Begin typing your search above and press return to search.

పులివెందుల మంత్రి....వైసీపీకి సరికొత్త పొలిటికల్ ట్విస్ట్

ఏపీలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు చూస్తే కనుక పొలిటికల్ గా సెన్సేషనల్ వైబ్రేషన్స్ వస్తాయి. అలాంటి సీట్లలో పులివెందుల ముందు వరుసలో ఉంటుంది

By:  Satya P   |   24 Sept 2025 5:00 AM IST
పులివెందుల మంత్రి....వైసీపీకి  సరికొత్త పొలిటికల్ ట్విస్ట్
X

ఏపీలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు చూస్తే కనుక పొలిటికల్ గా సెన్సేషనల్ వైబ్రేషన్స్ వస్తాయి. అలాంటి సీట్లలో పులివెందుల ముందు వరుసలో ఉంటుంది. ఒక అర్ధశతాబ్దపు కాలంగా ఒకే కుటుంబానికి అంకితం అయిపోయిన నియోజకవర్గంగా రికార్డుని సాధించిన పులివెందుల ఇప్పటిదాకా ఎన్నో రాజకీయ సంచలనాలు చూసింది. పులివెందుల అంటేనే వైసీపీకి కంచుకోట. వైసీపీకి హార్ట్. ఆ కుటుంబానికి సేఫ్ గార్డ్.

ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా :

ఇక చూస్తే పులివెందుల చూడని పదవులు లేవు. వైఎస్సార్ కుటుంబం అందుకున్న పదవులు అన్నీ పులివెందుల ఇచ్చినవే. ఇద్దరు ముఖ్యమంత్రులను ఈ గడ్డ చూసింది. మంత్రిగా వివేకానందరెడ్డి పనిచేశారు. ఎంపీలుగా వైఎస్సార్ వివేకా పనిచేశారు. జగన్ సైతం ఎంపీగా రెండు సార్లు నెగ్గారు. విజయమ్మ ఎమ్మెల్యే అయ్యారు. ఇక జగన్ సీఎం గా అయిదేళ్ళ జమానాను కూడా ఈ మధ్యనే పులివెందుల చూసింది. అయితే ఇప్పుడు వైసీపీకి గడ్డు కాలం నడుస్తోంది అని అంటున్నారు. పులివెందుల కంచుకోటను మంచుకోటలా చేయాలని కూటమి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని అంటున్నారు. అంతే కాదు తాజాగా జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇది వైఎస్సార్ ఫ్యామిలీకే తీరని మచ్చగా మారింది.

బీటెక్ రవిదేనా :

మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి తెలుగుదేశం పార్టీకి అంది వచ్చిన నాయకుడు. పసుపు పార్టీ కసికి తన కృషిని మిక్స్ చేసి వైఎస్సార్ కోటలనే టార్గెట్ చేస్తూ సక్సెస్ అవుతున్నారు. గతంలో వైఎస్ వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి బీటెక్ రవి చరిత్ర సృష్టిస్తే ఇపుడు ఆయన సతీమణి పులివెందుల జెడ్పీటీ ఉప ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి వైసీపీ అధినాయకత్వానికే బిగ్ షాక్ ఇచ్చేశారు. ఈ మొత్తం విజయాల వెనక బీటెక్ రవి ఉన్నారు. ఆయన టీడీపీలో 2011లో చేరారు. ఆనాడు వైఎస్ విజయమ్మ మీద పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా టీడీపీ హైకమాండ్ కి సూదంటు రాయిగా ఆకట్టుకున్నారు. అందుకే ఆయనకే రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ వచ్చిన పార్టీ గతంలో ఎమ్మెల్సీగా నిలబెట్టి గెలిపించూంది.

దశ తిరగనుందా :

ఇక బీటెక్ రవి దశ తొందరలోనే మారనుందని ఆయనకు రాజకీయ యోగం పట్టనుంది అని అంటున్నారు. బీటెక్ రవి పనితీరు పట్ల ఆయన పట్టుదల పట్ల టీడీపీ అధినాయకతం నూరు శాతం సంతృప్తిని వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు లోకేష్ ఇద్దరికీ రవి ఎంతగానో నచ్చేశారు. అందుకే ఆయనను ఏకంగా మంత్రి సీటులోనే కూర్చోబెట్టాలని భావిస్తున్నారు. తొందరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీటు ఇచ్చి శాసనమండలిలో చోటు ఇస్తారు అని అంటున్నారు. ఆ మీదట ఆయనకు మంత్రి పదవి కూడా రెడీ చేసి ఉంచారని అంటున్నారు.

ఆయన ప్లేస్ లో ఈయన :

కడప జిల్లా నుంచి మంత్రిగా ప్రస్తుతం మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి వ్యవహరిస్తున్నారు ఆయన రాయోచోటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పనితీరు పట్ల అధినాయకత్వం అంత సంతృప్తిగా లేదని అంటున్నారు. కడప నుంచి మంత్రి అంటే వైసీపీని నూరు శాతం కట్టడి చేయాల్సి ఉంటుందని ఆ విషయంలో అయితే మండిపల్లి దూకుడు పెద్దగా లేదని ఒక ఒపీనియన్ గా ఉందిట. దాంతో నేరుగా వైఎస్సార్ ఇలాకానే టచ్ చేసి కంచుకోటలోనే టీడీపీ జెండా పాతిన బీటెక్ రవి సమర్ధుడు అని ఆయనకే మంత్రి పదవి ఇస్తే జగన్ కే డైరెక్ట్ గా పొలిటికల్ ప్రెషర్ పెంచినట్లు అవుతుందని ఊహిస్తున్నారుట.

కొత్త రాజకీయ అనుభవం :

ఇప్పటిదాకా పులివెందుల నుంచి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వైఎస్సార్ ఫ్యామిలీ వారే చేశారు. కానీ బీటెక్ రవికి మంత్రి పదవి ఇస్తే మాత్రం వైఎస్సార్ కుటుంబం దాటి ఈ కీలక పదవి అందుకున్న వారుగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టిస్తారు. అంతే కాదు ఆయన అధికారంతో పులివెందుల రాజకీయాన్ని మార్చడమే కాకుండా వైఎస్సార్ కంచుకోటలో పసుపు బలాన్ని పెంచుతారని అంటున్నారు. ఈ భారీ టార్గెట్ తోనే ఆయనను మంత్రి చేసేందుకు మాస్టర్ ప్లాన్ తో టీడీపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. నిజంగా బీటెక్ రవి మంత్రి అయితే అందునా జగన్ సొంత ఇలాకాలో ఆయన రాజ్యం చేస్తూంటే కూటమి పరిభాషలో చెప్పాలంటే పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఆయనను ఎలా ఎదుర్కొంటారు అన్నదే కదా అసలైన పొలిటికల్ ట్విస్ట్ అని అంటున్నారు.