చిన్నమ్మ కీలక నిర్ణయంతో రెడీ !
ఎన్టీఆర్ తనయ, ఆయన రాజకీయ వారసురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. 2004లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
By: Satya P | 6 Nov 2025 8:55 AM ISTఎన్టీఆర్ తనయ, ఆయన రాజకీయ వారసురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. 2004లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా పాలిటిక్స్ లో కంటిన్యూ అవుతున్నారు ఇక 2029లో ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది ఏమిటి ఆ నిర్ణయం అంటే సీరియస్ గానే అని అంటున్నారు. ఆమె ఇప్పటికి మూడు సార్లు ఎంపీగా పదవులు అందుకున్నారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఏపీలో బీజేపీ లాంటి జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె మంచి వాగ్దాటితో మంచి సబ్జెక్ట్ తో మంచి పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందారు
ఇక చాలు అంటూ :
ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ పెద్ద అల్లుడు. ఆయన 1982 నుంచి టీడీపీ స్థాపన లో ఉంటూ ఆ పార్టీలో ఎదిగి మూడు దశాబ్దాల పాటు రాజకీయ జీవితం చూశారు. ఎంపీగా రాష్ట్ర మంత్రిగా ఆయన పనిచేసారు. లోక్ సభ రాజ్యసభలలో కూడా ఆయన పనిచేశారు. ఆయన తన సతీమణిని రాజకీయాలోకి రావడాన్ని స్వాగతించారు. ఆ మీదట ఆయన తానుగా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. ఇపుడు పురంధేశ్వరి కూడా అదే విధంగా తాను కూడా ఇక చాలు అనుకుంటున్నారని టాక్ పెద్ద ఎత్తున సాగుతోంది.
దక్కని పదవి :
ఇక చూస్తే పురంధేశ్వరి 2014 నుంచి బీజేపీలో ఉన్నారు ఆమె పదేళ్ళ పాటు పార్టీలో పనిచేసి ఆ పార్టీ తరఫున పనిచేశారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో ఏపీలో కూడా బీజేపీ భాగస్వామ్యంతో ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. ఇక కేంద్రంలో మంత్రి పదవి ఆమెకు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ చిత్రంగా ఆమెకు ఆ పదవి అందని పండు అయింది. మరే ఇతర పదవులు కూడా దక్కలేదు దాంతో ఆమె వర్గంలో ఒకింత అసంతృప్తి అయితే ఉంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో మిగిలిన మూడున్నరేళ్ల కాలాన్ని నెమ్మదిగా గడిపేసి 2029 ఎన్నికల ముందు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నారుట.
వారసుడు సిద్ధం :
ఇక దగ్గుబాటి దంపతులకు వారసుడిగా దగ్గుబాటి చెంచురాం హితేష్ ఉన్నారు ఆయనను 2029 ఎన్నికల్లో పోటీ చేయిని తాము తప్పుకోవాలని భావిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే హితేష్ పాలిటిక్స్ పట్ల ఆకర్షితుడు అయ్యారు ఆయన నిజానికి 2019లో వైసీపీ తరఫున పోటీ చేయాల్సి ఉంది. కానీ అలా జరగలేదు, కొన్ని సాంకేతిక అంశాల వల్ల దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేయాల్సి వచ్చింది దాంతో 2029 లో కచ్చితంగా పోటీకి దిగుతారు అని అంటున్నారు అది కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అని అంటున్నారు అయితే ఎమ్మెల్యేగానా లేక ఎంపీగానా అన్నది తెలియడం లేదు, పైగా ఆయన తనకంటూ ఒక నియోజకవర్గాన్ని చూసుకోవడంలో ప్రస్తుతం ఉన్నారని అంటున్నారు. ఇక టీడీపీ హైకమాండ్ కూడా హితేష్ ని పార్టీలో తీసుకుని టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఏ మేరకు జరుగుతుందో.
