.. పుతిన్ ప్రయాణించే లగ్జరీ కారు ఆరస్ సెనట్ ను హాట్ టాపిక్ గా చెబుతారు.
ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన.. అత్యంత భద్రతతో కూడిన హైటెక్ కారుగా దీన్ని చెప్పాలి. సింఫుల్ గా ఒక్క లైన్ లో చెప్పాలంటే నడిచే దుర్గంగా దీన్ని అభివర్ణిస్తారు. శత్రు దుర్భేద్యంగా ఉండే ఈ కారు అవసరమైతే దాడికి ప్రతిదాడి ఇట్టే చేస్తుంది. ఎందుకంటే ఈ కారులో అనేక అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి మరి. ఈ కారును ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు.
ఈ మధ్యన చైనాలో షాంఘై సహకార శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోడీ కూడా ఇదే కారులో ప్రయాణించారు. 2018లో ఆరస్ సెనట్ కారు పుతిన కాన్వాయ్ లో చేరింది. అప్పటి నుంచి ఆ కారు ప్రభుత్వ వాహనంగా ఉంటోంది. ప్రభుత్వ అవసరాల నిమిత్తం తయారు చేసే సాయుధ వాహనాలను ఉద్దేశించి చేపట్టిన కోర్టెజ్ ప్రాజెక్టులో భాగంగా లిమోజిన్ ను తయారు చేశారు. ఇక..ఆరస్ సెనట్ కారును కేవలంరష్యాలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఈ బుల్లెట్ ఫ్రూప్ కారులో పేలుడు సంభవించినా దీనికి ఏమీ కాదు.
4.4-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వీ8 ఇంజన్‌తో హైబ్రిడ్ సిస్టమ్‌ను కలిగి ఉంది, ఇది దాదాపు 598 హార్స్‌పవర్.. 880 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. సొగసైన్ ఎల్ఈడీ హెడ్ లైట్ తో పాటు ఎత్తైన గ్రిల్ దీనికి గంభీరమైన రూపాన్ని ఇస్తుంది. దీని డిజైన్ ను పలువురు రోల్స రాయిస్ ఘోస్ట్ తో పోలుస్తారు. ఈ కారు రష్యన్ స్టైల్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ఆరస్ సెడాన్ చూసేందుకు రాయల్ గా.. స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇందులోని హైటెక్ ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే. ఈ కారును రష్యాకు చెందిన ఆరస్ మోటార్స్ అనే సంస్థ తయారు చేస్తుంది. ఆరస్ కారు మూడు వేరియంట్లలో వస్తుంది. అవి సెనట్ స్టాండర్డ్.. సెనట్ లాంగ్.. సెనట్ లిమోజిన్. 2024లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కు ఇదే కారును గిఫ్టుగా ఇచ్చారు.
