Begin typing your search above and press return to search.

ఏ438586 టిక్కెట్ కు రూ.11 కోట్లు.. ఎవరీ అదృష్టవంతుడు!

దీపావళి పండుగను పురస్కరించుకుని పంజాబ్‌ ప్రభుత్వం నిర్వహించిన బంపర్‌ డ్రాలో ఓ అదృష్టవంతుడికి ఏకంగా రూ.11 కోట్ల బహుమతి వరించింది.

By:  Raja Ch   |   2 Nov 2025 12:26 PM IST
ఏ438586 టిక్కెట్  కు రూ.11 కోట్లు.. ఎవరీ అదృష్టవంతుడు!
X

దీపావళి పండుగను పురస్కరించుకుని పంజాబ్‌ ప్రభుత్వం నిర్వహించిన బంపర్‌ డ్రాలో ఓ అదృష్టవంతుడికి ఏకంగా రూ.11 కోట్ల బహుమతి వరించింది. అయితే డబ్బు తీసుకునేందుకు ఆ వ్యక్తి మాత్రం రాలేదని అంటున్నారు. దీంతో... నిబంధనల ప్రకారం 25 రోజులు వేచిచూశాక ఆ డబ్బు ప్రభుత్వ పరమవుతుందని చెబుతున్నారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ లాటరీ ఫలితాలు వెల్లడయ్యాయి.

అవును... దీపావళి పండుగను పురస్కరించుకుని పంజాబ్‌ ప్రభుత్వం నిర్వహించిన బంపర్‌ డ్రాలో ఓ అదృష్టవంతుడికి ఏ438586 టిక్కెట్ పై ఏకంగా రూ.11 కోట్ల బహుమతి వరించింది. బఠిండాలో ఓ పంపిణీదారు నుంచి కొన్న టికెట్‌ కు ఈ ప్రథమ బహుమతి వరించింది. విషయం తెలియగానే అనేకమంది అక్కడకు చేరి మిఠాయిలు పంచుకుంటూ, డప్పులు వాయిస్తూ పండుగ చేసుకున్నారు.

అయితే రూ.11 కోట్లు గెలుచుకున్న టికెట్‌ కొన్న విజేత మాత్రం అయిపూఅజా లేరని అంటున్నారు. ఆన్‌ లైన్లో ఫలితాలు చూసుకుంటామని చెప్పి చాలామంది తమ వివరాలు ఇవ్వకుండా వెళ్లిపోతారని, అందువల్ల విజేత ఎవరో తెలియడంలేదని పంపిణీదారు చెబుతున్నారు.

పంజాబ్ దీపావళి బంపర్ లాటరీ 2025 బహుమతి వివరాలు!:

1వ బహుమతి: రూ.11 కోట్లు — ఈ బహుమతిని కేవలం 1 విజేత మాత్రమే అందుకుంటారు.

2వ బహుమతి: రూ.1 కోటి — మొత్తం 3 విజేతలు, ఒక్కొక్కరికి రూ.1 కోటి.

3వ బహుమతి: రూ.50 లక్షలు — 3 విజేతలు, ఒక్కొక్కరికి రూ.50 లక్షలు.

4వ బహుమతి: రూ.10 లక్షలు — 9 విజేతలు, ఒక్కొక్కరికి రూ.10 లక్షలు.

5వ బహుమతి: రూ.5 లక్షలు — 9 విజేతలు, ఒక్కొక్కరికి రూ.5 లక్షలు.

6వ బహుమతి: రూ.9,000 — ఈ విభాగంలో 2,400 మంది విజేతలు.

7వ బహుమతి: రూ.7,000 — 2,400 మంది విజేతలు, ఒక్కొక్కరికి రూ.7,000 అందుతుంది.

ఈ క్రమంలో తాజాగా టాప్ - 3 బహుమతులు గెలుచుకున్న టిక్కెట్ నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి.

పంజాబ్ లాటరీ దీపావళి బంపర్ 2025 (మొదటి విజేత): ఏ 438586

పంజాబ్ లాటరీ దీపావళి బంపర్ 2025 (2వ విజేతలు): ఏ 821602, బీ 590883, సీ 754234

పంజాబ్ లాటరీ దీపావళి బంపర్ 2025 (3వ విజేతలు): ఏ 469288, బీ 959352, సీ 492061